తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో దళితుల అభ్యున్నతికి చేసిన 12 వాగ్దానాలను అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ విభాగం డిమాండ్ చేసింది.
చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో దళితుల అభ్యున్నతికి చేసిన 12 వాగ్దానాలను అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ విభాగం డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి తొలి సమావేశం జరిగింది. ఎస్సీ సెల్ ఏపీ విభాగం కన్వీనర్ మేరుగ నాగార్జున, అవిభక్త రాష్ట్ర పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, పార్టీ శాసనసభపక్షం ఉపనేత ఉప్పులేటి కల్పన, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.