
ఓటువిడుపు..
‘గ్రేటర్’ సమరం ముగిసింది.
‘గ్రేటర్’ సమరం ముగిసింది. ఇంతవరకు ప్రచార పోరులో తలమునకలైన అభ్యర్థులు.. ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు చేరడంతో
రిలాక్సయ్యారు. గల్లీగల్లీ తిరుగుతూ ప్రచారంతో హోరెత్తించిన వారు ఇప్పుడు వివిధ వ్యాపకాలతో సేదతీరుతున్నారు.
కొందరు మహిళా అభ్యర్థులు ఇంట్లో ఇల్లాలి పాత్రలో ఇమిడిపోగా.. మరికొందరు తమ వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. ఇంకొందరు
స్నేహితులతో ఎన్నికల సరళిపై చర్చించుకోసాగారు. సీనియర్ నేతలు పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. - సాక్షి నెట్‌వర్క్