!['ఓటమితో కుంగిపోయే పరిస్థితి లేదు' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81392358513_625x300_2.jpg.webp?itok=pcJX1Siw)
'ఓటమితో కుంగిపోయే పరిస్థితి లేదు'
విజయవాడ : గ్రేటర్ ఓటమితో కుంగిపోయే పరిస్థితి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. గతంలో గ్రేటర్కు జరిగిన ఎన్నికల్లో కంటే ఈ సారి జరిగిన ఎన్నికల్లో లక్షన్నర ఓట్లు తమ పార్టీకి వచ్చాయన్నారు. బుధవారం విజయవాడలో నారా లోకేష్ మాట్లాడుతూ... తెలంగాణలో అధికార టీఆర్ఎస్కి టీడీపీనే ప్రధాన ప్రత్యర్థి అని తెలిపారు.
మూడు దశాబ్దాల టెస్ట్ మ్యాచ్ ఆడిన చరిత్ర టీడీపీకి ఉందని చెప్పారు. టీ-20 మ్యాచుల్లా ఆరు నెలల్లో అన్ని కావాలని కోరుకోమన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రూ. 60 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. అందుకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూస్తామన్నారు. కాపుల విషయంలో మాత్రం చిత్తశుద్ధితో ఉన్నారమన్నారు.2019 ఎన్నికల్లో యువకులతో ముందుకు వెళ్తామన్నారు.