ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లకు మంచి స్పందన
{పజల్లో అవగాహన పెంపుపై దృష్టి
కమిషనర్ జనార్దన్‌రెడ్డి
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లకు ఆన్‌లైన్‌లో 20 వేల దరఖాస్తులు వచ్చాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.... ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ దరఖాస్తుల స్వీకరణకు మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల సందేహాలు తీర్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకంపై ప్రచురించిన పుస్తకాన్ని పౌర సేవాకేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. నగరంలో సుమారు రెండువేల మంది ఇంజినీర్లను గుర్తించామని... వారి ద్వారా దరఖాస్తులు అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు జతపరిచే డాక్యుమెంట్లు చాలా ఉన్నాయని... వాటిలో కొన్నింటిని మినహాయించాల్సిందిగా చీఫ్ ప్లానర్ దేవందర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు కమిషనర్ తెలిపారు. అక్టోబర్ 28 నుంచి నగరంలో అక్రమంగా నిర్మించిన 12 భవనాలను కూల్చివేశామన్నారు. క్రమబద్ధీకరణ ప్రకటన అనంతరం చేపట్టే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. వీటి వివరాలను గూగుల్ మ్యాపింగ్ ద్వారా సేకరించనున్నట్లు చెప్పారు.
‘పే అండ్ యూజ్’ పద్ధతిలో టాయిలెట్లు
నగరంలో ఏర్పాటు చేస్తున్న 200 మోడల్ టాయిలెట్లను ‘పే అండ్ యూజ్’ పద్ధతిలో నిర్వహించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. వీటికి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణను కేంద్రీకృతంగా ఒక్కరికే అప్పగించాలన్న ప్రతిపాదనలను కమిషనర్ తోసి పుచ్చారు. ఎస్‌ఆర్‌డీపీ పనులను త్వరితగతిన చేపట్టడానికి భూసేకరణను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్, శివకుమార్, రామకృష్ణారావు, చీఫ్ ఇంజనీర్లు ఇంతియాజ్ అహ్మద్, సురేష్ కుమార్, సీసీపీ దేవందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు 20వేలు
Published Thu, Dec 17 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM
Advertisement