
ఏపీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. నీకు ఇన్నీ.. నాకు ఇన్నీ.. అని సీట్లను పంచుకుంటున్నారు. ఒంటరిగా వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి భయంతో వణికిపోతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇక, తాజాగా బీజేపీతో చంద్రబాబు జతకట్టారు. ఇన్ని రోజులు ప్రధాని మోదీని తిట్టిన బాబుకు.. ఇప్పుడెందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందో తెలుసా..?
టీడీపీ హయంలో చంద్రబాబు చేసిన అవినీతిని సీఎం జగన్ బయటకు తీశారు. దీంతో, చంద్రబాబు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇన్ని రోజులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే బాబుకే గట్టి షాక్ తగలడంతో వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ కేసుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు కొత్త రాజకీయం చేశారు. ఎన్డీయేలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను గాలికి వదిలేసి, సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేశారు.
గతంలో ఎన్డీయే నుంచి ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చానని బాబు ప్రగల్బాలు పలికాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి హామీ లేకుండానే చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరిపోయాడు. తనను వెంటాడుతున్న కేసుల భయంతో అమిత్ షా ఇంటి వద్ద పడిగాపులు పడి మరీ పొత్తులు పెట్టుకున్నారు. ఇటీవల బయటపడిన ఐఎంజీ భూమలు కుంభకోణం, రాజధాని భూముల స్కాం, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం నేపథ్యంలోనే చంద్రబాబు ఎన్డీయే పంచన చేరినట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆరోజుల్లో చంద్రబాబు కూతలు.. పచ్చ మీడియా రాతలు ఇలా..
1) ‘మోసాల మోదీ’ అంటూ చంద్రబాబు మోదీపై ఫైర్.
2) ఎంత అణగదొక్కితే నేను అంత రెచ్చిపోతా.. మోదీ దేశాన్ని భ్రస్టు పట్టించాడు.
3) ‘మోదీ హటావో’
4) మోదీ జిత్తులు, కోడి కత్తులకు భయపడను.
5) బీజేపీకి సహకరించేవాళ్ళు దేశద్రోహులు.
6) దేశం కోసం స్నేహం.. అంటూ భగవద్గీతతో పోల్చిన ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలతో.. చంద్రబాబు, కాంగ్రెస్‌ల కలయికను.. పొగుడుతూ రాశారు.
7) ఈ దేశంలో అవినీతిని పెంచి పోషించింది నరేంద్రమోదీనే.. నాకొక కొడుకున్నాడు.. నీకు పిల్లలు లేరు.. కుటుంబమే లేదు.. నువ్వు నన్ను విమర్శిస్తున్నావా? అంటూ ఆరోజుల్లో మోదీని చంద్రబాబు దుయ్యబట్టారు !
8) ఇదిగో మోదీ.. గో బ్యాక్ అంటే మళ్లీ నిన్ను ప్రధాని కుర్చీలో కూర్చోమంటున్నామనుకున్నావేమో.. గో బ్యాక్ అంటే.. నువ్వు గుజరాత్‌కి పోయి.. నీ సొంత ఊర్లో ఉండిపొమ్మంటున్నాం.. నీకు ప్రధానిగా ఉండే అర్హత లేదని గుర్తుంచుకో అంటూ మోదీని చంద్రబాబు హెచ్చరించారు.
కట్ చేస్తే..
2019 ఎన్నికల్లో 23 సీట్లొచ్చి ఇత్తడైపోవడంతో, పాత కేసులు.. 18 స్టేలు గుర్తుకువచ్చి బీజేపీతో విభేదించి నేను చాలా నష్టపోయానంటూ.. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ , గరికపాటి , టీజీ వెంకటేష్‌లను బీజేపీలోకి పంపిన చంద్రబాబు.
ఇలా గత ఐదేళ్లుగా ఒకవైపు బీజేపీకి ప్రేమ లేఖలు రాస్తూ.. మరొకవైపు దత్తపుత్రుడుతో రాయబారాలు నడిపి.. ఇప్పుడు మళ్లీ బీజేపీ పంచన చేరాడు. దీన్నే అందితే జుట్టు పట్టుకోవడం.. అందకపోతే కాళ్ళు పట్టుకోవడం అంటారు. ఇక.. వీరి పొత్తుల రాజకీయాలపై ఎల్లో మీడియా రెచ్చిపోయి మరీ ప్రచారం మొదలెట్టింది. ఇలాంటి చెత్త రాజకీయాలకు..‘అనుభవం- గోంగూర, విజన్- విస్తరాకుల కట్ట’ అంటూ బాబును, టీడీపీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, ఇవన్నింటినీ ప్రజలకు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోతే ఎలా చంద్రబాబు. మరోసారి తప్పదు భారీ మూల్యం.
Comments
Please login to add a commentAdd a comment