నేను ఓటేశా.. మీరూ బయటకు రండి | i voted, all of you come and vote, says ktr | Sakshi
Sakshi News home page

నేను ఓటేశా.. మీరూ బయటకు రండి

Published Tue, Feb 2 2016 9:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

నేను ఓటేశా.. మీరూ బయటకు రండి

నేను ఓటేశా.. మీరూ బయటకు రండి

పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చి ఓటేశానని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. నగర పౌరులంతా కూడా బయటికొచ్చి స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. తనకు తెలిసినంత వరకు జంట నగరాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోను ఎలాంటి ఇబ్బందులు లేవని, ఏర్పాట్లన్నీ సక్రమంగానే ఉన్నాయని అన్నారు.

పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యంలో పౌరులంతా తమ ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి ఓటు వేయాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని కాంక్షించేవాళ్లంతా ముందుకొచ్చి ఓటేయాలని కోరారు. పోలింగ్ స్లిప్ అందకపోతే ఇంటర్‌నెట్‌లో tsec.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకుని ఆ నెంబరు ప్రకారం ఓటేయొచ్చని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement