కలహాల నాటకంతో ‘హోదా’కు తూట్లు
దువ్వూరువారిపాళెం (ముత్తుకూరు) : రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలు కలిసి ఉంటూనే కలహించుకుంటున్నట్టు నాటకాలాడుతూ ప్రత్యేక హోదా సాధనకు గండికొడుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సాయంత్రం దువ్వూరువారిపాళెం, డమ్మాయపాళెం గ్రామాల్లో గడపగడపకూ ౖÐð ఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు
-
గడపగడపకు వైఎస్సార్‌లో ఎమ్మెల్యే కాకాణి
దువ్వూరువారిపాళెం (ముత్తుకూరు) : రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలు కలిసి ఉంటూనే కలహించుకుంటున్నట్టు నాటకాలాడుతూ ప్రత్యేక హోదా సాధనకు గండికొడుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సాయంత్రం దువ్వూరువారిపాళెం, డమ్మాయపాళెం గ్రామాల్లో గడపగడపకూ ౖÐð ఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై ప్రజాబ్యాలెట్‌ను ఇంటింటా పంపిణీ చేశారు. గుంటకట్ట, డమ్మాయపాళెంలో ఆయన ప్రసంగించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు రేషన్‌కార్డులు లేవంటూ, పింఛన్లు నిలిచిపోయాయంటూ, పక్కా ఇళ్లు ఇవ్వడం లేదంటూ, నివేశన స్థలాలు రాలేదంటూ పేదలు ఆందోళన చెందుతున్నారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అభివృద్ధి పరుగులు తీసిందని, టీడీపీ పాలనలో ప్రగతి తిరోగమిస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు, డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు మాటల్లో ప్రజలకు వినిపించారు. అధికారంలోకి వచ్చాక హామీలు ఏ విధంగా విస్మరించి, మోసగించారో కాకాణి వివరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే ఐదేళ్ల పాలనలో పదేళ్ల అభివృద్ధి సాధిస్తారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మురాల వెంకటేశ్వర్లు, మారు సుధాకర్‌రెడ్డి, ఇసనాక చంద్రశేఖర్‌రెడ్డి, కందలూరు వెంకట్రామరెడ్డి, కోటేశ్వరరెడ్డి, పాముల శ్రీనివాసులు, ఈదూరు శ్రీనివాసులురెడ్డి, లక్ష్మణరెడ్డి, చెంగారెడ్డి, ముత్యంగౌడ్, ఆలపాక శ్రీనివాసులు, వాణి, ధనుంజయరెడ్డి, వేణుయాదవ్ పాల్గొన్నారు.