కూకట్‌పల్లి: కూకట్‌పల్లి సర్కిల్‌లో టీడీపీకి పెట్టని కోటలాంటి హైదర్‌నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఎన్నికల లెక్కింపు ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ గతంలో అనేకసార్లు టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఇటుదృష్టి సారించడం తో పాటు మంత్రి కేటీఆర్ ఈ డివి జన్‌ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతోప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడినట్టు చర్చించుకుం టున్నా రు. ఓట్ల లెక్కింపు సందర్భం గా అన్ని రౌండ్లలోనూ టీడీపీకి ఆధిక్యం కని పించగా...కేవలం రెండో రౌండ్‌లోనే టీఆర్‌ఎస్‌కు 1,372 ఓట్ల మెజారిటీ వచ్చింది. దీంతో ఆ పార్టీ అభ్యర్ధి 438 ఓట్లు తేడాతో విజయం సాధించారు. మొదటి రౌండ్‌లో టీడీపీకి 433 ఓట్ల మెజారిటీ రాగా.. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 1,372 మెజారిటీ వచ్చిం ది. మూడో రౌండ్ లో టీడీపీకి 54, నాలుగో రౌండ్‌లో 304 ఓట్ల మెజారిటీ కనిపించింది.
ఐదో రౌండ్‌లో టీడీపీకి 62 ఓట్లు ఆధిక్యం వచ్చింది. నాలుగు రౌండ్‌లలో కలిపి తెలుగుదేశం అభ్యర్థికి 934 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. దీంతో రెండో రౌండ్‌లో వచ్చిన 1372 ఓట్లు టీఆర్‌ఎస్‌ను విజ యం వైపు నడిపించాయి. టీడీపీ టికెట్ ఆశించి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగిన కడియాల సుబ్బారావుకు 459 ఓట్లు వచ్చాయి. ఈ చీలికే తెలుగుదేశం విజయావకాశాలను దెబ్బ తీసిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. టీడీ పీ అభ్యర్థుల ఎంపికలో చివరి వరకూ కొనసాగిన ఉత్కంఠ కొంపముంచిందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
టీఆర్‌ఎస్‌ను కాపాడిన మురికివాడలు
హైదర్‌నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు అన్ని ప్రాంతాల్లో ఓట్లు తగ్గిపోగా... కేవ లం హైదర్ నగర్, నందమూరి నగర్, కృష్ణవేణి నగర్, శంశీగూడ ప్రాంతాలలో 1372 ఓట్ల మెజారిటీ రావడంతో విజయం సాధించింది. ఈ ప్రాంతంలో ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆద్యంతం...ఆసక్తికరం
Published Sat, Feb 6 2016 1:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement