former member
-
ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ ఇక లేరు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సోమవారం అర్థరాతత్రి కన్నుమూశారని అభిజిత్ సేన్ సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ ప్రకటించారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆయన మరణించారని తెలిపారు. ఆయన మరణంపై రాజకీయ ప్రముఖులు, ఆర్థిక ,వ్యవసాయరంగ నిపుణులు పలువురు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని తొలి ఎన్‌డిఎ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సిఎసిపి) ఛైర్మన్‌గా అభిజిత్ సేన్, జూలై 2000లో సమర్పించిన రిపోర్ట్ ప్రముఖంగా నిలిచింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొంది, నాలుగు దశాబ్దాల కరియర్లో అభిజిత్ సేన్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించేవారు. అంతకుముందు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ , ఎసెక్స్‌లలో కూడా ఎకానమిక్స్ బోధించారు. వ్యవసాయ ఖర్చులు అండ్ ధరల కమిషన్ అధ్యక్షుడు సహా అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను ఆయన నిర్వహించారు. సేన్‌కు భార్య జయతి ఘోష్(దివైర్ డిప్యూటీ ఎడిటర్), కుమార్తె జాహ్నవి సేన్ ఉన్నారు. Prof Abhijit Sen was a fine economist with both his head & heart in the right place. His work, interventions benefitted many lives & families. I’m sure that my friend had much more to say & contribute at this difficult time India is going through. His passing is a big loss to us. pic.twitter.com/Jxb0V4BZFU — Sitaram Yechury (@SitaramYechury) August 30, 2022 -
భారత కబడ్డీ మాజీ ప్లేయర్ తేజస్వినికి క్రీడా శాఖ సాయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి భర్తను కోల్పోయిన భారత మహిళల కబడ్డీ జట్టు మాజీ సభ్యురాలు వి. తేజస్విని బాయికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి ద్వారా తేజస్వినికి సహాయం అందించారు. కర్ణాటకకు చెందిన తేజస్విని, ఆమె భర్త నవీన్ ఈనెల ఒకటిన కరోనా బారిన పడ్డారు. తేజస్విని ఇంటివద్దే కోలుకోగా... ఆమె భర్త నవీన్ (30 ఏళ్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన తుదిశ్వాస విడిచాడు. నవీన్ తండ్రి కూడా కరోనా వైరస్‌తోనే మృతి చెందారు. 2011లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ పొందిన తేజస్విని 2010 గ్వాంగ్జూ, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరించింది. తేజస్వినికి ఐదు నెలల పాప ఉంది. ఆర్థిక సాయంగా లభించిన మొత్తాన్ని పాప భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తేజస్విని పేర్కొంది. -
'బాబు వైఖరితోనే గ్రేటర్లో ఓటమి'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి కారణంగా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు స్నేహపూర్వకంగా మెలగడం వల్ల ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ఫ్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయలేకపోయారని అన్నారు. ఈ విధానం వల్ల టీడీపీ కేడర్‌కు బాబు ధైర్యాన్ని ఇవ్వలేకపోవడంతోపాటు టీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేయలేకపోయారని శివాజీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ స్నేహంగా ఉన్న సమయంలో తాము స్థానికులతో ఎందుకు వివాదాలకు పోవాలని భావించి సీమాంధ్ర ఓటర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు ఊహించినవేనని, ఒక ప్రాంతీయపార్టీ మరో రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవని, చరిత్ర ఇదే చెబుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా పక్క రాష్టంలో పార్టీని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం కాదని శివాజీ అన్నారు.