టీఆర్ఎస్ని అభినందించిన కిషన్రెడ్డి | G kishan reddy greets TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ని అభినందించిన కిషన్రెడ్డి

Published Fri, Feb 5 2016 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

టీఆర్ఎస్ని అభినందించిన కిషన్రెడ్డి

టీఆర్ఎస్ని అభినందించిన కిషన్రెడ్డి

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అభినందించారు. ఈ ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సదరు హామీలను అధికార పార్టీ నెరవేరుస్తుందని కిషన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజల సమస్యలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కార్పొరేటర్లు పోరాడుతారని ఆయన స్పష్టం చేశారు. ఓ వేళ హామీల అమలులో టీఆర్ఎస్ వెనుకడుగు వేస్తే ప్రజలను సంఘటితం చేసి ఉద్యమం చేస్తామని జి.కిషన్రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి శుక్రవారం  పత్రిక ప్రకటన విడుదల చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement