'బాబు వైఖరితోనే గ్రేటర్‌లో ఓటమి' | rajya sabha former member yalamanchili sivaji speaks over TDP failures in ghmc elections | Sakshi
Sakshi News home page

'బాబు వైఖరితోనే గ్రేటర్‌లో ఓటమి'

Published Sun, Feb 7 2016 6:47 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

'బాబు వైఖరితోనే గ్రేటర్‌లో ఓటమి' - Sakshi

'బాబు వైఖరితోనే గ్రేటర్‌లో ఓటమి'

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి కారణంగా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు స్నేహపూర్వకంగా మెలగడం వల్ల ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ ఫ్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయలేకపోయారని అన్నారు. ఈ విధానం వల్ల టీడీపీ కేడర్‌కు బాబు ధైర్యాన్ని ఇవ్వలేకపోవడంతోపాటు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేయలేకపోయారని శివాజీ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రులు ఇద్దరూ స్నేహంగా ఉన్న సమయంలో తాము స్థానికులతో ఎందుకు వివాదాలకు పోవాలని భావించి సీమాంధ్ర ఓటర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు ఊహించినవేనని, ఒక ప్రాంతీయపార్టీ మరో రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవని, చరిత్ర ఇదే చెబుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా పక్క రాష్టంలో పార్టీని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం కాదని శివాజీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement