తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ తనయుడు అజం అలీపై దాడికి యత్నించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ తనయుడు అజం అలీపై దాడికి యత్నించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఉదయం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి బలాలను నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు.
మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. బలాలను చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనపై 341, 448, 427, 506, 147, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.