కర్నూలు : భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేశాయని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. మంగళవారం కర్నూలులో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ సీపీ నేతలు బుగ్గన నాగ భూషణంరెడ్డి, మూర్తుజావలి, సీపీఎం నాయకులు ఎల్లయ్య నగరంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు ముందు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌కు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇవ్వగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తాము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారన్నారు.
అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధి పై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం నిలదీయాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి రాష్ట్ర ప్రగతిని విస్మరించారని వారు ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే 13 జిల్లాలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వామ పక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘీభావం ప్రకటించి రాస్తారోకోలో పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు
Published Tue, Aug 11 2015 1:05 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement