సాక్షి, విజయవాడ: కూటమి ఏర్పాటు నేపథ్యంలో ఏపీ బీజేపీలో రాజకీయం హీటెక్కింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు పంచాయితీ పెట్టారు. ఇక, తాజాగా సీట్ల పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ పెద్దలను కలవడం హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, ఏపీ బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు కోరిన సీట్లను కాకుండా రెండున్నర దశాబ్దాలుగా టీడీపీ ఓడిపోయిన సీట్లను చంద్రబాబు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ పెద్దలకు చెప్పారు. బీజేపీ సీట్లపై చంద్రబాబు పెత్తనం ఏంటి? పార్టీ సీనియర్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా శివప్రకాష్ జీని కలిసి ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా.. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు కొందరు ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. బీజేపీ నేతల ఫిర్యాదు కారణంగానే పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఇదే సమయంలో, నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీజేపీ పెద్దలు పురంధేశ్వరితో ఏపీలో రాజకీయ పరిణామాలు, టికెట్లు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment