గ్రేటర్ లో ఓటేసిన ప్రముఖులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేంచాలనుకున్న అధికారులు ఆ మేరకు సాధ్యమైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడమేకాక, కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఈసీ చేపట్టిన ఈ చర్యలపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. నగరంలోని పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంమైన కొద్ది సేపటికే జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిలు కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఓటర్లందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఓటేసిన మరికొందరు ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి..
- ప్రముఖులందరిలోకీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముందుగా ఓటు వేశారు. ఉదయం 7:15కే రాంగనర్ లోని జేవీ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో దత్తన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు.
- మంత్రి కేటీఆర్.. నందినగర్ (బంజారాహిల్స్)లో ఏర్పాటుచేసిన పోలింగ్ తో ఓటు వేశారు. హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్ కోసం నగర వాసులంతా ఓటు వేయాల్సిందిగా యువనేత పిలుపునిచ్చారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి కాచిగూడలో ఓటు వేశారు.
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కుందన్ బాగ్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. రాజేంద్ర నగర్ డివిజన్ లోని బాబుల్ రెడ్డి నగర్ లో ఓటేశారు.
- ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలు జూబ్లీ హిల్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి రిసాలాగూడలో ఓటువేశారు.
- కూకట్ పల్లి డివిజన్ లోని 114 పోలింగ్ కేంద్రంలో ఓటేసిన మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
- సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని టెలిఫోన్ ఎక్సేంజ్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.