
సాక్షి, ఢిల్లీ: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై ఢిల్లీ వేదికగా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షాతో పొత్తుల విషయం చర్చించేందుకు చంద్రబాబు, పవన్ పడిగాపులు కాస్తున్నారు. అయితే, అమిత్ షా మాత్రం చంద్రబాబును పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడంలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
కాగా, అమిత్ షా ప్రస్తుతం ఒడిషా, మహారాష్ట్ర పొత్తులకు సంబంధించిన చర్చలతో బిజీగా ఉన్నారు. మరోవైపు.. ఈరోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా బీహార్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. పాట్నాలో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆలోపు చంద్రబాబుతో అమిత్ షా భేటీ అవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఇక.. చంద్రబాబు, పవన్ అమిత్ షా ఇంటి ముందే ఉన్నట్టు సమాచారం. ఈరోజు కూడా చర్చలు జరగకపోతే వీరిద్దరూ రేపటి వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
ఒకవేళ ఉదయం అమిత్ షా భేటీ కాకపోతే మళ్లీ రాత్రి వరకు చంద్రబాబు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. బీజేపీ-టీడీపీతో పొత్తు చర్చలు తేలకపోవడంతో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సోమువీర్రాజును రాష్ట్రానికి వెళ్లిపోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.
అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశంపై బీజేపీ హైకమాండ్ పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో తాము కోరుకుంటున్న సీట్లు ఇవ్వకపోతే పొత్తు ప్రసక్తేలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక, ప్రవాస్ యోజన కింద కేంద్ర బీజేపీ ఏపీలో 11 ఎంపీ సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా 11 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎంపీ స్థానాల విషయంలో తగ్గేదేలేదని కాషాయ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు కన్నింగ్ మైండ్ సెట్‌తో ఏపీలో బీజేపీని కొన్ని స్థానాలకే పరిమితం చేసే చూస్తూ ఊరుకునేదిలేదని గట్టిగానే వారు చెప్తున్నారు. ఎన్నడూ గెలవని జనసేనకి 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు. గతంలో ఆరు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. దీంతో, టీడీపీ-జనసేన కూటమి తటపటాయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment