విజయవాడ : టీడీపీ దాని మిత్రపక్షం బీజేపీపై ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం విజయవాడలో మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ రెండుగా చీలిపోయిందని అన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. సంతలో పశువుల్లా అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని చంద్రబాబుపై రామకృష్ణ నిప్పులు చెరిగారు.
అలాగే రాజధాని అమరావతి పేరుతో రూ. కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో విజయవాడలో దీక్ష చేయడం కాదని... ఢిల్లీలో ప్రధాని ముందు దీక్ష చేయాలని చంద్రబాబుకు రామకృష్ణ ఈ సందర్భంగా సూచించారు. అలా అయినా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రధాని వద్దకు 30 సార్లు వెళ్లానని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తన కేసులపై లాలూచీ పడేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని రామకృష్ణ విమర్శించారు.