చంద్రబాబుకి మోడీ ముకుతాడు | Modi's firm direction has Babu in quandary | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి మోడీ ముకుతాడు

Published Mon, Apr 21 2014 5:41 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

చంద్రబాబుకి మోడీ ముకుతాడు - Sakshi

చంద్రబాబుకి మోడీ ముకుతాడు

టీడీపీ-బీజేపీ పొత్తు లో ఇంకా చిక్కుముడులు వీడలేదా? ఇప్పటికీ టీడీపీ, బీజేపీల ముసుగులో గుద్దులాట కొనసాగుతూనే ఉందా?

టీడీపీ-బీజేపీ పొత్తు లో ఇంకా చిక్కుముడులు వీడలేదా? ఇప్పటికీ టీడీపీ, బీజేపీల ముసుగులో గుద్దులాట కొనసాగుతూనే ఉందా? మోడీ వేవ్ నుంచి ఏదో ఒక మోళీ చేసేసి లాభం పొందాలన్న బాబు ప్రయత్నాలు ఫలించే సూచనలు లేవా?


నిన్న మొన్న చంద్రబాబు పొత్తుకు విరామం ప్రకటిస్తున్నానని ముందు హుంకరించి, తరువాత బిజెపి దృఢ వైఖరికి తలొగ్గారు. ఒక్క ఇచ్ఛాపురం సీటు అభ్యర్థిని మార్చి పరువు ఎలాగోలా దక్కించుకున్నారు చంద్రబాబు. అయితే ఒక వైపు పొత్తును కాపాడుకుంటూనే మరో వైపు మూడు సీట్లలో బిజెపి అభ్యర్థులపై టీడీపీ రెబెల్స్ ను నిలబెట్టారు. సంతనూతలపాడు, కైకలూరు, కడపల్లో బిజెపికి సీట్లు కేటాయిస్తూనే చంద్రబాబు దొంగ దెబ్బ తీశారు. దీంతో బిజెపి నాయకత్వం చాలా అసంతృప్తితో ఉందని తెలుస్తోంది.


ఈ అభ్యర్థులను ఉపసంహరిస్తే తప్ప నరేంద్ర మోడీ చంద్రబాబుతో ఏప్రిల్ 22 న హైదరాబాద్ లో ఒకే వేదికపై కూర్చోవడానికి సిద్ధం గా లేరని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.


ఇదే జరిగితే చంద్రబాబుకు తలతీసేసినట్టవుతుంది. మోడీతో వేదిక షేర్ చేసుకుంటే వచ్చే లాభాలన్నీ పోకుండా ఉండాలంటే ఇప్పుడు ఆ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు ఆ పని చేస్తారా? లేక పొత్తు లేకపోయినా ఫరవాలేదని అనుకుంటారా? కొద్ది గంటల్లో ఇదంతా తేలిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement