
జీహెచ్‌ఎంసీలో దూసుకుపోతున్న కారు
హైదరాబాద్: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో ముందునుంచి ఊహించినట్లే.. టీఆర్ఎస్ దూసుకుపోతోంది. తొలి రౌండు నుంచి చాలా వరకు డివిజన్లలో టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే లెక్కింపు ప్రారంభమైనా... పురానాపూల్ డివిజన్‌కు రీపోలింగ్ కొనసాగుతున్న దృష్ట్యా నిర్ణీత సమయం (సాయంత్రం 5 గంటలు) ముగిసే వరకు ఫలితాలను వెల్లడించలేదు. సాయంత్రం 5 గంటల తర్వాతే ఫలితాలను ప్రకటించారు.
ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి లెక్కింపు కౌంటర్లకు చేర్చేటప్పటి నుంచి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతటినీ వీడియో రికార్డింగ్ చేశారు. జంట నగరాల్లో ఉన్న మొత్తం 24 కేంద్రాల్లో 150 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.