YSR Rythu Bharosa
-
పంటల బీమాకు ‘పాత’ర!
రూ.4 లక్షల బీమా పరిహారం అందుకున్నా..పసుపు, కంద, అరటి, తమలపాకు సాగు చేస్తుంటా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా రైతులకు ఎంతో బాసటగా నిలిచింది. గత ఐదేళ్లలో పైసా ప్రీమియం చెల్లించకుండా రూ.4 లక్షలకు పైగా బీమా పరిహారం పొందా. రూ.2 లక్షల వరకు పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందుకున్నా. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిహారం జమైంది. రైతాంగానికి ఎంతో ఆసరాగా ఉన్న పథకాన్ని రద్దు చేసి 2019కి ముందు ఉన్న విధానం అమలు చేయాలని నిర్ణయించడం సరికాదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, కిష్కిందపాలెం, బాపట్ల జిల్లాసాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమపై పైసా భారం పడకుండా కష్టకాలంలో ఆదుకున్న డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు పాతరేసే దిశగా టీడీపీ సర్కారు సన్నద్ధం కావడం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాం.. ఏ ఒక్కటీ ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మెరుగైన రీతిలో అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు వాటిని గాలికి వదిలేశారు. రైతులకు మేలు చేసే వ్యవసాయ సలహా మండళ్లను రద్దు చేసిన కూటమి సర్కారు కన్ను తాజాగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంపై పడింది. ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ బీమా కవరేజ్ కల్పిస్తూ ఈ పథకం దేశానికే తలమానికంగా నిలిచింది. అయితే 2019కి ముందు అమలులో ఉన్న పాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు తొలి సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రైతన్నల గుండెల్లో గుబులు రేపింది. గత ఐదేళ్లుగా తాము కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి పైసా భారం లేకుండా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే నేరుగా తమ ఖాతాల్లో జమ చేసే పరిస్థితి ఇక ఉండదన్న ఆందోళన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ సర్కారు తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమ బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాయి.ఏళ్ల తరబడి ఎదురు చూపులు..1965లో కేంద్రం తెచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ బిల్లు ఆధారంగా ప్రవేశపెట్టిన మోడల్ ఇన్సూరెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని ప్రధాని ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)గా 2016 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు ప్రీమియం చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాయి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడంతో పాటు అవగాహన లేక పలువురు రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకునే రైతులకు మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగతాది అందచేసేవి. అయితే బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుంది? ఎప్పుడొస్తుందో అంతుబట్టక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.2014–19 పరిహారం రూ.3,411.20 కోట్లే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడూ కేంద్ర పథకాలపై ఆధార పడడం మినహా అన్నదాతల సంక్షేమం కోసం తపించిన దాఖలాలు లేవు. 2014–19 మధ్య తొలి రెండేళ్లు వ్యవసాయ ఇన్సూరెన్స్కీమ్ (ఏఐఎస్), ఆ తర్వాత పీఎంఎఫ్‌బీవై అమలు చేశారు. ప్రీమియం రూపంలో 2014–19 మధ్యలో రైతులు తమ వాటాగా రూ.1249.90 కోట్లు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ.1281 కోట్లు చెల్లించింది. హుద్‌హుద్ లాంటి పెను తుపాన్, కరువు కాటకాటకాలతో రూ.వేల కోట్ల పంటలను కోల్పోయిన రైతులకు 2014–19 మధ్య దక్కిన పరిహారం కేవలం రూ.3,411.20 కోట్లు మాత్రమే. పైసా భారం పడకుండా.. పాదయాత్ర హామీ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమాకు శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది పీఎం ఎఫ్‌బీవైతో అనుసంధానించి అమలు చేశారు. 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకానికి శ్రీకారం చుట్టగా అనంతరం ఆ భారం కూడా రైతులపై పడకూడదన్న ఆలోచనతో ఖరీఫ్–2020 నుంచి నోటిఫైడ్ పంటలకు ఉచితంగా బీమా కవరేజ్ కల్పించారు. క్లెయిమ్‌లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా ప్రభుత్వం తన భుజాన వేసుకుంది. తొలి ఏడాది రైతుల వాటా (రూ.468 కోట్ల)తో కలిపి ప్రీమియం రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.971 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించింది. యూనివర్సల్ కవరేజ్‌కు కేంద్రం ముందుకు రాకపోవడంతో 2020–21, 2021–22 సీజన్లలో పీఎం ఎఫ్‌బీవైతో సంబంధం లేకుండా మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లించింది. 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం గత ప్రభుత్వం సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. ఈ క్రాప్ ప్రామాణికంగా.. ఈ క్రాప్‌తో పాటు ఈ కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదు అందచేసింది. ‘డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంట బీమా చేసింది‘ అని అందులో స్పష్టంగా తెలియచేసింది. ఈ జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించి అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందచేసింది. ప్రీమియం రూపంలో రైతుల వాటాతో కలిపి 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లు కంపెనీలకు చెల్లించింది. 2019–24 మధ్య 1.91 కోట్ల హెక్టార్లకు బీమా కవరేజీ కల్పించగా 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. రికార్డు స్థాయిలో పరిహారం.. 2014–19 మధ్య 30.85 లక్షల మందికి రూ.3411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందింది. టీడీపీ హయాంలో 6.19 లక్షల మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి గత సర్కారు అండగా నిలిచింది. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చెల్లించిన బీమా మొత్తం కంటే రూ.3,273.64 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూర్చగా 13.81 లక్షల మంది రైతులు అదనంగా ప్రయోజనం పొందారు. ఏపీ బాటలో పలు రాష్ట్రాలు.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకంగా కేంద్రం గుర్తించింది. ఇన్నోవేషన్ కేటగిరి కింద ఉత్తమ బీమా పథకంగా ఎంపిక చేసింది. 2023 ఏప్రిల్ 14న కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. ఏపీ స్ఫూర్తిగా జాతీయ స్థాయిలో పీఎంఎఫ్‌బీవైలో పలుమార్పులు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఏపీ తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. 2023–24 నుంచి మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు ఏపీ బాటలోనే రూపాయి ప్రీమియంతో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టాయి. ఉచిత పంటల బీమా పథకాన్ని కేంద్రం సహా పలు రాష్ట్రాలు ప్రశంసించాయి. రూ.1,278.80 కోట్ల ప్రీమియం చెల్లింపులకు ఎగనామం.. 2023–24 సీజన్‌కు సంబంధించి బీమా కవరేజ్ పరిధిలోకి వచ్చిన అర్హుల జాబితాను గతంలోనే కేంద్రానికి పంపించారు. ఆ మేరకు రైతుల వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,278.80 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ప్రభుత్వం మారడంతో ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత టీడీపీ సర్కారుపై ఉంది. అయితే పాత పద్ధతిలోనే పంటల బీమా అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా 2023–24 సీజన్ ప్రీమియం చెల్లింపులు జరపవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో 2023–24 సీజన్లో వర్షాభావం, వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు 2024–25 సీజన్ నుంచి రైతులే చెల్లించేలా చూడాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో వారిపై పెనుభారం పడనుంది. రైతులపై ఏటా రూ.800 కోట్లకుపైగా భారం ఏ పంటైనా సరే జిల్లాలో కనీసం ఐదువేల ఎకరాల్లో సాగైతేనే నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన పంట పెట్టుబడి ఖర్చులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్దేశిస్తాయి. ఉదాహరణకు వరికి ఎకరాకు రూ.40 వేలు ఖర్చవుతుంటే కనీసం 8 శాతం అంటే రూ.3,200 చొప్పున ప్రీమియం చెల్లిస్తేనే బీమా కవరేజ్ కల్పిస్తుంది. ఈ మొత్తంలో ఖరీఫ్‌లో అయితే 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు గతంలో చెల్లించగా మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. ఈ లెక్కన నోటిఫై పంటలకు రైతులు తమ వాటాగా ఏటా కనీసం రూ.800 కోట్లకు పైగా ప్రీమియం రూపంలో భరించాల్సి ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందని కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు సొంతంగానే ప్రీమియం చెల్లించాలి. వీరికి అవగాహన కల్పించకపోవడం, ఆర్ధిక భారం కారణంగా బీమాకు ముందుకు రావడం లేదు. దీంతో పంట నష్టపోతే విపత్తుల వేళ బీమా పరిహారం అందని దుస్థితి నెలకొంటుంది. వైఎస్సార్ రైతు భరోసాను హడావుడిగా అన్నదాతా సుఖీభవగా మార్చేసి రూ.20 వేలు ఇవ్వకుండా ఇప్పటికే సీజన్లో అన్నదాతలను ముంచేసిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేసే దిశగా అడుగులు వేయడం పిడుగుపాటుగా మారింది.రూ.2.75 లక్షల పరిహారం ఇచ్చారువైఎస్సార్ ఉచిత పంటల బీమా అన్నదాతలను ఎంతో ఆదుకుంది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాప్‌లో నమోదైతే చాలు బీమా వర్తింపచేశారు. మాకు 20 ఎకరాల భూమి ఉంది. పత్తి, శనగ, ఉల్లి సాగు చేస్తుంటాం. 2019–20లో ఒక్క ఉల్లి పంటకే రూ.1.10 లక్షల బీమా పరిహారం వచ్చింది. ఆ తర్వాత రూ.70 వేలు, రూ.42 వేలు, రూ.53 వేలు చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.2.75 లక్షల బీమా పరిహారం అందింది. రూపాయి ప్రీమియం చెల్లించకపోయినా ఇంత భారీగా పరిహారం దక్కటం ఎంతో ఊరటనిచ్చింది. అన్నదాతలకు ఎంతగానో ఆసరాగా నిలిచిన ఈ ఉచిత పంటల బీమాను కొనసాగించాలి. 2019కి ముందు ఉన్న పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. –గౌర మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కర్నూలు జిల్లాపాత విధానం సరికాదు..30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 2021 ఖరీఫ్‌లో అరటి పంట దెబ్బతినడంతో రూ.90 వేల పంటల బీమా పరిహారం నేరుగా నా ఖాతాలో జమ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ఐదేళ్లూ పైసా కూడా మేం ప్రీమియం చెల్లించలేదు. మా వాటా కూడా ప్రభుత్వమే కట్టింది. చంద్రబాబు ప్రభుత్వం పాత విధానంలో పంటల బీమా అమలు చేస్తామని చెప్పడం సరికాదు.– గనివాడ సన్యాసినాయుడు, పెదమదుపాడ, విజయనగరం జిల్లారైతులు బీమా చేయించుకోలేరు2019కు ముందు టీడీపీ హయాంలో రైతులు బీమా చేయించుకుంటేనే నష్టపరిహారం వర్తించేది. రైతులలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నందున అవగాహన లేక నష్టపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేసింది. 2021లో వర్షాలకు 80 సెంట్లు పొలంలో నష్టపోతే నేరుగా రూ.5,100 పరిహారం ఇచ్చారు. – డి. ప్రభాకర్, తాటితూరు, భీమిలి మండలంరూ.3.80 లక్షల పరిహారం వచ్చిందినేను పైసా ప్రీమియం చెల్లించకపోయినా 2021లో ఖరీఫ్‌లో పంట నష్టపోతే రూ.3.80 లక్షల బీమా పరిహారం జమైంది. గతంలో ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా పరిహారం కోసం అధికారులు, కంపెనీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఈ పథకాన్ని కొనసాగించాలి.– వీరపురం భీమేష్, గడేకల్లు, అనంతపురం జిల్లారైతుల తరపున ఉద్యమిస్తాం..రైతులపై భారం పడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాల్సిందే. పాత పద్ధతిలో పంటల బీమా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించటాన్ని ఖండిస్తున్నాం. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు బీమా ప్రీమియం రైతులకు తలకు మించిన భారమవుతుంది. ప్రీమియం చెల్లించలేక బీమాకు మెజార్టీ రైతులు దూరమవుతారు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించకుంటే ఉద్యమిస్తాం.– కె.ప్రభాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘంపాత పద్ధతితో తీవ్ర నష్టంగతంలో క్రాప్ లోన్ ఆధారంగా రైతులు సాగు చేసిన పంటలకు కాకుండా ఇష్టానుసారంగా ఇన్సురెన్స్ ఇచ్చేవారు. ఐదేళ్లుగా ఉచిత పంటల బీమా అమలు చేయడం వలన పైసా ప్రీమియం చెల్లించాల్సిన పని లేకుండా సాగు చేసిన పంటకు బీమా పరిహారం నేరుగా అందింది. ఈ పథకాన్ని కొనసాగించాలి. పాత పద్ధతితో తీవ్రంగా నష్టపోతాం.– ఎన్.రాజేశ్వరరెడ్డి, సింహాద్రిపురం, వైఎస్సార్ జిల్లా -
గడిచిన ఐదేళ్లూ ఈ పాటికే ఖాతాల్లోకి..
సాక్షి, అమరావతి: ఖరీఫ్ ఊపందుకుంటున్న వేళ పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వలేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. గత ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం చేతికందగా ఈసారి వ్యవసాయ పనులు మొదలైనా దిక్కులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులు నిల్వ చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో పీఎం కిసాన్ కంటే ముందుగానే తొలి విడత పెట్టుబడి సాయం చేతికందిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ డబ్బులు రైతులు దుక్కి దున్ని భూమిని సిద్ధం చేసుకోవడం, సబ్సిడీ పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోవడం, నారుమళ్లు పోసు కోవడం, నాట్లు వేయడం లాంటి అవసరాలకు ఉపయోగపడేవి. గతంలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా మూడు విడతల్లో అందించిన సాయం సన్న, చిన్నకారులకు ఎంతగానో ఉపయోగపడేది. రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన రైతులు 50 శాతం మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణమున్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టార్ లోపు సాగుభూమి ఉన్న రైతులు వేసే పంటలకు అయ్యే పెట్టుబడిలో 80 శాతం ఖర్చు రైతు భరోసా రూపంలో అందడంతో వారికి ఎంతో ఊరటగా ఉండేది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్‌లో టీడీపీ – జనసేన కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించారు. ఒకపక్క వ్యవసాయ పనులు జోరందుకున్నా ప్రభుత్వ పెద్దలెవరూ ఇంతవరకూ ఆ ఊసెత్తక పోవడం పట్ల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పేరు మార్చేందుకే ఉత్సాహం..ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ప్రతీ రైతు కుటుంబానికి ఏటా మే/ జూన్‌లో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి రైతులకు అండగా నిలిచారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచింది. పీఎం కిసాన్ కింద 2024–25 సీజన్ తొలి విడత సాయాన్ని మాట ప్రకారం కేంద్రం ఇటీవలే జమ చేసింది. సీఎం చంద్రబాబు కూడా అదే మాదిరిగా రైతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.20 చొప్పున పెట్టుబడి సాయాన్ని కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చటంలో చూపిన ఉత్సాహాన్ని సాయం అందించడంలోనూ ప్రదర్శించాలని కోరుతున్నారు.పెట్టుబడి కోసం అగచాట్లు..గత ఐదేళ్లు పెట్టుబడి సాయం సకాలంలో అందింది. దీంతో అదునులో విత్తనాలు కొనుగోలు చేసేవాళ్లం. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తుందో చెప్పడం లేదు. కేంద్రం నుంచి పీఎం కిసాన్ సాయం అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు విడుదల కాకపోవడంతో పెట్టుబడి కోసం అగచాట్లు తప్పడం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.– కారసాని శివారెడ్డి. సూరేపల్లి, బాపట్ల జిల్లాసాగు ఖర్చుల కోసం ఇబ్బందులు..గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అందజేసిన వైఎస్సార్ రైతు భరోసా సాయం రైతులకు కొండంత అండగా నిలిచేది. ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాలో నేరుగా జమ చేసి భరోసా కల్పించేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వకపోవడంతో సాగు ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.– చింతల రాజు, బురదకోట, ప్రత్తిపాడు రూరల్, కాకినాడ జిల్లాఐదేళ్లు నమ్మకంగా ఇచ్చారు..వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా డబ్బులు పడేవి. ఆ నగదుతో పాటు కొంత డబ్బు కలిపి పంటలు సాగు చేసేవాళ్లం. ఐదేళ్లు నమ్మకంగా రైతు అకౌంట్లో జమ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత వరకు ఆ ఆలోచన చేయలేదు. ఎప్పుడు ఇస్తారో నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రైతులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. – తూళ్లూరి నీరజ, గమళ్లపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లామా గోడు పట్టించుకోండి..గత ఐదేళ్లు రైతు భరోసా సకాలంలో అందడంతో సాగు సాఫీగా సాగేది. ప్రస్తుత పాలకులు మా బాధను పట్టించుకుని రైతులకు ఆర్థిక సాయం త్వరగా అందించాలి. – రాధయ్య, రైతు, పెద్దతయ్యూరు, శ్రీరంగరాజపురం, చిత్తూరు జిల్లా.పాత రోజులు గుర్తుకొస్తున్నాయి..సీజన్ మొదలై నెల గడుస్తున్నా ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం అందలేదు. ప్రధాని మోదీ సాయం అందిచాన అది ఎందుకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సాయం అందక పోవడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పడం లేదు. ఏదో బాధపడి విత్తనాలు కొనుగోలు చేశాం. మిగిలిన పనులకు పెట్టుబడి సహాయం అత్యవసరం. – చింతల వెంకటరమణ, రైతు, లుకలాం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లావారం పది రోజుల్లోనే ఇస్తామని..అధికారంలోకి వచ్చిన వారం పది రోజుల్లోనే రైతు భరోసా అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఖరీఫ్ సీజన్లో రైతులను ఆదుకోవాలి. లేదంటే అప్పులే శరణ్యం.– ప్రభాకర్, రైతు, తిరుపతి రూరల్ మండలంవ్యవసాయం ఇక కష్టమేజగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ నెలలో రైతు భరోసా సాయం ఖాతాలో పడేది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల రైతుల గురించి ఆలోచన చేసే విధంగా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు వ్యవసాయం చేయడం కష్టమే,–ఆకుల నారాయణ రైతు వంగర సాయం చేయాలి...మాలాంటి పేద రైతులకు గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా సాయం ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం వ్యవసాయ పనులు, సేద్యం ప్రారంభమైనా కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడం విచారకరం. రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఆలోచించి సాయం చేయాలి. – వెన్నపూస కృష్ణారెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట, మర్రిపాడు మండలం -
ఖరీఫ్‌లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధంచేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్లో ఆర్బీకేలలో ఎరువులు లేవన్న మాట వినిపించకూడదన్న లక్ష్యంతో రైతులు కోరుకున్న ఎరువులను అందించేలా ఏర్పాట్లుచేస్తోంది. గడిచిన నాలుగేళ్లలో ఆర్బీకేల ద్వారా 31.54 లక్షల మంది రైతులకు రూ.1,311.80 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయగా, రానున్న సీజన్లో కనీసం 10 లక్షల టన్నుల ఎరువుల సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులకు రూ.100 కోట్ల వరకు ఆదాసాగు ఉత్పాదకాల పంపిణీలో ఆర్బీకేలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎరువుల కోసం రైతులు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. అయినా అరకొరగానే అందేవి. ఒక్కోసారి సమయానికి దొరక్క బ్లాక్‌లో కొనాల్సి వచ్చేది. ఎరువుల వంకతో అవసరంలేని పురుగుల మందులను కొనాల్సి రావడం రైతులకు భారంగా మారేది. ప్రస్తుతం సర్టిఫై చేసిన ఎరువులను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచడంతో ఎరువు కోసం రైతులు ఇబ్బందిపడిన దాఖలాలు కన్పించలేదు. లోడింగ్, అన్లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 నుంచి రూ.50 వరకు రైతులకు ఆదా అవుతోంది. ఇలా నాలుగేళ్లలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. ఆర్బీకేలకు ఎరువుల లైసెన్సులు కేంద్రం కేటాయించిన ఎరువులను జిల్లాల వారీగా మార్క్‌ఫెడ్ గోడౌన్లలో నిల్వచేసి అక్కడ నుంచి పీఏసీఎస్, ఆర్బీకేలకు సరఫరా చేయడానికి ఏటా రూ.70 కోట్లకు పైగా ఖర్చవుతోంది. ఈ భారాన్ని గత నాలుగేళ్లుగా ప్రభుత్వమే భరిస్తోంది. వచ్చే ఏడాది నిల్వ సామర్థ్యం పెరగనుండడంతో ఇందుకు కనీసం రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రతీ ఆర్బీకేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో వివిధ శాఖల పరిధిలో 1,864 గోదాములు, సచివాలయ ప్రాంగణాల్లో 3,979 గోదాములు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేలకు అనుబంధంగా 500 టన్నుల సామర్థ్యంతో రూ.493.15 కోట్లతో 1,167 గోదాములు నిరి్మస్తుండగా, వాటిలో 664 గోదాములు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన చోట్ల అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేలకు ఎరువుల విక్రయ లైసెన్సులు జారీచేశారు. ఫలితంగా సమయంతో పాటు రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు చాలావరకు తగ్గే అవకాశాలున్నాయి. ఖరీఫ్–24కు 17.50 లక్షల టన్నులు ఎరువులు..ఇక ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు. ఇందులో ప్రధానంగా 37.79 లక్షల ఎకరాల్లో వరి, 14.48 లక్షల ఎకరాల్లో పత్తి, 13.88 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 5.85 లక్షల ఎకరాల్లో కందులు, 3.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. ఖరీఫ్ కోసం 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. ఇందులో 6.50 లక్షల టన్నుల యూరియా, 2.30 లక్షల టన్నుల డీఏపీ, ఏడు లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్ష టన్నుల ఎస్ఎస్పీ, 70 వేల టన్నుల ఎంఓపీ ఎరువులు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేశారు. మరోపక్క.. ఇఫ్కో ద్వారా 5 లక్షల నానో యూరియా, 2 లక్షల నానో డీఏపీ బాటిల్స్ సరఫరాకు ఏర్పాట్లుచేస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల్లో కనీసం 5.60 లక్షల టన్నులు ఆర్బీకేల ద్వారా సరఫరాకు ప్రణాళిక సిద్ధంచేసారు. -
రైతు భరోసా పెంచిన సీఎం జగన్
-
సీఎం జగన్ గురించి గుంటూరు రైతు.. గొప్ప మాటలు
-
fact check: కుంభకర్ణ నిద్ర మీదే రామోజీ
సాక్షి, అమరావతి: నిత్యం కుట్రపూరిత ఆలోచనలు, విషపూరిత రాతలు.. అక్షరాలకు అందని ఆక్రోశం.. ఇదీ ఈనాడు రామోజీరావు పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదేపదే అబద్ధాలను అచ్చేస్తూ వయోభారానికి తోడు తనకున్న అల్జీమర్స్ వ్యాధి ముదిరి పోయిందని సోమవారం మరోసారి రుజువు చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్‌తో పాటు రబీలో పంటల సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా ఒకే వ్యవసాయ సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు ప్రభుత్వం అందించిన విషయాన్ని తన రాతల్లో మరుగున పరిచారు. 103 కరువు మండలాల పరిధిలో పంటలు నష్టపోయిన రైతులతో పాటు డిసెంబర్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకూ పెట్టుబడి రాయితీని నాలుగు రోజుల క్రితమే విడుదల చేసిన విషయాన్ని మరచిపోయారు. మూడో విడత రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీలు కలిపి ఏకంగా 75.96 లక్షల మందికి రూ.2588.92 కోట్లు లబ్ధి చేకూర్చిన అంశం ఈ కబోదికి కన్పించలేదు. ఆరోపణ: ఖరీఫ్, రబీలో కలిపి 45 లక్షల ఎకరాల్లో బీడు వాస్తవం: ఖరీఫ్, రబీ పంట కాలాల్లో సాధారణ విస్తీర్ణం 140.24 లక్షల ఎకరాలకు గాను 104.94 లక్షల ఎకరాల్లో సాగైంది. బెట్ట పరిస్థితుల వలన 35.30 లక్షల ఎకరాలలో పంటలు వేయలేదు. కానీ ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పండ్లు, ప్లాంటేషన్ తోటలు, కూరగాయలు, వాణిజ్య పూలు, ఇతర ఉద్యాన పంటల విస్తీర్ణం ఖరీఫ్, రబీల్లో 7,87,621 ఎకరాలకు చేరింది. సాధారణం కన్నా కేవలం 27.42 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు తగ్గింది. కానీ ఈనాడుకు మాత్రం ఏకంగా 45 లక్షల ఎకరాల్లో తగ్గినట్టుగా కని్పంచింది. ఆరోపణ: కరువు, తుపానులతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాస్తవం: వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 103 కరువు మండలాలను ప్రకటించారు. ఈ మండలాల్లో 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇందులో ఉద్యాన, వ్యవసాయ పంటలున్నాయి. రబీ సీజన్ ఆరంభంలో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ భారీ వర్షాల వలన 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 20,88,625 ఎకరాలు పంటలు దెబ్బతింటే ఈనాడుకు మాత్రం 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా కని్పంచింది. ఆరోపణ: వెంటాడిన పొడి వాతావరణం వాస్తవం:దేశ వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌తో పాటు రబీలోనూ కొనసాగింది. కానీ పొడి వాతావరణం కని్పంచినంత మాత్రాన కరువు ఉన్నట్టు కాదన్న విషయం రామోజీకి తెలియంది కాదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాల ఆధారంగా తీసుకుంటారు. తొలుత ప్రాథమిక అంచనా, క్షేత్ర స్థాయి పరిశీలన, తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించి పరిహారాన్ని (ఇన్పుట్æసబ్సిడీ) అందిస్తారు. ఆరోపణ: పడిపోయిన 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వాస్తవం: కరువు, మిచాంగ్ ప్రభావం ఉన్నప్పటికీ 2023–24లో ఆహార ధాన్యాల దిగుబడి 154.73 లక్షల టన్నులు నమోదవుతున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్టాటస్టిక్స్ (కేంద్ర గణాంక శాఖ) రెండో ముందస్తు అంచనా వేసింది. ఈ దిగుబడులు గడిచిన ఐదేళ్ల సగటు దిగుబడులతో పోలిస్తే తక్కువేమీ కాదు. వరితో సహా జొన్న, సజ్జ, రాగి, పెసలు, మినుము, ఉలవలు వేరుసెనగ, నువ్వులు, పత్తి పంటల ఎకరా దిగుబడి గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. 2023–24 సీజన్లో 57.87 లక్షల ఎకరాలకు 48.93లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి తగ్గిందంటూ కాకిలెక్కలు అచ్చేశారు. ఆరోపణ: కరువు విజృంభిస్తున్నా ఉపశమన చర్యలేవీ వాస్తవం: ఒకే సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు అందించారు. బెట్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేశారు. 2023లో జూలై– ఆగస్ట్ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు వరి నారుమళ్ళు దెబ్బతిని నష్టపోయిన రైతులు మరలా విత్తుకునేందుకు 1479 క్వింటాళ్ళ స్వల్పకాలిక వరి రకాలు అందించారు. బెట్ట పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో పంటలు దెబ్బతిన్న రైతులకు 30వేల క్వింటాళ్ల ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను రూ.26.02 కోట్ల సబ్సిడీతో 1.14 లక్షల మందికి ఇచ్చారు. 2023 డిసెంబర్లో మిచాంగ్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు 49,758 క్వింటాళ్ల శనగ, వేరుశనగ, మినుములు, పెసర, నువ్వులు, రాగి, తక్కువ పంట కాల వరి రకాలను రూ. 31.06 కోట్ల సబ్సిడీతో 71415 మందికి పంపిణీ చేశారు. మిచాంగ్ తుపాన్ వేళ రంగుమారిన, తడిసిన 6.79లక్షల టన్నుల ధాన్యాన్ని 1.11లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి జీఎల్టీతో సహా రూ.1483.61 కోట్లు జమ చేశారు. ఆరోపణ: కరువు, తుపాన్ వేళ సాయమేది? వాస్తవం: కరువు, మిచాంగ్, అకాల వర్షాల వల్ల అందించిన సాయానికి అదనంగా 2023–24 సీజన్లో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7226.08 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకం ద్వారా రూ.1117.21కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నావడ్డీ పంట రుణాల పథకం ద్వారా రూ.215.98 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.326.14 కోట్ల ఖర్చుతో ఆర్బీకేల ద్వారా రైతులకు అందించారు. ఇవేమీ ఈనాడుకు కని్పంచకపోవడం విడ్డూరంగా ఉంది. ఆరోపణ: సాయంపై సర్కార్ మీనమేషాలు వాస్తవం: ఖరీఫ్ 2023 పంటకాలంలో మే–ఆగస్ట్ మధ్య కురిసిన వర్షాలు, వరదల వల్ల 12,198.62 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి, కూరగాయలు, బొప్పాయి, తమలపాకు, మామిడి తదితర ఉద్యాన పంటల రైతులు 11,373 మందికి పెట్టుబడి రాయితీగా రూ.11 కోట్లు అందించారు. 2023 మార్చి–మే మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కొజొన్న, జొన్న పంటలకు సంబంధించి 1892 మంది రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున రూ.5 కోట్ల ప్రత్యేక పెట్టుబడి రాయితీ ఇచ్చారు. 2023లో కరువు వల్ల నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.23 కోట్లు, మిచాంగ్ తుపాన్ వల్ల నష్టపోయిన 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాలకు ఇటీవలే విడుదల చేశారు. దీనికోసం జీవో ఎంఎస్ నెం.5 జారీ చేశారు. ఈ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు. తమ పేరు లేదని కానీ, ఇన్పుట్ సబ్సిడీ రాలేదని ఒక్కరంటే ఒక్క రైతూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అదే ఈనాడుకు కంటగింపుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువు తాండవించేది. కరువు మండలాలను సీజన్‌కు అనుగుణంగా ప్రకటించిన దాఖలాలు లేవు. 2014 ఖరీఫ్ కరువు మండలాలను 2015 నవంబర్‌లో, 2015వి 2016 నవంబర్‌లో, 2016వి 2017 జూన్‌లోనూ, 2017వి 2018 ఆగష్టులోనూ ప్రకటించారు. 2018 ఖరీఫ్, 2018–19 రబీ సీజన్లలో ఏర్పడిన కరువు మండలాలను అసలు ప్రకటించనే లేదు. తన ఐదేళ్ల పాలనలో 24,79,985 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.2558 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. -
మాటకు మించి సాయం
సాక్షి, అమరావతి: అన్నదాతల కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ప్రతి అడుగూ రైతులు, రైతు కూలీలు బాగుండాలని మనసా వాచా కర్మణా వేస్తూ వచ్చామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ విత్తనం నుంచి పంట విక్రయం వరకూ అన్ని విధాలుగా చేయి పట్టుకుని నడిపించామ న్నారు. ప్రతీ పథకాన్ని పేద రైతు కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చి సంక్షేమ ఫలాలన్నీ అందించామని, రాష్ట్రంలో ఐదేళ్లుగా మాత్రమే ఇలా జరుగుతోందని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నలకు భరోసా కల్పిస్తూ వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రభుత్వం ఇదేనని, భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా వరుసగా ఐదో ఏడాది మూడో విడత కింద ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు 10.79 లక్షల మందికి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.215.98 కోట్లు కలిపి మొత్తం 64.37 లక్షల మంది ఖాతాలకు రూ.1,294.34 కోట్లను బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా జమ చేశారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. హామీ కంటే మిన్నగా.. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తా మని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ కంటే మిన్నగా రూ.12,500 బదులు ఏటా రూ. 13,500 చొప్పున అందచేశాం. రూ.50 వేలకు బ దులు ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ. 67,500 చొప్పున లబ్ధి చేకూర్చాం. హామీకి మించి ప్రతి రైతు కుటుంబానికి రూ.17,500 చొప్పున అదనంగా అందచేశాం. తద్వారా ఏటా మూడు విడ తల్లో రూ.13,500 చొప్పున ఈ ఐదేళ్లలో మొత్తం రూ.67,500 రైతన్నల చేతుల్లో పెట్టినట్లైంది. ఇవాళ జమ చేస్తున్న పెట్టుబడి సాయంతో కలిపి ఐదేళ్లలో 53.58 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.34,288 కోట్లు పంటలు వేసే సమయంలో పెట్టుబడి సాయంగా అందించాం. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీని కూడా వర్తింపజేస్తూ రూ.లక్ష వరకు పంట రుణాలను అందిస్తున్న కార్యక్రమం కూడా మన ప్రభుత్వ హయాంలోనే జరుగుతోంది. పంట రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే బ్యాంకులకు రైతులపై నమ్మకం పెరుగుతుంది. ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి నెలకొంటుంది. దీన్ని ప్రోత్సహిస్తూ రైతన్నలు వడ్డీ సొమ్మును బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్లీ ఆ వడ్డీ రాయితీ డబ్బులను క్రమం తప్పకుండా అన్నదాతలకు తిరిగి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నదీ ఈ ప్రభుత్వ హయాంలోనే. బ్యాంకులకు కట్టిన వడ్డీని తిరిగి వెనక్కి ఇవ్వడం వల్ల రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందుతాయి. ఆ డబ్బులు వారికి వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చుల కింద ఉపయోగపడతాయి. దీన్ని ప్రోత్సహిస్తూ ప్రతి రైతుకు సహాయం చేస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన బకాయిలతో కలిపి 84.67 లక్షల మంది అన్నదాతలకు సున్నా వడ్డీ రాయితీ కింద దాదాపు రూ.2,051 కోట్లు అందించాం. నాణ్యమైన వ్యవసాయ విద్యుత్తు.. 19 లక్షల మంది రైతులకు 9 గంటల పాటు పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇచ్చే కార్యక్రమం ఈ 57 నెలల్లోనే జరుగుతోంది. మనం అధికారంలోకి రాకముందు ఇలా పగటిపూటే రైతన్నలకు ఉచిత కరెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే నాడు ఫీడర్లకు ఆ సామర్థ్యమే లేదు. మన ప్రభు త్వం వచ్చిన తర్వాత రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచాం. పగటి పూట 9 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రతి రైతన్నకు రూ.45 వే ల వర‡కు మేలు చేశాం. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉచిత పంటల బీమా.. దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ స్థాయిలో ఆర్బీకేల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతులు పండించే ప్రతి ఎకరాను ఈ– క్రాప్ చేస్తూ నోటిఫై చేసిన ప్రతి పంట, సాగైన ప్రతి ఎకరా ఇన్సూరెన్స్ కవరేజీలోకి తెచ్చాం. రైతన్నల తరపున ప్రీమియం డబ్బులను పూర్తిగా రాష్ట్రమే కడుతున్న ప్రభుత్వం మనదే. ఈ 57 నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతోంది. మునుపెన్నడూ ఇలా జరగలేదు. ఇంతకుముందు రైతన్నకు బీమా ప్రీమియం ఉందన్న సంగతి కూడా తెలిసేది కాదు. కొందరు రైతులకు మాత్రమే క్రాప్ లోన్ ఇచ్చిన సమయంలో బ్యాంకులు బీమా ప్రీమియం సొమ్ముని కట్ చేసుకుని వర్తింప చేసిన పరిస్థితి ఉండేది. రైతులు బ్యాంకులకు వెళ్లకుంటే రుణాలు రాని పరిస్థితి. తద్వారా వారికి ఇన్సూరెన్స్ గురించి తెలియక చెల్లించలేకపోయేవారు. అలా వారు నష్టపోతున్న పరిస్థితులకు పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్న పంట వేసిన వెంటనే ఆటోమేటిక్‌గా గ్రామ సచివాలయంలో ఈ– క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ కలి్పస్తూ వారి తరపున ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్న పరిస్థితి తొలిసారిగా మన ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. ఆక్వాకు తోడుగా.. పాడికి అండగా గతంలో ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంట్ ఇచ్చి వారిని అదుకున్న పరిస్థితి లేదు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ అందించి వారిని కూడా చేయిపట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటున్న పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చాకే ఏర్పడ్డాయి. ఆక్వా, పాడి రైతుల కోసం కొత్త చట్టాలు తీసుకొచ్చాం. చివరికి పాలసేకరణలో కూడా గతంలో లేనివిధంగా లీటరుకు రూ.10 నుంచి రూ.22 వరకు ఈ 57 నెలల కాలంలోనే సేకరణ ధరలు పెరిగాయి. దీనికి కారణం మనం చేపట్టిన పాలవెల్లువ అనే కార్యక్రమమే. సహకార రంగంలో దేశంలోనే అతి పెద్దదైన అమూల్ లాంటి సంస్ధను రాష్ట్రానికి తీసుకొచ్చాం. తద్వారా స్థానికంగా పోటీని సృష్టించాం. అమూల్ రేట్లు పెంచింది కాబట్టి మిగిలిన వారు కూడా పెంచక తప్పని పరిస్థితిని తీసుకొచ్చాం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. దాదాపు 100 ఏళ్ల క్రితం బ్రిటీషర్ల కాలంలో మన భూముల సర్వే జరిగింది. రికార్డులు అప్డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు, సర్వేలు జరగకపోవడం వల్ల ప్రతి గ్రామంలోనూ భూ వివాదాలు తలెత్తాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ సమగ్ర భూసర్వే చేపట్టాం. రికార్డులన్నీ అప్డేట్ చేసి ఏకంగా రిజి్రస్టేషన్ ప్రక్రియను గ్రామస్ధాయిలో సచివాలయాల పరిధిలోకి తెచ్చిన గొప్ప మార్పు కూడా ఈ 57 నెలల్లోనే సాకారమైంది. దాదాపు 34.72 లక్షల ఎకరాలపై రైతులు, పేదలకు అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తూ ఏకంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే గతానికి, ఈ 57 నెలల కాలానికి మధ్య తేడాను గమనించండి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఆర్బీకే మనతో కనెక్ట్ అయి ఉంది. గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు కాబట్టి వారందరికీ ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. పెట్టుబడికి భరోసా.. చిన్న రైతుకు 80% ఖర్చులు కవర్ రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు భూమి కలిగిన రైతులు 50% మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన వారు 70% ఉన్నారు. సాగు పెట్టుబడి కోసం తీసుకునే రుణాలపై వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి వారిది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటే నడ్డీ విరిగే వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. మన ప్రభుత్వం రైతన్నలకు ఆ అవస్థలను తొలగించి రైతు భరోసాతో ఆదుకుంటోంది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించే సాయంతో అర హెక్టారు లోపు విస్తీర్ణం ఉన్న రైతులకు 80% పెట్టుబడి ఖర్చులు కవర్ అవుతుండగా హెక్టారు లోపు పొలం ఉన్నవారికి 70% ఖర్చులు పథకంతో కవర్ అవుతున్నాయి. నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఈ ఐదేళ్లలో వచ్చిన మరో గొప్ప మార్పు ఏమిటంటే ఎక్కడైనా రైతన్నలకు వరదలు లాంటి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం దాన్ని తన కష్టంగానే భావించింది. ఏ సీజన్లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందించే కార్యక్రమం కూడా మొట్ట మొదటిసారిగా ఈ 57 నెలలుగా జరుగుతోంది. ఇదో విప్లవాత్మకమైన మార్పు. నష్టపోయిన రైతులు మళ్లీ సీజన్లో పంటలు వేసుకునే పరిస్థితుల్లోకి రావాలి. అలా జరగాలంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఆయా సీజన్ ముగిసేలోగా చేతికిస్తేనే పెట్టుబడి కోసం వారికి ఉపయోగపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలిచిన ప్రభుత్వం మనది. ఇలాంటి ఆలోచనలు మనం ప్రభుత్వంలోనే జరిగాయి. పంటలకు ‘మద్దతు’.. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పి పంటలను కొనుగోలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు సైతం మనం కనీస మద్దతు ధర ప్రకటించాం. మార్కెట్లో మద్దతు ధర తగ్గినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతున్నది కూడా మన ప్రభుత్వంలోనే. మాఫీ పేరుతో బాబు మోసాలు.. 2014 ఎన్నికల్లో రూ.87,612 కోట్ల రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఎలా మోసగించారో గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలని పబ్లిసిటీ చేసి ఆ తరువాత వంచనకు పాల్పడ్డారు. చివరికి ఆ రూ.87,612 కోట్లపై సున్నావడ్డీని కూడా ఎగ్గొట్టాడు. ఐదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్లు ఆ వడ్డీలకే అవుతుంది. ఆయన ఎగ్గొట్టిన సున్నా వడ్డీ బకాయిలను కూడా మనమే ఇచ్చాం. ఐదేళ్లలో ఒక్క వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారానే రైతుల చేతుల్లో రూ.34,288 వేల కోట్లు పెట్టాం. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.65 కోట్లు వెచ్చించాం. ఇలా పథకాల ద్వారా రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయం కోసం ఐదేళ్లలో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది. ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికంగా పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ మనసు, పాలన బాగున్నాయి కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి ఆచరిస్తున్న సీఎం జగన్ దేశం గర్వించేలా పలు సంస్కరణలు తెచ్చారు. నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ, కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో పుట్టి (850 కేజీలు) రూ.18,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ. 12 వేల నుంచి రూ.13 వేలకు పడిపోయింది. కానీ ఇవాళ పుట్టి రూ.23,500 నుంచి రూ.24 వేలు పలుకుతోంది. ఇది ఎమ్మెస్పీ కంటే 30 శాతం అధికం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి పంట మాది.. బీమా మీది నాకు 3.38 ఎకరాలున్నా గతంలో బీడుగా ఉండేది. గత నాలుగేళ్లుగా పంటలు పండిస్తున్నాం. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.67,500 ఇచ్చారు. మేం పంట వేస్తే మీరు బీమా చెల్లిస్తున్నారు. సున్నా వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు వ్యవ సాయ పనిముట్లు అందజేసి ఆదుకున్నారు. వ్యవసాయ సలహా మండళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. గతంలో విత్తనాల కోసం మండల కేంద్రాల్లో పడి గాపులు కాశాం. ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఆర్బీకేల ద్వారా మా ఇంటికే పంపిస్తున్నారు. గతంలో పాలు కర్ణాటకలో విక్రయించగా ఇప్పుడు మా గ్రామంలోనే అమూల్ కేంద్రంలో మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. మీద్వారా మా కుటుంబం రూ.3,42,152 మేర లబ్ధి పొందింది. మీరు మళ్లీ సీఎం కావాలి. –ఎన్. బాబు, రైతు, అనంతపురం జిల్లా రైతుల కోరిక.. మళ్లీ మీరే నాలుగెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నా. గతంలో ధర్నాలు చేస్తే కానీ విత్తనాలు దొరికేవి కాదు. నేడు ఆర్బీకేల ద్వారా అన్నీ గ్రామంలోనే అందిస్తున్నారు. ఈ–క్రాప్ ద్వారా పంట రుణాలు, వడ్డీ రాయితీ అందిస్తున్నారు. గతంలో కరువుతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేదు. పైసా భారం పడకుండా ఉచితంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా ఈ–క్రాప్ విధానాన్ని చూడలేదు. మన దగ్గర చక్కగా అమలవుతోంది. నేను మూడెకరాల్లో 78 బస్తాల ధాన్యాన్ని పండిస్తే రూ.1,56,000 నేరుగా నా ఖాతాలో జమ చేశారు. పిల్లలకు విద్యాదీవెన అందింది. నా భార్యకు అనారోగ్యం వస్తే వైజాగ్ అపోలో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం రూ.1,48,000 చెల్లించింది. పైగా కోలుకోవడానికి ఆసరాతో రూ.4,750 జమ చేశారు. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నాము. –వై.శ్రీనివాసరావు, రైతు, గజపతినగరం, విజయనగరం జిల్లా వ్యవసాయం సుసంపన్నం పుస్తకావిష్కరణ ఐదేళ్లలో రాష్ట్ర వ్యవసాయ రంగం పురోగతిపై ‘వ్యవసాయం సుసంపన్నం–రాష్ట్రానికి సౌభాగ్యం’ పేరిట వ్యవసాయ శాఖ రూపొందించిన పుస్తకాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాదారులు ఐ.తిరుపాల్‌రెడ్డి, పి.శివప్రసాద్‌రెడ్డి, సీఎస్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు
-
చెప్పిన దానికన్నా ఎక్కువ సాయం జగన్ చరిత్రలో నిలిచిపోతాడు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
-
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నాం. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం. 57 నెల్లలో రైతు భరోసా కింద అందించిన మొత్తం రూ.34,288 కోట్లు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతన్నకు అదనంగా రూ.17,500 ఇస్తున్నాం. రైతు ప్రభుత్వం మనది.. మన ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలని వేశాం. క్రమం తప్పకుండా వైయస్సార్ రైతు భరోసా కింద సహాయాన్ని అందించాం. పెట్టుబడి సహాయంగా, రైతన్నకు దన్నుగా ఇది అందించాం. రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతులన్నకున్న భూమి అర హెక్టారు లోపలే. హెక్టారు లోపల ఉన్న రైతులు 70 శాతం ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయం వారికి ఎంతో మేలు చేసింది. వంద శాతం రైతులకు 80శాతం ఖర్చు రైతు భరోసా కింద కవర్ అయ్యింది. పేద రైతుల పక్షపాత ప్రభుత్వం మనది, దీనికి నేను గర్వపడుతున్నాను. సున్నా వడ్డీ కింద కూడా రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా కట్టే రైతులకు మేలు చేస్తున్నాం.ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకూ అందించిన వడ్డీ రాయితీ 2,050 కోట్లు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ కింద రైతులకు ఇవాళ విడుదలచేస్తున్న మొత్తం రూ.1,294.38 కోట్లు అందించాం. ప్రతీ అడుగులోనూ రైతన్నలకు తోడుగా నిలుస్తున్నాం. ప్రతీ పథకం దాదాపుగా పేద రైతు కుటుంబానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఏడాదికి రూ.12500 బదులు వేయి పెంచి రూ.13500 ఇచ్చాం. 50వేల స్థానంలో ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చాం. చెప్పినదానికంటే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం మనది. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదేళ్లలో ముందుకు సాగాము. ప్రతీ సందర్భంలోనూ వారికి తోడుగా నిలిచాం. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్.. 19 లక్షల మంది రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ కింద ప్రతి రైతుకు రూ.45వేల మేర మేలు జరుగుతుంది. ఏడాదికి దాదాపుగా రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం కడుతున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం మనది. గతంలో ఎప్పుడూ కూడా రైతుల తరఫున ఎప్పుడూ బీమా ప్రీమియం చెల్లించలేదు. దేశంలో కూడా ఎక్కడా లేదు. రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. కేవలం ఈ ఐదేళ్లలో మాత్రమే ఇలా జరిగింది. ఇదొక విప్లవాత్మక మార్పు. నష్టం నుంచి రైతు తట్టుకుని నిలబడి తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యగా దీన్ని అమలు చేసింది. ఆక్వా రైతులకు సాయం.. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను పెట్టాం. అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను రైతుకోసం పెట్టాం. రైతులకు ఇ-క్రాప్ చేస్తూ అన్నిరకాలుగా ఆదుకుంటున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయిపట్టుకుని నడిపించాం. ఈ ఐదేళ్లకాలంలో మాత్రమే ఇలా జరిగింది. ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంటు ఇస్తూ ఆదుకున్నాం. ఆక్వాజోన్లలో ఉన్న ఆక్వారైతులకు తోడుగా నిలిచాం. పాల సేకరణలో కూడా రైతులకు తోడుగా నిలిచాం. రూ.10-20ల వరకూ రైతులకు అధిక ధరలు వచ్చాయి. పాలసేకరణలో ఈ ఐదేళ్ల కాలంలోనే రైతులకు రేట్లు పెరిగాయి. సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్‌ను తీసుకు వచ్చి ఈ రంగంలో పోటీని పెంచాం. తద్వారా రైతులకు మేలు జరిగింది. భూ సర్వే.. 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగింది. అప్పటినుంచి రికార్డులు అప్డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు జరక్కపోవడం జరిగింది. వివాదాలకు చెక్‌పడుతూ సమగ్ర సర్వే చేపట్టాం. రికార్డులను అప్డేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవలను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులకు, పేదలకు కల్పించాం. గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని కోరుతున్నాను. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీచేస్తామని చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. దీంతో రైతులు నమ్మి అధికారం ఇస్తే.. దారుణంగా మోసం చేశారు. బేషరుతుగా రుణాలు మాఫీచేస్తానని చెప్పి చివరకు రుణమాఫీ పత్రాలు ఇచ్చి మోసం చేశారు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగొట్టారు. చివరకు మన ప్రభుత్వమే చెల్లించింది. బాబు హయాంలో రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్రవడ్డీలే ఏడాదికి దాదాపు రూ.5-6 వేల కోట్లు. అంత దారుణంగా చంద్రబాబు గతంలో మోసం చేశారు. మనం ఈ ఐదేళ్లలో వైయస్సార్ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు ఇచ్చాం. ధాన్యం కొనుగోలుకోసం రూ.65 కోట్లు ఖర్చు చేశాం. ఇదికాక రూ.1.2 లక్షల కోట్లు రైతున్నలకు వివిధ పథకాలు ద్వారా అందించాం అని అన్నారు. -
నేడు మూడో విడత రైతు భరోసా జమ
సాక్షి, అమరావతి: వరుసగా ఐదో ఏడాది.. వైఎస్సార్ రైతు భరోసా కింద మూడో విడత పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతోపాటు రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధి ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాలకు రూ.1,078.36 కోట్లను బుధవారం జమ చేయనుంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ (అటవీ), దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా ‘వైఎస్సార్ రైతు భరోసా‘ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచింది. ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీకి మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున రూ.67,500 జమ చేసింది. బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి రూ.34,288 కోట్లు జమ చేసినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని రాష్ట ప్రభుత్వం చెల్లిస్తోంది. రబీ 2021–22, ఖరీఫ్–2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ.215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును బుధవారం జమ చేయనున్నారు. 2014–15 నుంచి 2018–19 వరకు పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా బుధవారం అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి.. 57 నెలల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.66 లక్షల మంది రైతులకు అందించిన వడ్డీ రాయితీ మొత్తం రూ.2,050.53 కోట్లు అవుతోంది. తాజాగా జమ చేస్తున్న సాయంతో కలిపి 57 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,84,567 కోట్ల సాయం అందించింది. -
28న వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కింద 2023–24 సీజన్ మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు రబీ–2021–22, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ముల పంపిణీకి రంగం సిద్ధమైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు. మూడో విడత రైతు భరోసా కింద 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్లు సాయమందిస్తారు. రబీ 2021–22, ఖరీఫ్–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము అందిస్తారు. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేయనున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.67,500 ఎన్నికలకు ముందు ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల సాయం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకంటే మిన్నగా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీకంటే రూ.17,500 ఎక్కువగా ప్రతి రైతుకూ సాయం అందించి సీఎం జగన్ రైతన్నల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. భూ విస్తీర్ణంతో ముడిపెట్టకుండా చివరికి 5 సెంట్ల భూమి ఉన్న రైతుకు సైతం రూ.13,500 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022– 23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్లు చొప్పున పెట్టుబడి సాయం అందించారు. 2023–24లో గరిష్టంగా 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి 2023–24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమచేయనున్నారు. లబ్ధిదారుల్లో 51,00,063 మంది భూ యజమానులు కాగా, భూమి లేని ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ సాగుదారులు 1,64,705 మంది, దేవదాయ, అటవీ భూమి సాగుదారులు 93,600 మంది ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో 95,642 మంది పెరగ్గా, రెండో విడతతో పోల్చుకుంటే మూడో విడతలో మరో 5,463 మంది పెరిగారు. మూడో విడత సాయంతో కలిపి ఈ ఏడాది 53.58 లక్షల మందికి రూ.7,226.08 కోట్ల పెట్టుబడి సాయం అందించగా, ఈ ఐదేళ్లలో సగటున 51.13 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించినట్టవుతుంది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ రాయితీ వడ్డీ భారం తగ్గించడంతో పాటు రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా 2019 ఖరీఫ్ సీజన్ నుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సీజన్లో రూ.