
AP Elections Political Latest Updates Telugu
8:47 PM, Mar 13th, 2024
సమన్వయకర్తలు, నేతలతో సీఎం జగన్ సమావేశం
- తాడేపల్లి: వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలతో సీఎం జగన్ సమావేశం
- నగరి, నరసరావుపేట, సత్తెనపల్లి సమన్వయకర్తలు, స్థానిక నేతలతో సమావేశం
- పార్టీ గెలుపునకు ఉమ్మడిగా కృషి చేయాలన్న సీఎం జగన్
- గతం కంటే ఎక్కువ మెజారిటీలు వచ్చేలా చూడాలన్న సీఎం
- సీఎం సూచనలతో ఆ దిశగా పని చేస్తామన్న నేతలు
8:38 PM, Mar 13th, 2024
ఏలూరు జిల్లా: వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు
- పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు
- టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి వెయ్యి మంది కార్యకర్తలు చేరిక
- పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి
- డ్వాక్రా, రైతుల రుణాలు, మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశాడు: ఎంపీ మిథున్ రెడ్డి
- నిరుద్యోగ భృతి అంటూ వారిని మోసం చేశాడు
- జన్మభూమి కమిటీల పేరుతో పేదలను దోచుకున్నారు
- గతంలోనూ చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే బడ్జెట్
- సీఎం జగన్ లేకపోతే రానున్న రోజుల్లో పథకాలు ఆగిపోతాయి
- సచివాలయాలు, జన్మభూమి కమిటీలకు అడ్డాగా మారిపోతాయి
- వాలంటీర్లు వ్యవస్థను తొలగిస్తారు
- టీడీపీ, జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో 11మంది టీడీపీ అభ్యర్థులే
- బీజేపీ పేరుతో పోటీ చేసేవారు కూడా టీడీపీ అభ్యర్థులే
- కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పార్టీకి కోవర్ట్‌గా పనిచేస్తుంది
- చంద్రబాబు మనుషులే అన్ని పార్టీల్లో ఉంటారని గమనించాలి
- అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్‌పై కుట్రలు చేస్తున్నాయి
- సీఎం జగన్ పొత్తు ప్రజలతోనే.. ఏ పార్టీని నమ్ముకో లేదు
7:42 PM, Mar 13th, 2024
సంక్షేమ సారధి.. అభివృద్ధి వారధి మన జగనన్న: పోలవరం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి
- సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారు
- సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లుగా 58 నెలల పాలన సాగించారు
- వివక్షత.. అవినీతికి తావు లేకుండా పాలన సాగించారు
- రాష్ట్రంలో అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదు
- మొద్దు నిద్రలో ఉన్న ప్రతిపక్షానికి అభివృద్ధి కళ్లకు కనపడదు
- జగనన్న మీద బురద జల్లుతూ ఎత్తులు, పొత్తులు.. జిత్తులతో గుంటనక్కల్లా వస్తున్నారు
- జగనన్న ఎదుర్కోలేక నాలుగైదు జండాలు కట్టుకొని వస్తున్నారు
- పోలవరం గడ్డ జగనన్న అడ్డా
- పోలవరం నియోజకవర్గాన్ని గెలిచి జగనన్నకు గిఫ్ట్‌గా ఇస్తాం
7:03 PM, Mar 13th, 2024
పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్
- మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
- అనుమతి లేకుండా ర్యాలీగా ఒక్కసారిగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వైపు దూసుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు
- అడ్డుకున్న పోలీసులు
- పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం
- పోలీసులను నెట్టేసి వారి చేతిలో ఉన్న లాఠీలను లాక్కోడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు
- పోలీసులపైన దౌర్జన్యం
5:16 PM, Mar 13th, 2024
టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా
- జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే
- టీడీపీ నుండి నేతలను పంపిస్తున్న చంద్రబాబు
- వారినే పార్టీలో చేర్చుకుని సీట్లు ఇస్తున్న పవన్ కల్యాణ్
- నిన్న భీమవరం, నేడు తిరుపతి
- జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు
- అంజిబాబుకి భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన పవన్ కల్యాణ్
- ఈ రోజు జనసేనలో చేరిన టీడీపీ నేత గంటా నరహరి
- తిరుపతి అసెంబ్లీ సీటు గంట నరహరి కి ఖరారు చేసిన పవన్ కల్యాణ్
- నరసాపురంలోనూ ఇదే పంథా
- టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారు
- ఇదేం పొత్తు అంటూ పవన్‌పై జనసేన నాయకుల ఆగ్రహం
4:48 PM, Mar 13th, 2024
ఈ నెల 18 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం
- ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం
- తొలిరోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్‌లో సీఎం జగన్ ప్రచారం
- రోడ్ షో కూడా ఉండే అవకాశం
- రోజూ రెండు మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్
- ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్
4:35 PM, Mar 13th, 2024
బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి పరాభవం
- చంద్రబాబు నివాసానికి వచ్చిన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి
- చంద్రబాబుని కలిసేందుకు అనుమతి లేదంటూ గేటు వద్ద నిలిపేసిన పోలీసులు
- బీజేపీ నుంచి జమ్మలమడుగు టికెట్ ఆశిస్తున్నా ఆదినారాయణరెడ్డి
- టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దని చెపుతున్న బీజేపీ సీనియర్ నేతలు
- ఈ రోజు బీజేపీ కార్యాలయంలో ఇదే అంశంపై భేటీ అయినా బీజేపీ పెద్దలు
- చంద్రబాబు ద్వారా టిక్కెట్ కోసం మంతనాలు చేయాలని వచ్చిన ఆదినారాయణరెడ్డి
3:59 PM, Mar 13th, 2024
ఏపీ బీజేపీలో ముసలం
- పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి
- అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం
- నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తి
- అరకుకి కొత్తపల్లి గీత,రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు
- ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం
- కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం సీనియర్లు మండిపాటు
- జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై చర్చిస్తున్న సీనియర్లు
- చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై చర్చ
- పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలంటున్న సీనియర్లు
3:55 PM, Mar 13th, 2024
పశ్చిమగోదావరి: ఉండి టీడీపీలో ముసలం
- సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం
- టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు
- 20 ఏళ్ల నుంచి టీడీపీకి నిబద్ధతతో పనిచేశా: శివరామరాజు
- నా అభిప్రాయం తీసుకోకుండా అభ్యర్థిని ప్రకటించారు
- త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
3:22 PM, Mar 13th, 2024
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత గండి రవికుమార్
- సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్
- రవికుమార్‌తో పాటు వైఎస్సార్‌సీపీలోకి చేరిన స్ధానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్.
2:55 PM, Mar 13th, 2024
2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?: ఎంపీ మార్గాని భరత్
- యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారు
- అంటే.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా?
- మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి?
- పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా?
- బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుక్కి మాత్రమే పదవులు ఇచ్చుకున్నారు
- నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిలువునా మోసం చేశారు
- ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పుకున్నారు
- మరి ప్రత్యేకహీదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదు?
- చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి?
- టీటీడీ డబ్బులతో ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు?
- పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముకం పెట్టుకుని బీజేపీ తో కలిశారో కూడా చెప్పాలి
- అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది?
- రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేశారు
- చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదు
- 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?
- నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా?
- జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి జగన్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా?
- జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా?
2:42 PM, Mar 13th, 2024
జరిగిన మేలు చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా: కమ్యూనిస్ట్ నేత కత్తి పద్మ
- కమ్యూనిస్టు నేతలుగా మేమంతా పోరాటం చేసేది పేద ప్రజల మేలుకోసమే..
- ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుంది..
- ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి..
- ఇల్లు లేని వారికి జగన్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది..
- ఇల్లు తీసుకున్న లబ్ధిదారుల్లో గీతాంజలి ఒకరు..
- ఆమెకు జరిగిన మేలు చెప్పినందుకు ఈ సోషల్ మీడియా మూకలు ఆమెపై మానసికంగా దాడి చేసి ఆమెను హత్య చేశాయి..
