చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు: ఉమారెడ్డి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అబద్దాలను పదే పదే ప్రచారం చేస్తున్నారని, అబద్దాలలో చంద్రబాఉ గోబెల్స్ ను మించి పోయారని వారు ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, అందుకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారని ఉమారెడ్డి, విజయసాయిలు తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకంగా విధానాలపై పోరాడుతున్న కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని విజయసాయి, ఉమారెడ్డిలు ఆరోపించారు.