నమ్మినోళ్లను నట్టేటముంచడం. అధికారులపై అభాండాలు వేయడం. ఈసీకి ఫిర్యాదులు చేయడం.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వర్క్ స్టైల్ ఇది. ఆమె తీరుతో కమలానికి.. ఇమేజ్ కంటే డ్యామేజే ఎక్కువ అవుతోంది. మరిది చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే.. వదిన ఫాలో అవుతున్నారు. గుడ్డిగా అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తూ పలుచనవుతున్నారు. చిన్నమ్మను ఓడిస్తామంటున్నారు రాజమండ్రివాసులు.
ఒకసారి విశాఖ.. మరోసారి బాపట్ల.. ఇప్పుడేమో రాజమండ్రి. ఏ ఒక్కచోటా స్థిరంగా పోటీ చేయకుండా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు మారే నేతల్లో పురందేశ్వరి ముందుంటారు. ఆమెకొక సొంతనియోజకవర్గమే లేదు. స్థిరమైన పార్టీ కూడా లేదు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లో చక్కర్లుకొట్టారు. ఇక, పురందేశ్వరి మెడకు రోజుకో వివాదం చుట్టుకుంటోంది. ఆమె వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోనూ ఆమె పలుచన అవుతున్నారు. రాజమండ్రిలో అభివృద్ధే జరగలేదంటూ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు మండిపడుతున్నారు.
పురందేశ్వరిని పొలిటికల్ టూరిస్టుగా అభివర్ణిస్తున్నారు రాజమండ్రి వాసులు. మడ అడవులే లేని రాజమండ్రి పార్లమెంటరీ ప్రాంతంలో జగనన్న కాలనీలు నిర్మించేందుకు అధిక డబ్బు చెల్లించి భూసేకరణ చేశారంటూ ఆరోపిచడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమంటున్నారు. ఎన్టీఆర్ బిడ్డగా తనను అందరూ ఆదరిస్తారని, తాను అందరి మనిషినని చెప్పుకుంటున్నారు పురందేశ్వరి. అయితే అన్నగారి బిడ్డ.. టీడీపీలో ఎందుకు లేరో చెప్పాలన్నది ఎన్డీఆర్ అభిమానుల ప్రశ్న.
రాజమండ్రి గురించి పురందేశ్వరికి కనీస అవగాహన కూడా లేదన్నారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ పెద్దలిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ టైమ్ పాస్ చేస్తున్నారని సెటైర్లు సంధించారు. ఆమె బీజేపీలో ఉన్నారా? లేక టీడీపీలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. నిజానికి పురందేశ్వరి తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలినన్న సంగతే మర్చిపోయారు. కేవలం బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. సొంతపార్టీ లీడర్లపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ.. ఏపీ బీజేపీ ప్రయోజనాలను గాలికొదిలేశారు. అంతేకాదు చిన్నమ్మకు మరో రికార్డు కూడా ఉంది. ఆమె పోటీచేసిన ఏ నియోజకవర్గంలోనూ గెలిచినా, ఓడినా అభివృద్ధి మాత్రం అస్సలు పట్టించుకోరు.
Comments
Please login to add a commentAdd a comment