శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ, టీడీపీ వర్గాల మధ్య చిచ్చురేగింది. బీజేపీ నేత కోల ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టణం అంతటా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ఆనంద్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు, టీడీపీ వర్గీయులతో వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది.