అన్నింటా అదేజోరు!
సనత్‌నగర్... సీన్ రివర్స్
సనత్‌నగర్: సనత్‌నగర్ నియోజకవర్గంలో సీన్ రివర్స్ అరుుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఓటర్లు తీర్పునిచ్చారు. కారు స్పీడ్‌కు సైకిల్ తుక్కైంది. ఐదు డివిజన్లలో గులాబీ జెండా రెపరెపలాడింది. నియోజకవర్గం సెటిలర్స్‌కు పెట్టింది పేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను కాదని టీడీపీకి అత్యధిక మెజార్టీ తెచ్చింది కూడా సెటిలర్స్ ఓటింగే. ప్రస్తుత ఎన్నికల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉండే జెక్‌కాలనీ, సుందర్‌నగర్, మోడల్‌కాలనీ, ఎస్‌ఆర్‌టీ, ఎస్‌ఆర్‌నగర్ సీ-టైప్ క్వార్టర్స్, అమీర్‌పేట్ డివిజన్‌లోని కుందన్‌బాగ్, శాంతిబాగ్, ఎస్‌ఆర్‌నగర్, బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని పద్మారావునగర్ తదితర ప్రాంతాల ప్రజలు కారుకు జై కొట్టారు.
సత్తా చాటిన తలసాని..
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ 27,455 మెజార్టీతో గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరగంతో పరిస్థితి పూర్తిగా వూరి పోరుుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వుంత్రి తలసానికి వచ్చిన మెజార్టీని మించి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్ల నుంచి మెజార్టీ నమోదు కావడం విశేషం. నియోజకవర్గంలో సనత్‌నగర్, అమీర్‌పేట్, బేగంపేట్, రాంగోపాల్‌పేట్, బన్సీలాల్‌పేట్ డివిజన్లను కలుపుకుని మొత్తం టీఆర్‌ఎస్‌కు 30,563 ఓట్ల మెజార్టీ వచ్చింది.
కూనకు షాక్...
గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సనత్‌నగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కూన వెంకటేష్‌గౌడ్ బేగంపేట్ డివిజన్ నుంచి తన సతీమణి కూన సత్యకళను కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలోకి దించినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన కూన తన సతీమణిని గెలిపించుకోలేక పోవడంతో కార్యకర్తలు డైలామాలో పడ్డారు.
కార్వాన్.. ఎంఐఎందే కార్వాన్..
కార్వాన్‌లో ఎంఐఎం తన పట్టు నిలబెట్టుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఏడు డివిజన్లలో ఎంఐఎం ఐదు డివిజన్లలో పోటీచేయగా అన్నిం టిలోనూ విజయం సాధించింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ 2 డివిజన్లలో విజయం సాధించింది. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 10760 ఓట్లు పడగా, కాంగ్రెస్ 6512 కాగా టీడీపీ, బీజేపీకి 48614, ఎంఐఎంకు 86391 ఓట్లు వచ్చాయి.
కూకట్‌పల్లి... కుప్పకూలిన ‘పచ్చ’కోట
టీఆర్‌ఎస్‌కు ఎక్కడా పోటీ ఇవ్వని టీడీపీ
సిటీబ్యూరో: కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. మొదటి నుంచి టీడీపీకి పెట్టనికోటగా నిలిచిన ఈ నియోజకవర్గం గ్రేటర్ ఎన్నికల్లో కుదేలైంది. మొదటి నుంచి కనీసం నాలుగు డిజన్లనైనా గెలుచుకోవాలని ఆశపడ్డ టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. మొత్తం 8 డివిజన్లకుగాను ఏడింటిని గులాబీ తన ఖాతాలో వేసుకోగా, చావుతప్పి కన్నులొట్ట బోయినట్లుగా కేపీహెచ్‌బీ డివిజన్‌లో మాత్రమే టీడీపీ గెలుపొందగలిగింది. గ్రేటర్ మొత్తంలో టీడీపీ గెలుచుకున్న స్థానం ఇదొక్కటే కావడం గమనార్హం. ఏపీ సీఎం చంద్ర బాబుతో సహా ఆయన తనయుడు లోకేష్‌బాబు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 2014 సాధార ణ ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే ఇక్కడ టీఆర్‌ఎస్ బాగా పుంజుకుంది. గత ఎన్నికల్లో 56,688 ఓట్లు రాగా.. తాజా గ్రేటర్ ఫలితాల్లో రెండింతలు ఎక్కువ ఓట్లను సాధించింది. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
టీఆర్‌ఎస్‌లో చేరడం, ఆ తర్వాత అభివృద్ధి పనులు పుంజుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చిందని చెప్పవచ్చు. హైదర్‌నగర్‌ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో మెజారిటీ వర్గమైన సెటిలర్స్ ఓట్లను సాధించేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత సాధారణ ఎన్నికల సమయంలో టీడీపీకి 99,874 ఓట్లు రాగా.. ఇప్పుడు 46,256 ఓట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ సోయిలో లేకుండా పోయింది. నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి కూడా డిపాజిట్లూ దక్కని దుస్థితి ఎదురైంది.
