
'పొత్తు లేకుండానే వైఎస్సార్ సీపీ గెలుస్తుంది'
విజయవాడ: ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, చంద్రబాబు సిద్ధాంతాలకు పొంతన లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాజ్యసభ సీటును కార్పొరేట్లకు అమ్ముకున్న నేత చంద్రబాబు అని ఆరోపించారు. వైఎస్‌ఆర్ ఆశయాలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే నేరవేర్చగలరని చెప్పారు. ఏ పార్టీతో పొత్తులేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఉమ్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
టీడీపీ-బీజేపీలది విభజన కూటమి అని ఆయన అంతకుముందు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిన కారణంగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందరి కాళ్లూ పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.