టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చారిత్రక అవసరమని, ఇది మంత్రుల స్థాయిలో మాట్లాడే అంశం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చారిత్రక అవసరమని, ఇది మంత్రుల స్థాయిలో మాట్లాడే అంశం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో సమర్థమైన నాయకత్వాలు ఉండాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని ఆయన చెప్పారు. దీనిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు.
బీజేపీతో పొత్తు మీద తాము సమీక్షించుకుంటామని, దీనికోసం తమ పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టలేమని తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మంత్రి రావెల కిశోర్ బాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరఫున గెలిచి, ఏపీలో మంత్రిపదవి చేపట్టిన కామినేని శ్రీనివాస్ స్పందించారు.