11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక | GHMC Mayor, deputy mayor election on 11th, says commissioner | Sakshi
Sakshi News home page

11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

Published Fri, Feb 5 2016 9:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎలాంటి సమస్య లేకుండా, ప్రశాంతంగా జరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాయంత్రం ఆరు గంటల్లోపే 50 డివిజన్లలో ఫలితాలు వెల్లడి చేశామన్నారు. ఓట్ల లెక్కింపులో ఒకటి, రెండుచోట్ల కొద్దిపాటి అంతరాయం కలిగినా వెంటనే ఆ సమస్యను పరిష్కరించామన్నారు.

 

కేవలం జాంబాగ్లో మాత్రమే రెండుసార్లు కౌంటింగ్ నిర్వహించినట్లు చెప్పారు.  మరోవైపు పురానా పూల్లో కౌంటింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ప్రిసైడింగ్ అధికారిగా హైదరాబాద్ కలెక్టర్ వ్యవహరిస్తారని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement