సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో పొత్తులపై స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి తీరుపై ఫైరవుతున్నారు. ఇదే సమయంలో పలువురు సీనియర్ నేతలు హైకమాండ్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది.
కాగా, ఏపీలో సీట్ల పంచాయితీ ముదురుతోంది. కూటమిలో సీట్ల విషయంలో చంద్రబాబు తీరు, ఏపీలో రాజకీయ పరిణామాలపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీకి చెందిన 16 మంది బీజేపీ సీనియర్లు హైకమాండ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో టీడీపీతో పొత్తుల అంశంపై ఏపీ బీజేపీ సీనియర్ నేతలు తమ గళం వినిపించారు. ఈ సందర్భంగా బీజేపీ అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారని పేర్కొన్నారు. బీజేపీకి గెలవని సీట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు.
రెండు దశాబ్దాలుగా టీడీపీ గెలవని బద్వేలు, జమ్మలమడుగు, అనపర్తి, విజయవాడ వెస్ట్, ఆధోని వంటి సీట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లా వైఎస్సార్ కడపలో రెండు సీట్లు కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బద్వేలు లాంటి అసెంబ్లీలో కనీసం పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ సీట్లని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని సీరియస్ అయ్యారు. టిక్కెట్ల కేటాయింపులో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. ఇక, టీడీపీ తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ ఇన్‌ఛార్జ్ మధుకర్‌జీని కూడా కొందరు సీనియర్లు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్లాన్ ఇదే..
- శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలు బీజేపీకి కేటాయించినట్లు ప్రచారం
- చోడవరం లేదా మాడుగుల స్ధానాలు కోరిన బీజేపీ.. నిన్న ఏకపక్షంగా ఆ స్ధానాలు ప్రకటించిన చంద్రబాబు
- పాడేరు అసెంబ్లీ స్ధానాన్ని బీజేపీకి కేటాయించిన చంద్రబాబు
- విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్డ్ కేటాయించిన చంద్రబాబు
- కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలని పట్టుబట్టిన బీజేపీ..
- బీజేపీకి మొండిచేయి చూపి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలను ప్రకటించిన చంద్రబాబు
- హిందూపూర్ లోక్‌సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు.. లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావింవిన విష్ణు
- చంద్రబాబు రాజకీయంతో విష్ణువర్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు
- కడప పార్లమెంట్‌లో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బీజేపీకి.
- బద్వేలులో పోలింగ్ బూత్‌లకి కార్యకర్తలు కూడా లేరంటున్న బీజేపీ
- రెండు దశాబ్దాలగా టీడీపీ ఓడిపోతున్న సీట్లన్నీ బీజేపీకే ఇచ్చిన చంద్రబాబు.
- చంద్రబాబు కుటిల రాజకీయాలపై మండిపడుతున్న స్థానిక బీజేపీ నేతలు
- అనపర్తిలో సోము వీర్రాజుని పోటీచేయాలని బీజేపీ సూచన.
- ఓడిపోయే సీటులో తాను పోటీ చేయలేనని స్పష్టం చేసిన సోము వీర్రాజు
- విశాఖ ఎంపీ స్ధానాన్ని జీవీఎల్ కోరితే విజయనగరం లోక్‌సభకి పంపేలా చంద్రబాబు వ్యూహం
- నరసాపురం పార్లమెంట్ స్ధానాన్ని ఆశించిన బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస్ వర్మ.
- నరసాపురం స్ధానాన్ని బీజేపీకి ఇచ్చి రఘురామకృష్ణంరాజు పేరుని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment