హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ గ్రేటర్ పరిధిలో 24 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుతుందని... కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. తొలిత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. పాతబస్తీలో రీ పోలింగ్కు అవకాశం లేదని... ప్రిసైడింగ్ అధికారి నివేదిక కూడా అదే విషయం చెబుతోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.