కాచిగూడ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సిబ్బందికి అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందించిన టిఫిన్, భోజనం పాడైపోవడంతో.. మంచినీరు తాగి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పాడిందని సిబ్బంది వాపోయారు.
కాచిగూడ డివిజన్ పోలింగ్ కేంద్రాలకు పంపించిన భోజనాలు, టిఫిన్స్ సోమవారం రాత్రి వండినవి కావడంతో పాటు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయడం వల్ల అవి పాడైపోయాయి. దీంతో తినడానికి వీలు లేకుండా ఉన్నాయని సిబ్బంది తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి విధి నిర్వహణకోసం వచ్చిన సిబ్బందికి కనీసం తిండికూడ పెట్టలేని స్థితిలో జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సిబ్బందికి కనీస సౌకర్యాలను కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలయమ్యారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సిబ్బందికి పాడైపోయిన ఆహారం
Published Tue, Feb 2 2016 6:32 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement
Advertisement