April 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections 2024: Political News Round Up On April 2nd In Telugu | Sakshi
Sakshi News home page

AP Elections Updates April 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌, ఎప్పటికప్పటి సమాచారం..

Published Tue, Apr 2 2024 7:03 AM | Last Updated on Tue, Apr 2 2024 8:39 PM

AP Elections 2024: Political News Round Up On April 2nd In Telugu - Sakshi

AP Political News And Election News April 2nd Telugu Updates

8:39 PM, April 2nd 2024

నెల్లూరు: 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా పేదలంతా ఉన్నారు: కనుమూరి రవి చంద్రారెడ్డి 

  • చంద్రబాబు 100 తలలు ఉన్న రాక్షసుడు
  • వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందకుండా చేసి అవ్వా, తాతల ఉసురుతో పాటు కిడ్నీ బాధితుల ఉసురు కూడా చంద్రబాబు పోసుకుంటున్నాడు
  • రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్ దారుల ఓట్లు పోయాయని చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు భయం పట్టుకుంది
  • పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేస్తే జన్మభూమి కమిటీలను తీసుకొస్తాడు

8:00 PM, April 2nd 2024

పార్వతీపురం మన్యం జిల్లా: 

సంక్షేమం గ్రామాల్లో ఉండాలంటే మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి: వైవీ సుబ్బారెడ్డి
పార్వతీపురం లో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి

  • ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  మీ ప్రాంతాల్లో ప్రజాదరణ కలిగిన నాయకులను అభ్యర్థలను ఎంపిక చేయడం జరిగింది.
  • నేటి వరకు గడిచిన వైఎస్సార్‌సీపీ పాలన ప్రతి ప్రాంతంలో ప్రజలు సంక్షేమ పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు 
  • రాబోయే రోజుల్లో కూడా ఇంతే సంక్షేమం గ్రామంల్లో ఉండాలి అంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి
  • వైఎస్సార్‌సీపీ శ్రేణులు గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయ్యాలి
  • మన ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ నాణ్యత గల విద్యా, వైద్యం అందించడం జరిగింది
  • దివంగత వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఐదు లక్షల వరకు ఆరోగ్యానికి భరోసా కల్పించారు 
  • మరి ఆయన తనయుడు సీఎం జగన్‌ 25 లక్షల రూపాయలు వరకు ఉచిత వైద్యం కోసం పథకాన్ని నిర్వహించారు.
  •  గడిచిన 58 నెలలుగా మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 1540 కోట్ల రూపాయలను పార్వతీపురం నియోజకవర్గంలో 1 లక్ష 54 వేల మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది
  • ఒక్క పార్వతీపురంలో  45 వేల మంది అవ్వ,తాతలు ఫించన్ లబ్ధిదారులు ఉన్నారు

5:50 PM, April 2nd 2024

పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది:
మదనపల్లె మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌

  • చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి
  • అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు
  • మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు
  • 2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు
  • రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • ఆడబిడ్డ పుడితే రూ. 25వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?
  • ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
  • రాష్ట్రాన్ని సింగపూర్‌ మించి అభివృద్ధి చేస్తాడంట
  • ఇది  2014 ఎన్నికల్లో చంద్రబాబు  ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి
  • ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు
  • మరి మదనపల్లెలో ఏమైనా హైటెక్‌ సిటీ కనబడుతుందా?
  • ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటివి 650కి పైగా హామీలు కనిపిస్తాయి
  • ముఖ్యమైన హామీల పరిస్థితి ఇది అయితే, మరి మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు
  • ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు
  • ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను.
  • ప్రతీ గ్రామానికి మంచి చేశాం
  • చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్‌ సెంచరీ కొట్టేందుకు, రెండు వందలకు రెండొందల కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా
  • 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం
  • మ్యానిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం.. నెరవేర్చిన తర్వాత ఓటు అడగటానికి అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం.
  • విశ్వసనీయతకు ఇది అర్థం అని చెబుతూ అడుగులు వేశాం ఈ 58 నెలల పాలనలో..
  • ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత మీ ముందు నిలబడి ఇది మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
  • ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ,  మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతీ ఇంటికి వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్‌కు మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారంటే దానికి కారణం మంచి చేశాం కాబట్టేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను
  • ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు
  • అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత  కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు.
  • జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్‌ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను

