పాతబస్తీలోనూ ‘కారు’ షికారు | TRS party Old City in GHMC elections | Sakshi
Sakshi News home page

పాతబస్తీలోనూ ‘కారు’ షికారు

Published Sun, Feb 7 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

పాతబస్తీలోనూ ‘కారు’ షికారు

పాతబస్తీలోనూ ‘కారు’ షికారు

* సీట్లు దక్కకున్నా...పెరిగిన ఓటు బ్యాంక్
* మజ్లిస్‌కు తగ్గిన ఓటు బ్యాంక్
* మెరుగుపడిన కాంగ్రెస్ ఓటింగ్ శాతం

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  పాతబస్తీలోనూ కారు గాలి వీచింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ పాగావేయలేకపోయినా ఓటు బ్యాంకు మాత్రం పెంచుకోగలిగింది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల కంటే ఈసారి టీఆర్‌ఎస్‌కు ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది  పాతబస్తీ లో మజ్లిస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినా సాధారణ ఎన్నికల కంటే ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గడం విశేషం.

ఇక కాం గ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే ఉండగా, టీడీపీ బీజేపీ కూటమికి గతంలో మాదిరిగానే ఆదరణ లభించలేదు.  పార్టీల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే....
 
టీఆర్‌ఎఎస్‌కు పెరిగిన బలం.....
టీఆర్‌ఎస్‌కు పాతబస్తీలో బలం పెరిగింది.  2014లో జరి గిన ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెంచుకోగలిగింది.  గత సాధారణ ఎన్నికల్లో చార్మినార్  నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు 8275 ఓట్లు రాగా, ఈసారి 11,359 ఓట్లు పడ్డాయి. యాకుత్‌పురా నియోజకవర్గంలో గతంలో 7862 ఓట్లు లభించగా ఈ సారి  37,963 ఓట్లు దక్కాయి. బహుదూర్‌పురాలో 3719 ఓట్లు రాగా,  ఈసారి 13,595 పైగా ఓట్లు పడటం విశేషం.

చాంద్రాయణగుట్టలో 7278 లభించగా ఈసారి వాటి సంఖ్య 28, 257కు చేరుకుంది. మలక్‌పేటలో గత ఎన్నికల్లో 11,378 ఓట్లు పోలైతే  ఈ సారి మాత్రం 44,025 ఓట్లు పోల య్యాయి. గోషామహల్‌లో 6312లో ఈ సారి 52,402 ఓట్లు  లభించాయి. నాంపల్లిలో  6312 ఓట్లు లభించగా ఈసారి 32,120 ఓట్లు లభించాయి.
 
మజ్లాస్‌కు తగ్గిన ఓటింగ్
మజ్లిస్ పార్టీకి  ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. చార్మినార్ నియోజకవర్గంలో గత సాధారణ ఎన్నికల్లో 62, 941 ఓట్లు లభించగా ఈసారి 54,8811 ఓట్లు పడ్డాయి. చంద్రాయణగుట్టలో 80,393 గాను 63,140ఓట్లు, యాకుత్‌పురాలో 66843 గాను ఈ సారి 55857 ఓట్లు, బహుదూర్‌పురాలో 1,06,874 ఓట్లు లభిం చగా 79,606 ఓట్లు దక్కాయి. గోషామహల్‌లో గత ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఈసారి   18,898 ఓట్లు లభించాయి. నాంపల్లిలో 64,066 ఓట్లు లభించగా ఈ సారి 55,090 ఓట్లు లభించాయి. మలక్‌పేటలో గత ఎన్నికల్లో 58,976 ఓట్లు లభిం చగా ఈ సారి మాత్రం 35,615 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
 
కాంగ్రెస్ పెరిగిన ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి కూడా పాతబస్తీలో ఓటు బ్యాంక్  కొంతమేరకు పెరిగింది. సాధారణ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గంలో 5598 ఓట్లు లభించగా, ఈసారి 13,320 ఓట్లు పడ్డాయి. చంద్రాయణగుట్టలో 5120 ఓట్లు రాగా ఈ సారి  3707, యాకుత్‌పురాలో 6608 ఓట్లు లభించగా ఈసారి 6911 ఓట్లు లభించాయి. బహుదూర్‌పురాలో 4857 ఓట్లకు రాగా ఈసారి 5195 గోషామహల్‌లో  45964 ఓట్లు లభించగా  ఈసారి 17,234 లభించాయి. నాంపల్లిలో 8818ఓట్లు 4372 ఓట్లు లభించాయి. మలక్‌పేటలో  గత ఎన్నికల్లో 8320 ఓట్లు లభించగా 35615 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ-బీజేపీకి కూటమిని గతంలో మాదిరిగానే పాతబస్తీ ఓటర్లు తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement