ahmed balala
-
మలక్‌పేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే
మలక్‌పేట నియోజకవర్గం మలక్‌పేట సిటింగ్ ఎమ్మెల్యే, మజ్లిస్ నేత అహ్మద్ బలాలా మూడోసారి గెలు పొందారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది ముజఫర్ అలీపై 17572 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బలాలాకు 53281 ఓట్లు రాగా, ముజఫర్ అలీకి 29769 ఓట్లు వచ్చాయి. మహాకూటమిలో భాగంగా టిడిపి ఇక్కడ పోటీచేసింది. ఇక్కడ బిజెపి పక్షాన పోటీ చేసిన ఆలె జితేంద్రకు సుమారు 20900 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లో ఏడు స్థానాలలో మజ్లిస్ పట్టు నిలుపుకోగా, వాటిలో మలక్‌పేట ఒకటి. అహ్మద్ బలాలా ముస్లిం నేత. నియోజకవర్గాల పునర్విభజన తరువాత మలక్‌పేట నియోజకవర్గం పూర్తిగా ఎమ్.ఐ.ఎమ్‌కు అనుకూలంగా మారింది. దాంతో తొలిసారిగా 2009లో ఇక్కడ నుంచి మజ్లిస్ పక్షాన అహ్మద్బిన్ అబ్దుల్ బలాల మూడోసారి కూడా ఎన్నికయ్యారు. గతంలో మీర్ అహ్మద్ అలీఖాన్ రెండుసార్లు, జి.సరోజని పుల్లారెడ్డి రెండుసార్లు, ఎన్.ఇంద్రసేనారెడ్డి మూడుసార్లు, మల్రెడ్డి రంగారెడ్డి రెండుసార్లు గెలిచారు. మల్రెడ్డి ఒకసారి టిడిపి తరుఫున, మరోసారి కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. సరోజిని పుల్లారెడ్డి, మీర్ అహ్మద్ అలీఖాన్,కె. ప్రభాకర్‌రెడ్డిలు మంత్రి పదవి నిర్వహించిన వారిలో ఉన్నారు. ప్రభాకరరెడ్డి డిప్యూటీ స్పీకరు పదవి కూడా చేసారు. జనతా పార్టీ పక్షాన గెలిచిన ఈయన తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఇక్కడ గెలుపొందిన సుధీర్‌కుమార్ కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ కుమారుడు. శివశంకర్ గతంలో సికింద్రాబాద్, తెనాలి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. సిక్కిం, కేరళ గవర్నరుగా కూడా పనిచేసారు. తదుపరి కాలంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈయన మరో కుమారుడు డాక్టర్ వినయ్‌కూడా ప్రజారాజ్యంలో చేరి నిజామాబాద్‌లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో ముషీరాబాద్‌లో పోటీచేసి ఓటమి చెందారు. మలక్‌పేటలో ఇప్పటివరకు కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఆరుసార్లు, బిజెపి మూడుసార్లు,మజ్లిస్ మూడుసార్లు పిడిఎఫ్, జనతా, టిడిపిలు ఒక్కోసారి గెలిచాయి. ఇక్కడ ఎనిమిదిసార్లు రెడ్లు, ఆరుసార్లు ముస్లింలు, ఒకసారి బిసి(మున్నూరు కాపు) నేతలు గెలుపొందారు. మలక్‌పేట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎంఐఎం ఎమ్మెల్యేపై రాజాసింగ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే దబీర్‌పుర ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్నబారికేడ్‌ను బలవంతంగా తొలగించారు. దీంతో బలాలాతోపాటు ఎంఐఎం మిగతా ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఓల్డ్ సీటీలో లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదని, వీరిపై చర్చలు రాజా సింగ్ కోరారు. కాగా బారికేడ్లు తొలిగించే ముందు మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మీర్‌చౌక్ ఏసీపీ నుంచి అనుమతి తీసుకున్నారని దబీర్‌పుర పోలీసులు తెలిపారు. (యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 21 మంది మృతి ) రాజాసింగ్ మాట్లాడుతూ.. ఓ వైపు కరోనాతో దేశం పోరాడుతుంటే బలాలా వంటి ఎంఐఎం పార్టీ నేతలు లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదని మండిపడ్డారు. అధికారుల ఆదేశాలు పాటించకుండా పోలీసులకు, డాక్టర్లకు ఇబ్బంది కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ఈ చర్యలన్నింటి వెనక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హస్తం ఉందని ఆరోపించారు. ఓ వైపు ప్రజలకు మంచిగా కనిపిస్తూ మరోవైపు తన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిబంధనలను ఉల్లంఘించమని ఒవైసి ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. (గ్రేటర్ ఆర్టీసీ.. కండక్టర్ లెస్ సర్వీసులు! ) ఫ్లైఓవర్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా -
ఎమ్మెల్యే బలాలకు బెయిల్
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ తనయుడు అజం అలీపై దాడికి యత్నించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఉదయం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి బలాలను నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. బలాలను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనపై 341, 448, 427, 506, 147, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.