5:30 PM, April 2nd 2024

కాకినాడ: 

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు:  ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

  • ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలు చేసే చంద్రబాబును ప్రజలు బహిష్కరించాలి
  • చంద్రబాబువి కుట్ర,కుతంత్ర రాజకీయాలు
  • పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా గతంలో అడ్డంకులు సృష్టించాడు
  • ఇవాళ వాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు ఫించన్ అందకుండా చేశాడు

5:00 PM, April 2nd 2024

విశాఖ:

వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి

  • బీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్
  • వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం
  • గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలు
  • పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్
  • టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్
  • టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్‌కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలు
  • అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్  ఎందుకు మార్చరని డిమాండ్
     

4:40 PM, April 2nd 2024

తాడేపల్లి :

వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున

  • పెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు
  • పేదలకు సహాయం చేయనీయకుండా చేశారు
  • బీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారు
  • ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారు
  • టిప్పర్ డ్రైవర్‌లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు
  • చంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష?
  • ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు
  • చంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారు
  • పెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణం
  • కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారు
  • కానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారు
  • అలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి?
  • ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు?
  • చంద్రబాబు బతుకు చెడ
  • జగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయి
  • పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు

4:30 PM, April 2nd 2024

కుప్పం(చిత్తూరు జిల్లా):
వాలంటీర్లపై నిందలు వేస్తూ, వేధిస్తున్నారు : ఎంపీ రెడ్డప్ప

  • కుప్పం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప
  • ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు
  • వాలంటీర్లు ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ కొట్టుకు పోవడం ఖాయం
  • మేము ఉన్నా లేకపోయినా, వాలంటీర్లే రాష్ట్ర భవిష్యత్తు
  • వృద్ధులకు, పేద ప్రజలకు చేదోడు వాదోడుగా వాలంటీర్లు
  • వాలంటీర్ల నుండి పెన్షన్ ఇవ్వకుండా చేసింది చంద్రబాబు
  • చంద్రబాబు ఓడిపోతాడనీ సర్వేల్లో తేలిపోయింది
  • మే 13 న జరిగే ఎన్నికల్లో భరత్ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం
  • కుప్పంలో జరిగే గంగమ్మ జాతరకు చంద్రబాబు ఎప్పుడైనా వచ్చారా?
  • మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • తెలుగుదేశం పార్టీ మాకు పోటీ కాదు

4:00 PM, April 2nd 2024

ఎన్టీఆర్ జిల్లా:

తిరువూరు మండలం రోలుపడి గ్రామ వాలంటీర్లు 18 మంది రాజీనామా

  • ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన వాలంటీర్లు
  • రాజీనామా పత్రాలను ఎంపీడీవో కార్యాలయంలో అందజేసిన వాలంటీర్లు

2:55 PM, April 2nd 2024

ఢిల్లీ:

ఏపీ లోక్‌సభ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం

  • ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌
  • కడప లోక్‌సభ నుంచి షర్మిల పోటీ
  • కాకినాడ నుంచి పల్లంరాజు
  • రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు
  • బాపట్ల నుంచి జేడీ శీలం
  • కర్నూల్ నుంచి రామ్‌ పుల్లయ్య యాదవ్‌
  • కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్
  •  వీటితో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

1:50 PM, April 2nd 2024
ఎన్నికల కోసం అబ్జర్వర్ల నియామకం

  • ఏపీలో ఎన్నికల నిర్వహణ కోసం అబ్జర్వర్లను నియమించిన సీఈసీ. 
  • జనరల్‌ స్పెషల్‌ అబ్జర్వర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాంమోహన్‌ మిశ్రా. 
  • పోలీసు స్పెషల్‌ అబ్జర్వర్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ దీపక్‌ మిశ్రా. 

