సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీతో చర్చలు జరుపుతుంటే తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు మాత్రం ముందుజాగ్రత్త చర్యలకు కసరత్తు చేస్తున్నారు.
కాకినాడ: సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీతో చర్చలు జరుపుతుంటే తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు మాత్రం ముందుజాగ్రత్త చర్యలకు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ పొత్తు విఫలమైతే ఏవిధంగా ముందుకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపారు. కాకినాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు చర్చలు జరిపారు.
పొత్తు కుదరకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ లోక్‌సభ స్థానాలతో పాటు 19 అసెంబ్లీ స్థానాలకు శనివారం నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ-టీడీపీ అగ్రనాయకులు మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. ఈ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఒక అంగీకారానికి వచ్చాయి.