పెద్ద నోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ, టీడీపీ నేతలు తమ వద్దనున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న తర్వాతనే రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారని చెప్పారు.