1:35 PM, April 2nd 2024
అవనిగడ్డ జనసేనలో కుంపట్లు 

  • అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు 
  • జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్‌కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు 
  • ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం 
  • చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ 
  • డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్‌కి సీట్ ఇస్తారా? 
  • జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు

1:15 PM, April 2nd 2024
అవ్వాతాతల దెబ్బకు బాబు అబ్బా అంటాడు: కొండా రాజీవ్‌

  • చంద్రబాబు హాయంలో పెన్షన్ డబ్బుల కోసం ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.
  • సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి కష్టం లేకుండా పెన్షన్ అందించారు.
  • సీఎం జగన్‌ను ఎదుర్కోలేక బాబు అండ్ బ్యాచ్ పేదలపై కక్ష తీర్చుకుంటున్నారు.
  • నిమ్మగడ్డ రమేష్‌తో బాబు శిఖండి ఆట ఆడుతున్నాడు.
  • వాలంటీర్లను చూస్తే బాబుకి వెన్నులో వణుకు పుడుతుంది.
  • చంద్రబాబు బుద్ది ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది.
  • పెన్షన్ రాకుండా ఆపిన బాబు.. ఇప్పుడు సకాలంలో పెన్షన్ ఇవ్వాలని దొంగ ఏడుపు నటిస్తున్నాడు.
  • చంద్రబాబుకి దమ్ముంటే ఎన్నికల సంగ్రామంలో తేల్చుకోవాలి.
  • వచ్చే ఎన్నికల్లో అవ్వా తాతలు కొట్టే దెబ్బ.. చంద్రబాబు అబ్బా అంటాడు.

12:50 PM, April 2nd 2024
చంద్రబాబు షాడో నిమ్మగడ్డ రమేష్‌: ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 

  • నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు షాడో.
  • చంద్రబాబు పెన్షనర్ల ఉసురు పోసుకుంటున్నాడు.
  • ఒకటో తేదీన పెన్షన్ ఠంచనుగా వస్తుందని వారంతా ఆనందంగా ఉండేవారు.
  • పెన్షన్ అందకుండా చేసినందుకు ప్రజలు చంద్రబాబుని ఛీ కొడుతున్నారు.
  • ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నాడు.
  • చంద్రబాబు 67 లక్షల మంది పెన్షనర్ల ఉసురు తగిలి పోతాడు.
  • చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు డిపాజిట్లు కూడా రావు.
  • నేను ఇంకా మాట్లాడితే బూతులు వస్తాయి.
     

12:30 PM, April 2nd 2024
పోటీకి కాంగ్రెస్‌ సీనియర్ల వెనకడుగు..

  • ఏపీ కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్‌.. ఎన్నికల్లో పోటీకి సీనియర్ల వెనకడుగు
  • ఏపీ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ల విముఖత 
  • పోటీ చేయనంటున్న రఘువీరారెడ్డి, కేవీపీ 
  • బలవంతంగా పల్లం రాజు, గిడుగు రుద్ర రాజులను బరిలోకి దింపుతున్న అధిష్టానం  
  • కనీసం డిపాజిట్ రాకపోతే పార్టీలో పరువు పోతుందని ఆవేదన
  • ఓడిపోయే దానికి మమ్మల్ని ఎందుకు బలి చేస్తారంటున్న సీనియర్లు 
  • మమ్మల్ని పోటీ నుంచి తప్పించాలని హై కమాండ్ పెద్దలను  వేడుకుంటున్న సీనియర్లు
     

12:00 PM, April 2nd 2024
జనసేనకు ఫ్రీ సింబల్‌గా గ్లాసు గుర్తు కేటాయింపు..

  • ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసు గుర్తు.
  • గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
  • కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే జనసేన
  • గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపులేని  పార్టీల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.
  • కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈవో గెజిట్ నోటిఫికేషన్లు విడుదల.
  • గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ.
  • రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన.
  • వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్‌ గుర్తు, టీడీపీకి సైకిల్‌ గుర్తులను ప్రకటించిన ఈసీ. 
  • ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు.

11:15 AM, April 2nd 2024
పేదల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: వెల్లంపల్లి

  • ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సీఎం జగన్‌ను గెలిపిస్తారు.
  • ఇంటికి వచ్చే పెన్షన్‌ని దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు.
  • చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, వైఎస్‌ షర్మిల, పవన్ కళ్యాణ్ పేద ప్రజల మీద కక్ష కట్టారు.
  • సుమారు 65 లక్షల మంది పెన్షన్లను ఎల్లో టీమ్‌ నిలిపివేశారు. 
  • పెన్షన్‌దారులు చంద్రబాబు అండ్ టీమ్‌కి బుద్ధి చెప్పేందుకు సిద్ధం.
  • వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంటి వద్దకు పెన్షన్ ఏ విధంగా పంపిస్తారు.
  • 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేపట్టావా?.
  • చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లన్నీ ఎత్తివేసి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇస్తారంట.
  • ఇలాంటి దుర్మార్గులకి ఓటు ఎందుకు వేయాలి.
  • జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ సానుభూతిపరులకే పెన్షన్లు ఇస్తారు.
  • కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు.
  • బుద్దా వెంకన్న, పోతిన మహేష్, వర్ల రామయ్యకు కూడా మేము సంక్షేమ పథకాలు అందించాం.
  • టీడీపీ అధికారంలోకి రావడం కలగా మిగిలిపోతుంది
  • నారా లోకేష్ ప్రజల పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు.
  • రాష్ట్రంలో నారా లోకేష్‌తో పనిలేదు.
  • జనసేన కార్యకర్తలను, నాయకులను పవన్ మభ్యపెడుతున్నాడు.
  • పవన్ మాటలకు పొంతనే ఉండదు.
  • ఆంధ్ర రాష్ట్రంలో ఒక సొంతిల్లు అయినా ఏర్పాటు చేసుకో.
  • పవన్ గతంలో పాచిపోయిన లడ్డులు అని మోదీ కాళ్లు పట్టుకున్నాడు.
  • మీ కన్న తల్లిని తిట్టిన వారితో నువ్వు పొత్తు పెట్టుకుని పల్లకీ మోస్తున్నావ్‌. 
  • వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.
  • పవన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు.
  • పేదల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది.
     

10:40 AM, April 2nd 2024
వైఎస్సార్‌సీపీలో చేరిన బీజేపీ, టీడీపీ నేతలు

  • చీకటిమునిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో చేరికలు.
  • వైఎస్సార్‌సీపీలో చేరిన బీజేపీ సీరియర్‌ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి.
  • వైఎస్సార్‌సీపీలో చేరిన మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్‌ అహ్మద్‌.
  • కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఎం.గంగాధర్‌.

10:15 AM, April 2nd 2024
చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెబుతారు: అల్లు భానుమతి

  • వాలంటీర్లు ఎవరో బయట వారు కాదు.
  • మన కుటుంబం నుంచి వచ్చిన వారే వాలంటీర్.
  • వాలంటీర్ల సేవలను అడ్డుకుంటున్న చంద్రబాబుకి ప్రజలు బుద్ది చెబుతారు.
  • ఉత్తరాంధ్ర నుంచి కూటమి అభ్యర్థుల్లో చాలా మంది నాన్ లోకల్స్ ఉన్నారు.
  • ఉత్తరాంధ్రలో వైసీపీ స్థానిక నేతలకు అవకాశం కల్పించింది.
  • బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
     

9:30 AM, April 2nd 2024
టీడీపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: దేవినేని అవినాష్‌

  • సీఎం జగన్‌ ఐదేళ్ల పాలనను ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. 
  • అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలు అందుకున్నాం అని ప్రతీ ఒక్కరూ అంటున్నారు
  • మళ్లీ మా ఓటు జగన్‌కే అని ప్రజలు అనటం సంతోషాన్నిచ్చింది
  • టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికీ అవ్వతాతలకు పెన్షన్ అందలేదు
  • టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కనుసన్నలలోనే పథకాలు ఇస్తామని లోకేష్ అనటం బాధాకరం
  • కుల మతాలకు అతీతంగా పథకాలు అమలు చేశాం.
  • టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు 
  • స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడూ ప్రజల కష్టాలు తీర్చిన దాఖలా లేదు
  • సీఎం జగన్ సహకారంతో రూ.650కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది
  • కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసింది వైఎస్సార్‌సీపీ నాయకులు, వాలంటీర్లు మాత్రమే
     

8:30 AM, April 2nd 2024
మనం చెప్పిన వాళ్లకే పథకాలివ్వాలి: నారా లోకేష్‌

  • అధికారం లేకున్నా లోకేష్‌ బెదిరింపులు.
  • వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలని బెదిరింపులు.
  • మనం చెప్పిన వాళ్లకే పథకాలు ఇవ్వాలని కామెంట్స్‌
     

8:00 AM, April 2nd 2024
పచ్చ బ్యాచ్‌పై వాలంటీర్ల ఆగ్రహం..

  • చంద్రబాబు బ్యాచ్ కుట్రలపై వాలంటీర్ల మనోవేదన
  • మూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్న వాలంటీర్లు
  • నిన్న మచిలీపట్నం, తాడిపత్రిలో పెద్ద ఎత్తున రాజీనామాలు
  • మచిలీపట్నంలోనే ఏకంగా 1227 మంది రాజీనామా
  • తమను సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంచటంపై ఆగ్రహం
  • పెన్షన్ల కోసం వృద్దులు, వికలాంగులు ఫోన్లు చేస్తున్నాంటూ ఆవేదన

7:00 AM, April 2nd 2024
21 కాదు.. 11.. పేరు జనసేనది.. పోటీ టీడీపీనే..

  • పేరే జనసేనది.. పోటీచేసేది టీడీపీనే అంటున్న జనసేన శ్రేణులు
  • ఇవి చంద్రబాబు–పవన్‌కళ్యాణ్‌ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటు
  • జనసేనకిచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలో..
  • వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనలోకి చేరిక
  • తాజాగా.. అవనిగడ్డ, పాలకొండ టీడీపీ నేతలు అలా జనసేనలో చేరి ఇలా టికెట్లు కైవసం
  • గత ఎన్నికల్లో పోటీచేసిన.. లేదా గత ఐదేళ్లలో పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న నేతలు
  • బీజేపీకి కేటాయించిన పది సీట్ల పరిస్థితి కూడా ఇంతేనంటూ కమలదళంలో చర్చ

6:50 AM, April 2nd 2024
తిరుగుబాటుతో తత్తరపాటు..

  • అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే 
  • పింఛన్ల పంపిణీపై వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు 
  • 4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు.. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు 
  • నిమ్మగడ్డ – బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు 
  • బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్‌ 
  • సీఎం జగన్‌ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘ఈనాడు’ రోత కథనాలు 
  • గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండ్‌  
  • లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా?
  • ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు  

6:40 AM, April 2nd 2024
టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు 

  • నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు 
  • నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి 
  • మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి 
  • కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులు
  • టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి 
  • అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు 
  • వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలు
  • మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు

6:30 AM, April 2nd 2024
చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నాని

  • వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు
  • ఐదారు నెలల క్రితం వాలంటీర్‌ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా?
  • పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు?
  • వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారు
  • ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా?
  • నిమ్మగడ్డ రమేష్‌కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు
  • ఎన్టీఆర్‌ను కూలదోసింది ప్రజలకు తెలియదా?
  • చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు
  • ఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement