సాధ్యం కాని ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మోసం చేయడం అన్యాయమని, ఈ విషయంలో తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని మాల మహానాడు
కోటగుమ్మం (రాజమండ్రి) : సాధ్యం కాని ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మోసం చేయడం అన్యాయమని, ఈ విషయంలో తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలోని మాల మహానాడు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న స్వార్థంతో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన సోనియాగాంధీ తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదో వివరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్ర విభజనకు మద్దతు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ప్రధాని మోదీతో జరిపిన చర్చల సారాంశాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నల్లి రాజేష్, సీతల్, దాస్యం ప్రసాద్, ఆలపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.