Umareddy Venkateshwarlu
-
రాజన్న రాజ్యం రావాలి : గణనాథుడికి ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్ : లోటస్ పాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బత్తుల బ్రహ్మానంద రెడ్డి హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే వినాయక చవితి నాటికి ఏపీలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని, రాజన్న పాలన రావాలని, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నట్టు పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రజలందరిలో ఐక్యమత్యం పెంచుతాయని అన్నారు మండలి విపక్ష నేత ఉమ్మారెడ్డి. ‘వైఎస్సార్సీపీ విజయానికి ప్రధమ మెట్టుగా భావిస్తూ.. 2019 జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారి సిద్ధిస్తుంది. ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసంతో ఈ రోజు వినాయక చవితిని పండుగగా జరుపుకున్నాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో కలకాలం వర్థిల్లాలి. రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలనే భావనతో ఈ పండుగను చేసుకోవడం జరిగింది’ అని విజయ సాయి రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కోరుకునేది కూడా ఈ నాడు ఉన్న ప్రభుత్వం పోయి, రాజన్న రాజ్యం రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వార్లు చెప్పారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా తప్పకుడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రాప్రజానీకం సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్టు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గర్నుంచి, 87 జలయజ్ఞాలు ప్రాజెక్టులు కూడా రాబోయే సంవత్సరంలో అధికారంలోకి రాగానే తప్పకుండా పూర్తిచేయాలి. రైతాంగం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని నేడు పార్టీ ఆఫీసులో పూజ చేశామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. -
వివాహ వేడుకల్లో వైఎస్ జగన్
-
రాజధాని పేరుతో భయానకం సృష్టిస్తున్నారు: ఉమారెడ్డి
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు అని ఉమారెడ్డి సూచించారు. పంట భూములను తీసుకోవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ల్యాండ్ పూలింగ్ కు చట్ట బద్దత ఉందా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారని ఆయన తెలిపారు. భూ సేకరణ, సమీకరణలపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకే కఠిన చట్టాలు చేసిందని, ప్రభుత్వం కావాలంటే 70 శాతం మంది రైతులు ఒప్పుకోవాలని చట్టంలో ఉన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. రాజధానిపై స్పష్టత లేకుండా ప్రతిరోజు ఓ గ్రామానికి వెళ్లి.. బెదిరింపులకు గురి చేయడం సరికాదు అని ఉమారెడ్డి అన్నారు. తుళ్లురు పరిసర గ్రామాల్లో నేతలు భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారని ఉమారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: ఉమారెడ్డి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అబద్దాలను పదే పదే ప్రచారం చేస్తున్నారని, అబద్దాలలో చంద్రబాఉ గోబెల్స్ ను మించి పోయారని వారు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, అందుకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారని ఉమారెడ్డి, విజయసాయిలు తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకంగా విధానాలపై పోరాడుతున్న కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని విజయసాయి, ఉమారెడ్డిలు ఆరోపించారు. -
ఒక్క హామీనీ నెరవేర్చని బాబు: వైఎస్సార్సీపీ
* వైఎస్సార్సీపీ నేతలు * విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి ధ్వజం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అధికారం కోసం సాధ్యంకాని హామీలను గుప్పించారు. ఏ వర్గాన్నీ వదలకుండా వాన కురిసినట్లు వరాలు కురిపిం చారు. ప్రభుత్వం ఏర్పడిన ఐదునెలల్లో ఒక్క హా మీనైనా నెరవేర్చినట్లు నిరూపించగలవా? ఒక్క రైతుకైనా.. ఒక్క సంఘానికైనా రుణం మాఫీ చేశావా?’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. నెల్లూరులో మంగళవారం వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డిలతో పాటు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, రాష్ట్ర వాలంటీర్ల విభాగం అధ్యక్షుడు, చం ద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు, జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్, కిలివేటి సంజీవ య్య, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనితమ్మ హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రైతుల రుణాల న్నీ మాఫీ చేస్తానన్న బాబు మాట మార్చి పంట రుణాలు మాఫీ అని చెబుతున్నారన్నారు. బ్యాం కర్ల సమావేశంలో రోజుకోమాట చెబుతూ కాల యాపన చేస్తున్నారన్నారు. బాబు నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వచ్చేనెల 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు విజయసారుురెడ్డి ప్రకటించారు. రైతు లు, బ్యాంకర్ల మధ్య మంచి సంబంధాలు ఉండేవని, బాబు వచ్చాక ఆ సంబంధాలు తెగిపోయాయని ఉమ్మారెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ఆర్ని టార్గెట్ చేస్తూ 7 శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తాను ఇచ్చిన హామీలు, రుణాల మాఫీపై క్యాలెండర్ విడుదల చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశా రు. నాటి వైఎస్ పాలన.. నేటి బాబు పాలనను బేరీజు వేసుకుంటే ఎవరు ఎటువంటి వారో ప్రజ లకు అర్థమవుతుందన్నారు. వైఎస్ పాలనలో లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదని గుర్తుచేశారు. టీడీపీకి ఓటేసిన వారంతా తప్పుచేశామని బాధపడుతున్నారని, వారికివే చివరి ఎన్నికలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. పల్లెల్లో టీడీపీకి చెందిన చోటా నాయకుడు కూడా ప్రజలకు అడ్డంకిగా మారారని, అందువల్ల ఈసారి వారికి గూబ గుయ్యిమనేలా బుద్ధి చెప్పాలని అన్నారు. సమావేశంలో మేరుగ నాగార్జున, గౌతంరెడ్డి కూడా ప్రసంగించారు. -
నేటి నుంచి జిల్లాల్లో వైసీపీ ప్రధాన కార్యదర్శుల పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శులు ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకూ ఎనిమిది రోజులపాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, వి.విజయసాయిరెడ్డిలతో కూడిన ఈ ప్రధాన కార్యదర్శుల బృందం తమ పర్యటనలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రధానంగా సందర్శిస్తుందని శుక్రవారం పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. వీరి పర్యటనల సందర్భంగా జరిగే సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చిస్తారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నవంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమానికి పార్టీని, ప్రజలను సమాయత్తం చేసే దిశగా ఈ చర్చలు సాగుతాయి. రైతుల రుణమాఫీ చేయకపోవడం, నిరుపేదలను పింఛన్ల జాబితా నుంచి తొలగించడం వంటి ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా నవంబర్ 5న ఆందోళనలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే. వివిధ స్థాయుల్లో పార్టీ కమిటీ ఏర్పాటు, జిల్లా పార్టీ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల ఎంపికపై కూడా ప్రధాన కార్యదర్శుల బృందం దృష్టి సారిస్తుంది. సమావేశాల్లో స్థానిక సమస్యలపై కూడా చర్చిస్తారు. -
దళితులకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి
చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో దళితుల అభ్యున్నతికి చేసిన 12 వాగ్దానాలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ విభాగం డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి తొలి సమావేశం జరిగింది. ఎస్సీ సెల్ ఏపీ విభాగం కన్వీనర్ మేరుగ నాగార్జున, అవిభక్త రాష్ట్ర పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, పార్టీ శాసనసభపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు..
గుంటూరు: కోటయ్య కమిటీ నివేదిక రుణమాఫీని నీరుగార్చేలా ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణమాఫీపై కోటయ్య ఇచ్చిన రిపోర్టు కాదు.. అది టీడీపీ నేతలు రాయించిన కోటయ్యకు ఇచ్చిన రిపోర్టు మాత్రమేనని ఉమారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి సంతకానికి విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన తీవ్రంగా స్పందించారు. బాగా పనిచేసే కార్పొరేషన్లను తాకట్టు పెట్టే యోచనను విరమించుకోవాలని చంద్రబాబుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హితవు పలికారు. -
'పొత్తు లేకుండానే వైఎస్సార్ సీపీ గెలుస్తుంది'
విజయవాడ: ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, చంద్రబాబు సిద్ధాంతాలకు పొంతన లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాజ్యసభ సీటును కార్పొరేట్లకు అమ్ముకున్న నేత చంద్రబాబు అని ఆరోపించారు. వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే నేరవేర్చగలరని చెప్పారు. ఏ పార్టీతో పొత్తులేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఉమ్మారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ-బీజేపీలది విభజన కూటమి అని ఆయన అంతకుముందు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడిన కారణంగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందరి కాళ్లూ పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
ఆ పొత్తు చరిత్రహీనం-ఉమ్మారెడ్డి
-
'బీజేపీతో చంద్రబాబు ఇప్పుడెలా పొత్తు పెట్టుకున్నారు?'
హైదరాబాద్: బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ..బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదమన్న చంద్రబాబు ఇప్పుడెలా పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఉమ్మారెడ్డి నిలదీశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలన్ని ఒక్క తాటిపైకి వచ్చాయని ఆయన ఆరోపించారు. గోద్రా సంఘటన తర్వాత నరేంద్ర మోడీ వస్తే అడ్డుకుంటానన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆయనతో పొత్తుకోసం వెంపర్లాడటమే కాకుండా.. సన్మానం చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడని పొత్తు అని ఉమ్మారెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాన్ని నిట్టనిలువుగా, అడ్డగోలుగా చీల్చిన విభజన వాదుల కూటమిది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.