- గీతాంజలిని ట్రోల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
- చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోవాలి
- ట్రోల్ చేయమని పార్టీలు డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపిస్తున్నాయి
- అందుకే ఇంతటి ఘోరం జరిగింది
- గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించడం మంచి పరిణామం
- ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంది.
2:25 PM, Mar 13th, 2024
టీడీపీలో గుర్తింపు లేదు: మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు
- ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు ఆవేదన
- టీడీపీ కోసం కష్టపడి పని చేసినా పార్టీలో తగిన గుర్తింపు లేదు
- 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఆశించాను.
- టికెట్ అడిగినా కనీసం చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేదు.
- టీడీపీ కోసం నిబద్ధతతో పనిచేసినా కనీసం గౌరవ ఇవ్వలేదు.
- గతంలో దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యేగా నాకు అవార్డు వచ్చింది.
- సర్వేల్లో సైతం భారీ మెజారిటీతో గెలుస్తానని అధిష్టానానికి తెలుసు
- ఈ 15 రోజుల్లో అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
- ఉండి నియోజకవర్గంలో ప్రజాఅభీష్టం మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను
- ఏ ప్లాట్‌ఫామ్ మీద పోటీ చేయనున్నానో రెండు రోజుల్లో ప్రకటిస్తాను.
2:10 PM, Mar 13th, 2024
టీడీపీ, జనసేన ఆత్మగౌవరం లేని పార్టీలు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్
- మోదీకి రాష్ట్రాన్ని దారాదత్తం చేయడానికి చంద్రబాబు, పవన్ సిద్ధమయ్యారు.
- మోదీని పల్లకిలో ఇద్దరు నేతలు మోస్తున్నారు.
- పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమిటో చెప్పాలి.
- రాష్ట్రానికి అన్యాయం చేశారని బయటకు వచ్చామని చంద్రబాబు చెప్పారు.
- చంద్రబాబుకు నీతి నిజాయితీ లేవు.
- టీడీపీ-జనసేన కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు.
- చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కలుస్తున్నారు.
- టీడీపీ-జనసేన కార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు.
- స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఎందుకు చంద్రబాబు, పవన్ మాట్లాడడం లేదు.
- రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు.
- టీడీపీ-బీజేపీ-జనసేనది విద్రోహ కూటమి.
- రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో చంద్రబాబు ఎలా కలిశారు.
- వీరి పొత్తు రాష్ట్రాన్ని ముంచేస్తుంది.
- 21 సీట్లు తీసుకోవడాన్ని చూసి జనసేన నేతలు సిగ్గు పడుతున్నారు.
- ఆత్మ గౌరవంలేని పార్టీలు టీడీపీ-జనసేన.
- ఆత్మ గౌరవంలేని పార్టీలు ఉంటే ఎంత? లేకుంటే ఎంత?.
1:50 PM, Mar 13th, 2024
లోక్‌సభ బరిలో కేఏ పాల్
- ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
- విశాఖ నుంచి బరిలో కేఏ పాల్
- కేఏ పాల్ పోటీపై స్పష్టతనిచ్చిన బాబూ మోహన్
- కేఏ పాల్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న బాబూ మోహన్
1:20 PM, Mar 13th, 2024
టీడీపీ మహిళా నేతల ఆందోళన..
- కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ మహిళా నేతల ఆందోళన.
- కడప టీడీపీ ఇంచార్జ్ మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు.
- మాధవికి కడప టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ కార్యకర్తలు.
- తమను పట్టించుకోని నాయకులు తమకు వద్దంటూ ఒంటి కాలిపై నిలబడి, కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన.
- నాన్ లోకల్ లీడర్లు వద్దని, లోకల్ లీడర్ల నాయకత్వం కావాలని మహిళల నిరసనలు.
1:00 PM, Mar 13th, 2024
పవన్‌కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్
- పవన్ రాజకీయ అజ్ఞాని
- పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రిని అవుతానన్నాడు
- పొత్తన్నాడు 60 సీట్ల మనవే అన్నాడు
- 60 నుంచి 24 సీట్లకు వచ్చాడు
- ఇప్పుడు 24 నుంచి 21 సీట్లకు వచ్చాడు
- ఆ 21 సీట్లలోనైనా పోటీచేయడానికి అభ్యర్ధులున్నారా?.
- రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం
- మంచితనానికి దుర్మార్గులైన చంద్రబాబు, పవన్, బీజేపీకి మధ్య జరిగే యుద్ధం
- ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయం
- 2014లో ముగ్గురూ కలిసొచ్చారు.. విడిపోయారు
- మళ్లీ ఇప్పుడు ముగ్గురూ కలిసి వస్తున్నారు
- చంద్రబాబు, పవన్, బీజేపీలకు విలువలు, విశ్వసనీయత లేవు
- లెక్కాలేదు .. తిక్కా లేదు
- చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారు
- ఎక్కడ పోటీచేస్తాడో తెలియని పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేడు
- చంద్రబాబు, పవన్ పనికిరాని వ్యక్తులు.
- యుద్ధంలో పోటీచేయమంటే అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి పవన్
- 175 చోట్లా పోటీచేయమంటే చంద్రబాబు పారిపోయాడు
- కనీసం 50 చోట్లైనా అభ్యర్థులను పెట్టమంటే పవన్ పారిపోయాడు
- టీడీపీ, జనసేన, బీజేపీలకు అడ్రస్ లేకుండా చేస్తాం ఇది రాసిపెట్టుకోండి
- 175 స్థానాల్లో 175 వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం
- చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతారు
- బీజేపీ ఢిల్లీ పారిపోతుంది
- ఏపీలో ఉండే ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ.. ఏకైక నాయకుడు సీఎం జగన్.
12:45 PM, Mar 13th, 2024
అభిమానులకు ముద్రగడ మరో లేఖ
- తన అభిమానులకు ముద్రగడ లేఖ
- ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో చేరిక వాయిదా
- ఈనెల 15, లేదా 16 వ తేదిన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరిక.
- సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తనతో ఎవరూ రావొద్దని అభిమానులకు మనవి చేసిన ముద్రగడ
12:30 PM, Mar 13th, 2024
వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన
- ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్
- ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించే అవకాశం
- ఇప్పటికే అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారు
- ఒకటి, రెండు మార్పులతో ఫైనల్ లిస్టు
- వైఎస్సార్ ఘాట్ వద్ద అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధినేత జగన్
- అనంతరం ఎన్నికల ప్రచారంలోకి దిగనున్న వైఎస్ జగన్
12:10 PM, Mar 13th, 2024
జేసీ ప్రభాకర్‌కు భయం పట్టుకుంది: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- నేను ఓడినా .. గెలిచినా తాడిపత్రిలోనే ఉంటా
- టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టిపోతాడు
- మహిళను మోసం చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునకు జేసీ మద్దతు ఇస్తున్నారు
- జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు కౌన్సిలర్ మల్లికార్జునను మంద లించలేదు
- తనకు అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే బాధితురాలిపై జేసీ దురుసుగా ప్రవర్తించారు
- మహిళకు అన్యాయం జరుగుతే మహిళలు వెంట ఎవరైనా ఉంటారు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కౌన్సిలర్ వెంటా ఉన్నాడు
- కౌన్సిలర్ పోతే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవి పోతుందని భయపడుతున్నాడు
11:55 AM, Mar 13th, 2024
అందరూ ప్రజా సేవకులే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ముఖ్యమంత్రి దగ్గర్నుంచి వలంటీర్ల దాకా అంతా ప్రజా సేవకులే
- అవినీతి రహిత పాలనే ధ్యేయంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు
- మా ప్రభుత్వంలో ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప రికార్డ్
- సచివాలయాల వద్దనే ఎరువులు, విత్తనాల దుకాణం ఏర్పాటు
- ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేశాం
11:40 AM, Mar 13th, 2024
పవన్‌కు మంత్రి అమర్నాథ్ కౌంటర్
- సీఎం జగన్ ఆదేశం మేరకు గాజువాకలో పోటీ చేస్తా
- గాజువాక నేను పుట్టి, పెరిగిన సొంత నియోజకవర్గం
- మా తాత, తండ్రి అక్కడ గెలిచారు
- నేను కూడా సీఎం జగన్ ప్రజాదరణతో గెలుస్తాను.
- పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారా లేదో తెలియదు
- ప్రత్యర్థి ఎవరైనా మాకు నష్టం లేదు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దొంగలు ఎవరో తేలింది
- టీడీపీ, జనసేన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి
- ఇప్పుడు స్టీల్‌ప్లాంట్ కార్మికులు, విశాఖ ప్రజలు మూడు పార్టీలకు బుద్ధి చెప్తారు
- పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశాడు
- పొత్తులో చంద్రబాబు తగ్గించుకోవాల్సిన సీట్లు పవన్ తగ్గించుకున్నారు
- జనసేన నాయకులు, కార్యకర్తల జీవితాలను పవన్ నాశనం చేశారు
- సీఎం జగన్‌ను ఓడించడం అన్నది పవన్ కాదు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు
11:20 AM, Mar 13th, 2024
ఆడబిడ్డకు అన్యాయం చేస్తున్న జేసీ ప్రభాకర్
- నేను ఓడినా .. గెలిచినా తాడిపత్రి లోనే ఉంటా
- జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టి పోతాడు
- మహిళను మోసం చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున కు జేసీ మద్దతు ఇస్తున్నారు
- జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు కౌన్సిలర్ మల్లికార్జున ను మందలించలేదు
- తనకు అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే బాధితురాలితోనూ జేసీ దురుసుగా ప్రవర్తించారు
- మహిళకు అన్యాయం జరుగుతే మహిళలు వెంట ఎవరైనా ఉంటారు.. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కౌన్సిలర్ వెంటా ఉన్నాడు
- కౌన్సిలర్ పోతే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవి పోతుందని భయపడుతున్నాడు
జేసీ ప్రభాకర్‌పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి మండిపాటు
11:05 AM, Mar 13th, 2024
పొమ్మనలేక పొగపెడుతున్న చంద్రబాబు..
- వివాదాల మయంగా మారిన విశాఖ సౌత్ టీడీపీ పరిస్థితి.
- గండి బాబ్జికి పొమ్మనలేక పొగ పెడుతున్న చంద్రబాబు.
- సౌత్ నియోజకవర్గం నుంచి మారాలని బాబ్జిపై ఒత్తిడి.
- మాడుగుల వెళ్లాలని బాబ్జికి ఆదేశం.
- పొత్తులో భాగంగా సౌత్ సీటు జనసేనకు అంటున్న టీడీపీ.
- ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న గండి బాబ్జి.
- మాడుగుల వెళ్ళేది లేదంటున్న బాబ్జి.
- సౌత్‌లో జనసేనకు బలమే లేదంటున్న బాబ్జి అనుచరులు.
- బాబ్జికి మద్దతుగా అనుచరులు మీడియా సమావేశం.
- సౌత్ నుంచి జనసేన సీటు ఆశిస్తున్న సీతంరాజు సుధాకర్, వంశీ, సాధిక్.
10:54 AM, Mar 13th, 2024
ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం
- ఎంపీ సీటు పై బిజెపిలో రగులుతున్న అసంతృప్తి
- టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి
- చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయం
- ఏలూరు పార్లమెంట్లో గత పదేళ్లుగా బిజెపిని బలోపేతం చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి
- ఈనెల 15న పార్టీలకతీతంగా ఆత్మీయ సమావేశం కు పిలుపునిచ్చిన గారపాటి చౌదరి
- నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం
- ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్ గా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్
- ఈ నెల 15 న ఏలూరులో ఆత్మీయ సమావేశం లో కీలక ప్రకటన చేయనున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి
10:20 AM, Mar 13th, 2024
భీమవరం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి
- భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపు
- టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు.
- సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం
- టీడీపీ అధిష్టానం తనను గుర్తించలేని శివరామరాజు ఆవేదన
- శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించిన అనుచరులు
9:40 AM, Mar 13th, 2024
పవన్‌కు గ్రంధి శ్రీనివాస్ కౌంటర్
- పవన్ కల్యాణ్‌ను మానసిక వైద్యులకు చూపించాలి
- పవన్‌ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేపించాలి
- వ్యాధిని.. రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
- పవన్ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం
- పవన్ నన్ను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.
- పవన్‌కు నామీదు ఎందుకంత అసూయ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
- గత నెలలో భీమవరం వచ్చి నామీద ద్వేషం లేదన్నాడు.
- ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడు. తాను స్థలం కొందామంటే నేను అడ్డుకున్నానని అంటున్నాడు.
- పవన్ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది.
- ప్రపంచ కుబేరులు భీమవరంలో ఎక్కడ ఉన్నారు?.
- చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 24 సీట్లు తీసుకున్నావ్.
- జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు.
- నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నావు.
- జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వదంటూ చులకనగా మాట్లాడుతున్నాడు.
- నువ్వు మాట్లాడే భాష ఏంటి?.
- నీకు ఎకరం స్థలం కావాలా?.
- నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను.
- మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులకు కనీసం సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు.
- మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం పవన్ సీఎం అంటూ వారు అరుస్తున్నారు.
- ఇప్పటికే 24 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు.
- పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరుగబడుతుంది.
- నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో.
- పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలి.
8:50AM, Mar 13th, 2024
కూటమిలో కొత్త చిచ్చు..!
- సీట్ల సర్దుబాటుపై అసలు బీజేపీ నేతలలో తీవ్ర అసంతృప్తి
- అధికారంలో లేనప్పుడు 2014 పొత్తులలోనే నాలుగు ఎంపీ, 13 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశామని గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు
- కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడంపై మండిపాటు
- ఎనిమిది ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు తీసుకోవాల్సిదంటున్న అసలు నేతలు
- అరకు, నరసాపురం స్ధానాలు కోరకపోయినా ఇచ్చినట్లుగా పచ్చ మీడియా ద్వారా టీడీపీ లీకులపై బీజేపీలో ఆందోళన
- జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి పేర్లే జాబితాలో లేకుండా టీడీపీ కుట్రలు
- చంద్రబాబు కోసం పనిచేసే సీఎం రమేష్, సుజనాచౌదరి, కొత్తపల్లి గీత, పురందేశ్వరి పేర్లపై అసంతృప్తి
- మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే టిక్కెట్లు కేటాయించాలంటున్న బీజేపీ నేతలు
- ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిపి ఫిర్యాదు చేసే యోచనలో అసలు బీజేపీ అగ్రనేతలు
8:15AM, Mar 13th, 2024
పయ్యావుల కేశవ్ ప్రలోభాలు..
- టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓటర్లకు ప్రలోభాలు
- ఉరవకొండ నియోజకవర్గంలో చీరల పంపిణీ చేపట్టిన టీడీపీ నేతలు
- ఇంటింటికీ చీరలు, కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు
- చీరలు తీసుకోండి.. పయ్యావుల కేశవ్‌కు ఓటేయండి అంటున్న ఉరవకొండ టీడీపీ నేతలు
7:50 AM, Mar 13th, 2024
మోదీకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: లక్ష్మీపార్వతి
- ప్రధాని మోదీకి చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
- గుజరాత్ నుంచి మోదీని అరెస్ట్ చేసి, బహిష్కరించాలని అప్పటి ప్రధాని వాజ్‌పాయ్‌కు బాబు ఫిర్యాదు చేశారు.
- ఇప్పుడు మళ్లీ బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు.
- రాజకీయ స్వలాభం కోసం పొత్తులు, ఎంతటి నీచానికైన దిగజరుతాడు అనటానికి బీజేపీ పంచన చేరడమే నిదర్శనం
- సిద్దం సభలకు వచ్చే ప్రజల్ని చూసి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది
- ప్రజలకు డీబీటీ ద్వారా 2.50 లక్షలు కోట్లు పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్
- అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించారు
- రాష్ట్రంలో టీడీపీ అండ్ కో పార్టీలను పాతాళానికి తొక్కే రోజులు ఆసన్నమయ్యాయి.
7:20 AM, Mar 13th, 2024
వైఎస్సార్‌సీపీ 12వ జాబితా విడుదల
- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితా విడుదల
- చిలకలూరిపేట సమన్వయకర్తగా కావటి మనోహర్‌నాయుడు
- గాజువాక సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్.
7:00 AM, Mar 13th, 2024
చంద్రబాబు పై ఒరిజినల్ బీజేపీ నేతల అసంతృప్తి
- చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఒరిజినల్ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు
- పొత్తుల పంచాయితీలో రెండుగా విడిపోయిన ఏపి బీజేపీ
- పొత్తులపై మరోసారి పునర్ సమీక్షించాలంటూ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్ కోరిన ఏపి బీజేపీ సీనియర్లు
- బీజేపీ కి వెన్నుపోటు పొడిచేలా సీట్ల పంపకాలు జరిగాయి అంటున్న జాతీయ ,రాష్ట్ర నేతలు
- కేంద్ర పెద్దలను కలిసే యోచనలో సత్య కుమార్,విష్ణు వర్ధన్ రెడ్డి, జివియల్ , సోము వీర్రాజు తొ పాటు 30 మంది బీజేపి అగ్ర నేతలు
- వలస నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ నేతలకు అన్యాయం చేయోద్దని కోరుతున్న బీజేపీ నేతలు
- ఓడిపోయిన నేతలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్న బీజేపీలో ఒక వర్గం నేతలు
- సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక లో బీజేపీ ఒరిజినల్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కోరనున్న నేతలు
6:50 AM, Mar 13th, 2024
పవన్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి
- 24 నుంచి 21 సీట్లుకు తగ్గడంపై ఆగ్రహం
- పవన్ స్వార్థం కోసం ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన
- నాయకుడు అనే వాడు సీట్లు ఆదనంగా అడగాలి
- ఉన్న సీట్లును వదులుకునే వాడిని నాయకుడు అనరు.
- పవన్ తీరుతో 25 మంది సీట్లను కోల్పోవలసి వచ్చింది
- చంద్రబాబును నాలుగైదు సీట్లు అదనంగా ఎందుకు అడగలేకపోతున్నారు
- మొదట టీడీపీ, ఇప్పుడు బీజేపీ కోసం జనసేన సీట్లు కోత పెడతారా
- పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది
6:40 AM, Mar 13th, 2024
చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్
- నన్ను నమ్మి ఓటేయండని చెప్పిన పవన్.. చంద్రబాబును వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు
- మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా?
- ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా?
- పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా?
- నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు
- రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది మీరంతా కలిశారు
- ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?
- పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?
- రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
- ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు
- సీఎం జగన్‌ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం
- పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు
- పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా
- ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు
- జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు
- బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్
- చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు
- షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు
- ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు
- కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది
- మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్‌కు ఏం సంబంధం
- తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా?
- పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా?
- రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా?
- బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు
- నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా?
- బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు?
- తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు
- చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు
- ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు
- ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది
- ఆ పార్టీని హుస్సేన్ సాగర్‌లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్‌ని సాధించాలని చూస్తోంది
- కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు
- ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ
- డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా..
6:30 AM, Mar 13th, 2024
నిడదవోలులో జనసేనకు సహకరించం: టీడీపీ కార్యకర్తలు
- నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య రాజుకున్న చిచ్చు
- పొత్తులో భాగంగా జనసేన కందుల దుర్గేష్‌కు టికెట్ కేటాయింపు
- సోమవారం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
- దుర్గేష్ నిడదవోలు టికెట్ కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషా రావు వర్గం ఆగ్రహం
- టికెట్ శేషారావుకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్
- జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని ప్రకటనలు
- ఉమ్మడి అభ్యర్థిగా నేడు నిడదవోలు వెళ్తున్న కందుల దుర్గేష్
- ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే రాజకీయ వర్గాల చర్చ
Comments
Please login to add a commentAdd a comment