పటాన్‌చెరు.. విలక్షణ తీర్పు
పటాన్‌చెరులో కాంగ్రెస్.. రామచంద్రాపురం, భారతీనగర్‌లో టీఆర్‌ఎస్ హవా
రామచంద్రాపురం: గ్రేటర్ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజక వర్గం పరిధిలో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. పటాన్‌చెరు డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ యాదవ్ తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్.కుమార్‌యాదవ్‌పై 1,388 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రామచంద్రాపురం డివిజన్‌లో ఎనిమిది మంది పోటీ చేశారు. 19813 ఓట్లు పోల్ కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి తొంట అంజయ్య 5,591 ఓట్ల మెజారిటీతో టీడీపీ తన సమీప అభ్యర్థి కరికె సత్యనారాయణ యాదవ్‌పై విజయం సాధించారు. భారతీనగర్ డివిజన్‌లో మొత్తం తొమ్మిది మంది పోటీ పడగా, 19,490 ఓట్లు పోలయ్యాయి. కాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సింధూ ఆదర్శ్‌రెడ్డి తన సమీప బీజేీపీ అభ్యర్థి గోదావరిపై 168 ఓట్లతో విజయం సాధించారు. భారతీనగర్‌లో కాంగ్రెస్‌తో పాటు మిగతా వారంతా డిపాజిట్లు కోల్పోయారు.
ఉప్పల్... కారు ఊపేసింది
ఉప్పల్ నియోజకవర్గంలోని 10 డివిజన్లలో ఒక్క నాచారం మినహా మిగతా 9 డివిజన్లలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, మల్లాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 68,226 ఓట్లు నమోదు కాగా, ఈ గ్రేటర్ ఎన్నికల్లో లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప్పల్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి మేకల అనలారెడ్డి సమీప ప్రత్యర్ధి రజిత పరమేశ్వర్‌రెడ్డి నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అనలారెడ్డికి 10,510 ఓట్లు లభించగా, రజితకు 9,364 ఓట్లు లభించాయి. కేవలం 1146 ఓట్ల తేడాతో అధికార పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. మిగతా చోట్ల ప్రత్యర్ధులపైన భారీ మెజారిటీతోనే టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
మహేశ్వరం... తీగలకు ఎదురుదెబ్బ
దిల్‌సుఖ్‌నగర్: మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్‌కేపురం డివిజన్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన కోడలు డాక్టర్ తీగల అనితారెడ్డి బీజేపీ అభ్యర్థి రాధా ధీరజ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. సరూర్‌నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పారుపల్లి అనితా దయాకర్‌రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి ఆకుల అఖిలపై గెలుపొందడంతో పరువు దక్కినట్లయ్యింది. 2009 బల్దియా ఎన్నికల్లో ఆర్.కె.పురం, సరూర్‌నగర్ డివిజన్లను టీడీపీ గెలుచుకోగా ఈసారి ఘోరంగా ఓటమి పాలైంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి, మంత్రి రావెల కిషోర్‌బాబు తదితరులు ప్రచారం చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు డివిజన్లలో టీడీపీ హవా కొనసాగింది. ప్రస్తుత ఎన్నికల్లో ఒక డివిజన్ అధికార పార్టీకి దక్కగా మరో డివిజన్‌లో కమలం వికసించింది.2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 42,517 ఓట్లు రాగా..ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 22,739 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్లు తగ్గినా ఒక డివిజన్‌లో పార్టీ అభ్యర్థి గెలుపొందడం విశేషం.
రాజేంద్రనగర్... మట్టికరిచిన టీడీపీ
సిటీబ్యూరో: రాజేంద్రనగర్ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా మట్టి కరిచింది. నియోజవర్గ పరిధిలోని ఐదు డివిజన్లలో టీఆర్‌ఎస్ మూడు, ఎంఐఎం రెండింటిలో విజయం సాధించాయి. దీంతో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రాబల్యం కోల్పోయారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధపడిన ఆయన చివరి నిమిషంలో వెనకంజ వేశారు. దీన్ని గమనించిన ఓటర్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పి, టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. గతంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకటి, టీడీపీ ఒకటి, ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకొన్నాయి. ఈసారి ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకొని తమ పట్టు నిలబెట్టుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 47518 ఓట్లు, టీడీపీ 22900, కాంగ్రెస్ 17788, ఎంఐఎం 34110 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గణనీయంగా పుంజుకోగా, టీడీపీ ఘోరంగా దెబ్బతింది. ఎంఐఎం రెండు స్థానాల్లో గెలిచినా భారీగా ఓట్లను కోల్పోయి ప్రాభల్యాన్ని తగ్గించుకుంది.
కుత్బుల్లాపూర్... సైకిల్ అడ్రస్ గల్లంతు
సిటీబ్యూరో: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఫలితాలు తారుమారయ్యాయి. గత సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిపై 40 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద గెలుపొందగా, తాజా గ్రేటర్ ఫలితాల్లో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. సాధారణ ఎన్నికల్లో 1.14 లక్షల ఓట్లు సాధించిన టీడీపీ ప్రస్తుతం 53,641 ఓట్లకు పడిపోయింది. నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలోనూ టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. పోలైన ఓట్లలో 47 శాతానికి పైగా టీఆర్‌ఎస్ ఖాతాలోనే పడడం విశేషం. సాధారణ ఎన్నికల్లో వచ్చిన 40 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మూడో వంతు సాధించడమే గగనంగా మారింది. టీడీపీ తరఫున పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సహా అతిరథులు ప్రచారం చేసినా ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న సెటిలర్లను తమ వైపు తిప్పుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలి, ఒంటెత్తు పోకడ కూడా పార్టీ అభ్యర్థుల కొంప ముంచిందని పార్టీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. పార్టీ నుంచి వలసలను ఆయన ఆపలేకపోయారని వారు ఆరోపిస్తున్నారు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవడంతో వారు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుని గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం.