నేటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం | GHMC Election campaign to end today | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం

Published Sun, Jan 31 2016 12:51 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

నేటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం - Sakshi

నేటితో ముగియనున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఈ ఎన్నికల ప్రచారానికి తెరపడనుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 7, 802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

3, 200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. అంధుల కోసం ప్రత్యేక బ్యాలెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేటి సాయంత్రం 5.00 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచుతారని బి.జనార్దన్రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement