Commissioner Janardhan Reddy
-
వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు
రాజేంద్రనగర్: వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ తరఫున గుర్తింపు కార్డులు అందిస్తూ, గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సర్కిల్లో స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం ఏర్పాట్లు చేస్తామన్నారు. వారు దళారుల భారిన పడి మోసపోతున్నారని, సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుందన్నారు. వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు మూడు జోన్ లను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ ట్రాపిక్, లా ఆండ్ ఆర్డర్, స్థానిక వ్యాపారస్తులను సభ్యులుగా ఉంటారని తెలిపారు. వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఇవ్వడంతో పాటు గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ సభ్యులంతా కలిసి పొదుపు చేసుకునేలా బ్యాంక్ అకౌంట్లను తెరిపించి వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు తెలిపారు. జోన్ ల వారిగా వ్యాపారులకు అవకాశం కల్పించడం ద్వారా ట్రాపిక్కు సైతం ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దీనిని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐదు గ్రూపులకు చెందిన 80 మందికి గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపకమిషనర్ దశరథ్, అధికారులు శ్రీనివాస్, పత్యానాయక్, ఆశోక్‌కుమార్, నాయకులు సుధాకర్‌రెడ్డి, సునీత, స్వామి, కృష్ణాయాదవ్, నర్సింగ్‌రావు, రవీందర్, విజయలక్ష్మి, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వాటిని చూసి ఇంజనీర్లు నేర్చుకోవాలి
మాదాపూర్: హైదరాబాద్ నగరంలోని వందల ఏళ్ల నాటి కట్టడాలను చూసి ఇంజనీర్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో శుక్రవారం ఆర్చ్ దక్షిణ్ సదరన్ రీజినల్ కాంపారెన్స్–2016ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంజీ గోపాల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీర్లు చేసే ప్రతి పని భావి తరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని మరింత అద్భుతమైన కట్టడాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఐఐఏ జాతీయ అధ్యక్షులు దివ్యకుష్, జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ పద్మావతి పేర్వారం, ఐఐఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ మన్నెపల్లి గురురాజ్ తదితరులు హాజరయ్యారు. -
8 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగుల సస్పెన్షన్
గచ్చిబౌలి: మాదాపూర్‌లో ముజ్రా పార్టీలో పోలీసులకు పట్టుపడ్డ జీహెచ్ఎంసీ ఉద్యోగులు 8 మందిని క మిషనర్ జనార్దన్‌రెడ్డి సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి మాదాపూర్ ఖానామెట్‌లోని ఫాతిమా గెస్ట్‌హౌస్‌లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారని తెలియడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. మద్యం సేవిస్తూ యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తుండగా అక్కడున్న వారిని 24 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపీసీ 188, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అలాగే ముజ్రా పార్టీ నిర్వాహకుడు సఫ్దార్(35), ఫాతిమా గెస్ట్‌హౌస్ నిర్వాహకురాలు జరీనా, వాచ్మెన్ నవీన్ శర్మ(45), డ్రై వర్లు బనో శరత్(43) దశరథ్(24)లను అరెస్ట్ చేఛశారు. అలాగే, ఎం.డి.ముషాఫ్(25)లతో పాటు జల్సా చేసేందుకు వచ్చిన పి.బాపు(27), ఎం.డి.కలీం(39), ఎం.డి.యూసూఫ్ ఖాన్(49), ఎం.డి.సిరాజ్(50)తోపాటు... శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్(53), సర్కిల్-12 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ అలియాస్ పద్మభూషణ్ రాజు(48,) సర్కిల్-14 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవిందర్(54), సర్కిల్-11 బిల్ కలెక్టర్లు ఆర్.జ్ఙానేశ్వర్(30), వై.నరహరి(30), కె.కృష్ణ(26), రణవీర్ భూపాల్(40), సర్కిల్-12 బిల్ కలెక్టర్ వై.బాబురావు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. కాగా, యువతులతో కలసి జల్సా చేసిన 8 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులను కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు వెస్ట్ జోన్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి తెలిపారు. -
గ్రేటర్ లో అధికారుల 'ఓటు' స్ఫూర్తి
హైదరాబాద్: పోలింగ్ వేళ బల్దియా కమిషన్ జనార్థన్ రెడ్డి, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిలు ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచారు. జీహెచ్ఎంసీ పరిధిలో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కుటుంబంతో కలిసివచ్చి ఓటువేసిన ఆ ఇద్దరు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా గ్రేటర్ వాసులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో కుందబాగ్ పరిధిలోని చిన్మయి హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లో ఇరువురు అధికారులు ఓటు వేశారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా 25,624 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ వాలంటీర్ల సహాయం కూడా తీసుకుంటున్నామని కమిషనర్ జనార్థన్ రెడ్డి చెప్పారు. ఈ సారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల మొరాయింపు గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. కాప్రా డివిజన్ లోని 39వ కేంద్రం, హయత్ నగర్ డివిజన్లో సిద్ధార్థ స్కూల్లో ఏర్పాటుచేసిన ఈవీఎంలో సాంకేతికలోపం తలెత్తింది. రాజేంద్ర నగర్ డివిజన్ లోని లక్ష్మీ గూడలో, కూకట్ పల్లిలోని పలు బూత్ లలోనూ ఇదే పరిస్థితి. సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 10లో ఈవీఎం మొరాయించింది. దీంతో కాసేపు పోలింగ్ పక్రియ ఆగిపోయింది. దాని స్థానంలో మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
ఆటకేదీ ఆదరణ?
సిటీలోని ప్రముఖ స్టేడియాలు... ♦ అంబర్‌పేట స్టేడియం ♦ గోల్కొండ ప్లేగ్రౌండ్ ♦ పటేల్ ప్లేగ్రౌండ్, శాలిబండ ♦ విక్టరీ ప్లే గ్రౌండ్ , చాదర్‌ఘాట్ ♦ విజయనగర్ కాలనీ స్పోర్టింగ్ గ్రౌండ్ ♦ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కు పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనల మేరకు లేఔట్లలో 10 శాతం ఖాళీ స్థలాలుండాలి. వీటిని ఆటస్థలాలు, ఉద్యానవనాలకు వినియోగించాలి. కానీ నగరంలో ఈ నిబంధన కాగితాలకే పరిమితమైంది. ఖాళీ స్థలాలు 3 శాతం మించి లేవు. ఉన్న వాటిల్లోనూ ఆటస్థలాలకు వినియోగిస్తున్నవి తక్కువే. అసలే అరకొరగా ఉన్న ఆటస్థలాలు ఏటికేడు అదృశ్యమవుతున్నాయి. కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. నగరంలో ఒకప్పుడు 725 ప్లేగ్రౌండ్స్ ఉండగా, అవి 600కు తగ్గాయి. తీరా క్షేత్ర స్థాయిలో చూస్తే ప్రస్తుతం 521 మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎన్ని ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి. పాలకులు, అధికారులు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరకొర సౌకర్యాలు... ప్రస్తుతం ఉన్న ఆటస్థలాల్లో సదుపాయాలు లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సౌకర్యాలున్నాయని జీహెచ్ఎంసీ సెలవిస్తుండగా, వాస్తవంలో మాత్రం భిన్నంగా ఉంది. ఆటస్థలాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు ఆసక్తి కొద్దీ వెళ్లే పేద క్రీడాకారులకు క్రీడాపరికరాలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు సొంతంగా పరికరాలు కొనుక్కోలేక క్రీడాసక్తిని చంపుకోవాల్సి వస్తోంది. ఆరుబయట ఆటస్థలాలు లేక, అపార్టుమెంట్లలో కొనసాగుతున్న విద్యాసంస్థల్లోనూ క్రీడలకు అవకాశాల్లేక భవిష్యత్ తరాలు ఆటలకు దూరమవుతున్నాయి. పాయింట్ అవుట్... ► జోన్‌కు ఐదు చొప్పున ఐదు జోన్లలో 25 ప్లేగ్రౌండ్స్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ► 46 ఏళ్ల పాటు నిరాటంకంగా నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లకు 2015లో స్వస్తి పలికారు. 2014లో 1260 సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు ఏర్పాటు చేయగా, 2015లో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు. ► కనీసం 10 శాతం ఖాళీ స్థలాలుండాల్సి ఉండగా, మూడు శాతం కూడా లేని దుస్థితి. ఉన్న వాటిలోనూ ఆటస్థలాలు 25 శాతమే. అక్కడక్కడ కొన్ని ఖాళీ స్థలాలు పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగపడుతుండగా, వాటినీ లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► క్రీడాకారులకు ఎంతో సదుపాయంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో సైతం కళాభారతి నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. ► 1000 జిమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏడాదైనా వాటి జాడ లేదు. వీటి కోసం బడ్జెట్లో భారీగా నిధులు కూడా కేటాయించారు. ► ఆయా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఆటస్థలాల నిర్వహణ, ఇతరత్రా సదుపాయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.3 కోట్లు కేటాయించగా.. రూ.కోటి మాత్రమే ఖర్చు చేశారు. ► స్పోర్ట్స్ విభాగం పేరిట ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ.60 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఆధునీకరణ తదితర పనులు వీటిలో ఉన్నాయి. కానీ ఇదీ కార్యరూపం దాల్చలేదు. ► క్రీడా విభాగానికి సంబంధించిన 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అద్దెకు ఆటస్థలాలు నగరంలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని, నానాటికీ తగ్గిపోతున్న ఆటస్థలాలను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ ప్రస్తుత కమిషనర్ జనార్దన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాసంస్థలకు ఆటస్థలాలను అద్దెకిచ్చేందుకు నిర్ణయించారు. అయినప్పటికీ విద్యాసంస్థల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ప్రోత్సాహం కరవు అరవింద్, అంబర్‌పేట నగరంలో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేదు. ఆటస్థలాలకు క్రీడా పరికరాలు సరఫరా చేయడం లేదు. ఎవరి క్రీడా పరికరాలు వారే తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆటస్థలాల అభివృద్ధిలో జీహెచ్ఎంసీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గ్రౌండ్స్‌లో ఏదైనా పాడైపోతే మరమ్మతులకే నెలల సమయం పడుతోంది. ఈ పరిస్థితి మారాలి. ఆటస్థలాల అభివృద్ధికి కృషి చేసే వారికే నా ఓటు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన భాగ్యనగరిలో ‘ఆట’విడుపునకు అంగుళం స్థలం కూడా దొరకని పరిస్థితి. ‘కబ్జా’ సర్పం పడగవిప్పి ఆటస్థలాలు అదృశ్యమవుతున్నాయి. కొన్ని ఉన్నా వాటిలో సదుపాయాల లేమి. అరకొర వసతులతో క్రీడాకారులకు అష్టకష్టాలు. అభివృద్ధి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైన.. పాలకుల నిర్లక్ష్యం, యంత్రాంగం వైఫల్యాల ఫలితమిది. గ్రేటర్ ఎన్నికల వేళ.. అభివృద్ధి మంత్రం జపిస్తూ.. హామీలతో అదరగొడుతున్న నాయకులారా.. ఆటస్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే వారికే తమ ఓటు అంటున్నారు సిటీజనులు. - సాక్షి, సిటీబ్యూరో, అంబర్‌పేట భ్రమలో అధికారులు.. రజినీకాంత్, బాగ్ అంబర్‌పేట ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలు అసలైన క్రీడాకారులకు అందుబాటులో ఉండడం లేదు. వ్యాయామం, విశ్రాంతి కోసం వచ్చే వారితో మైదానాలు నిండిపోతున్నాయి. దీంతో అక్కడ ప్రాక్టీస్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆట స్థలాలున్నాయి.. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామనే భ్రమలో జీహెచ్ఎంసీ అధికారులున్నారు. ఆటస్థలాలు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకొనే నాయకులకే నా ప్రాధాన్యం. -
దరఖాస్తులు 20వేలు
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లకు మంచి స్పందన {పజల్లో అవగాహన పెంపుపై దృష్టి కమిషనర్ జనార్దన్‌రెడ్డి సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లకు ఆన్లైన్లో 20 వేల దరఖాస్తులు వచ్చాయని జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.... ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తుల స్వీకరణకు మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సందేహాలు తీర్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకంపై ప్రచురించిన పుస్తకాన్ని పౌర సేవాకేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. నగరంలో సుమారు రెండువేల మంది ఇంజినీర్లను గుర్తించామని... వారి ద్వారా దరఖాస్తులు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు జతపరిచే డాక్యుమెంట్లు చాలా ఉన్నాయని... వాటిలో కొన్నింటిని మినహాయించాల్సిందిగా చీఫ్ ప్లానర్ దేవందర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు కమిషనర్ తెలిపారు. అక్టోబర్ 28 నుంచి నగరంలో అక్రమంగా నిర్మించిన 12 భవనాలను కూల్చివేశామన్నారు. క్రమబద్ధీకరణ ప్రకటన అనంతరం చేపట్టే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. వీటి వివరాలను గూగుల్ మ్యాపింగ్ ద్వారా సేకరించనున్నట్లు చెప్పారు. ‘పే అండ్ యూజ్’ పద్ధతిలో టాయిలెట్లు నగరంలో ఏర్పాటు చేస్తున్న 200 మోడల్ టాయిలెట్లను ‘పే అండ్ యూజ్’ పద్ధతిలో నిర్వహించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. వీటికి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణను కేంద్రీకృతంగా ఒక్కరికే అప్పగించాలన్న ప్రతిపాదనలను కమిషనర్ తోసి పుచ్చారు. ఎస్ఆర్డీపీ పనులను త్వరితగతిన చేపట్టడానికి భూసేకరణను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్, శివకుమార్, రామకృష్ణారావు, చీఫ్ ఇంజనీర్లు ఇంతియాజ్ అహ్మద్, సురేష్ కుమార్, సీసీపీ దేవందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.