హైదరాబాద్: పోలింగ్ వేళ బల్దియా కమిషన్ జనార్థన్ రెడ్డి, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిలు ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచారు. జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కుటుంబంతో కలిసివచ్చి ఓటువేసిన ఆ ఇద్దరు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా గ్రేటర్ వాసులకు పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో కుందబాగ్ పరిధిలోని చిన్మయి హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఇరువురు అధికారులు ఓటు వేశారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా 25,624 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ వాలంటీర్ల సహాయం కూడా తీసుకుంటున్నామని కమిషనర్ జనార్థన్ రెడ్డి చెప్పారు. ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈవీఎంల మొరాయింపు
గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. కాప్రా డివిజన్ లోని 39వ కేంద్రం, హయత్ నగర్ డివిజన్లో సిద్ధార్థ స్కూల్లో ఏర్పాటుచేసిన ఈవీఎంలో సాంకేతికలోపం తలెత్తింది. రాజేంద్ర నగర్ డివిజన్ లోని లక్ష్మీ గూడలో, కూకట్ పల్లిలోని పలు బూత్ లలోనూ ఇదే పరిస్థితి. సీతాఫల్‌మండి డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 10లో ఈవీఎం మొరాయించింది. దీంతో కాసేపు పోలింగ్ పక్రియ ఆగిపోయింది. దాని స్థానంలో మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు.
గ్రేటర్ లో అధికారుల 'ఓటు' స్ఫూర్తి
Published Tue, Feb 2 2016 8:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM
Advertisement