లక్ష లోపు తీసుకున్న రుణాన్ని ఏడాది లోపు చెల్లించిన వారిలో ఈ క్రాప్ ప్రామాణికంగా అర్హులైన రైతుల పొదుపు ఖాతాలకు సీజన్ చివర్లో సున్నా వడ్డీ రాయితీని ఈ ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 73.88 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో చంద్రబాబు ఆయన పాలించిన ఐదేళ్లలో 39.07 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్లు కూడా ఉన్నాయి. తాజాగా రబీ –2021–22 సీజన్లో అర్హత పొందిన 4.48 లక్షల మంది రైతులకు రూ.84.30 కోట్లు, ఖరీఫ్–2022 సీజన్లో అర్హత పొందిన 6.31లక్షల మందికి రూ.131.68 కోట్లు వెరసి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేశారు. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 40.61 లక్షలమందికి రూ.685.46 కోట్ల వడ్డీ రాయితీని మాత్రమే చెల్లించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రైతుల సంఖ్య రెట్టింపు కాగా, వడ్డీ రాయితీ సొమ్ము మూడు రెట్లు ఎక్కువగా అందించినట్టయింది. ఇచ్చిన మాట కంటే ఎక్కువగా ఇస్తున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీకంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా నిలిచారు. ఇప్పటికే రూ.65,500 చొప్పున సాయం అందించగా, మిగిలిన సాయం ఈ నెల 28న జమ చేస్తున్నాం. తాజా సాయంతో కలిపి ఈ 5 ఏళ్లలో 34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్టయ్యింది. రైతు రుణ మాఫీ, అన్నదాత సుఖీభవ పథకాల కింద చంద్రబాబు రైతులకు ఇచ్చిన సాయంకంటే రెట్టింపు సాయం ఒక్క రైతు భరోసా పథకం కిందే ఇచ్చాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
డిజిటల్లో దుమ్ము దులిపేస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా ఛానల్’ దుమ్ము దులిపేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ చానల్ నిరంతరాయంగా వీక్షకుల మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలిస్తూ, వ్యవసాయం అనుబంధ రంగాలకు సూచనలు అందించి తోడ్పాటు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. ఫలితంగా తక్కువ కాలంలోనే రైతులు ఆర్బీకే ఛానల్‌పై అధిక సంతృప్తి కనపరుస్తున్నారు. సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ నెలకొల్పి అన్నదాతకు ఆసరాగా నిలబడుతుండడంతో ఏపీ ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఏపీ వ్యవసాయ రంగంలో కాలానికి తగినట్లుగా విప్లవాత్మక మార్పులు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా ఛానల్ అనతి కాలంలోనే అన్నదాతలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారి మన్ననలు చూరగొంటోంది. ప్రారంభించి మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే 2.75లక్షల సబ్ స్క్రిప్షన్, 55 లక్షల వ్యూయర్ షిప్‌తో దూసుకుపోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ‘ఆర్బీకే’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యూ ట్యూబ్ ఛానల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తుండగా.. పలు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నీతి ఆయోగ్, ఐసీఎఆర్, ఆర్బీఐ వంటి జాతీయ సంస్థలకే కాదు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్ఏఒతోపాటు వివిధ దేశాల ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఛానల్‌ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగులో వస్తున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా రైతులకు చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేసింది. రైతుల అభ్యుదయ గాథలు, ఆదర్శ రైతుల అనుభవాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ప్రసారం చేస్తున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు రైతులందరికీ తెలిసేలా రైతు గ్రూపులతో ఛానల్ ద్వారా ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిసున్నారు. ఏ రోజు ఏ శాఖకు చెందిన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయో? ఆర్బీకేల ద్వారా ప్రసారం చేసున్నారు. ఛానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూ ట్యూబ్‌లో అప్లోడ్ అవుతుండడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ద్వారా రైతులు వీక్షిస్తున్నారు. 1,628 వీడియోలు.. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలు ఆర్బీకే ఛానల్ కోసం ప్రత్యేకంగా గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో మూడేళ్ల క్రితం డిజిటల్ స్టూడియోను ఏర్పాటు చేసింది. డిజిటల్ రంగంలో విశేష అనుభవం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. క్షేత్ర స్థాయిలో ఆదర్శ, అభ్యుదయ రైతులు సాధిస్తోన్న విజయాలపై ఇంటరŠూయ్వలు, డాక్యుమెంటరీలు రూప కల్పన కోసం ప్రత్యేకంగా అవుట్ డోర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసారు. శాఖల వారీగా అప్లోడ్ చేస్తున్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 599 వ్యవసాయ, 589 ఉద్యాన, 257 పశు సంవర్ధక, 97 మత్స్య, 13 పట్టు శాఖలకు చెందిన వీడియోలతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 73 వీడియోలు కలిపి ఇప్పటి వరకు 1,628 వీడియోలను అప్లోడ్ చేశారు. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలను చేసారు. ఛానల్‌ను 2.75లక్షల మంది సబ్ స్క్రిప్షన్ చేసుకోగా, జనవరి 4వ తేదీ నాటికి అప్లోడ్ చేసిన వీడియోలు, ప్రసారాలను 54,67,079 మంది వీక్షించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ లభించడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా ఎంతో మేలు ‘ఆర్బీకే చానల్’ చాలా బాగుంది. ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేసే వీడియోలను రెగ్యులర్‌గా వీక్షిస్తుంటాను. సీజన్లో విత్తనాలు, ఎరువులు ఏ మేరకు నిల్వ ఉన్నాయి. ఎలా బుక్ చేసుకోవాలి. సాగులో సందేహాలనే కాకుండా.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు. ఈ తరహా ప్రయోగం ప్రభుత్వ పరంగా చేపట్టడం నిజంగా ప్రశంసనీయం. –నందం రఘువీర్, మొక్కల జన్యు రక్షక్షుకుని అవార్డు గ్రహీత, పెనమూలురు, కృష్ణ జిల్లా రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ రైతు ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్‌కు వ్యూయర్షిప్ అరకోటి దాటడం నిజంగా గొప్ప విషయం. సాగులో సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తోన్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఛానల్ ద్వారా రైతులకు చేరువ చేస్తున్నాం. రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ చేసుకుంటున్నారు. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
Fact Check: మీ అబద్ధాలకే లేదు హద్దు
విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడమే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్పష్టమైన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). దేశానికే ఇవి ఆదర్శంగా నిలుస్తూ రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి.. ఎలాగైనా రైతులకు వీటి సేవలను దూరం చేయాలన్న దుర్మార్గపు పన్నాగంతో నిత్యం వీటిపై బురద జల్లడమే పనిగా ఈనాడు రామోజీరావు పెట్టుకున్నారు. ఏ పల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని చూసి రామోజీకి అస్సలు నిద్ర పట్టడంలేదు. ఇలాగైతే తన ఆత్మబంధువు చంద్రబాబుకు అధికారం దక్కడం అసాధ్యం అని భావించే నిత్యం ఏదో ఒక అంశంపై విషం చిమ్ముతున్నారు. అందులో భాగమే తాజాగా ‘ప్రచారానికి లేదు హద్దు.. వసతులు అడగొద్దు’.. అంటూ ఆర్బీకేలపై తన అక్కసును చాటుకుని తన అబద్ధాలకు ఎలాంటి హద్దులేదని అక్షరం అక్షరంలో చెప్పుకున్నారు. ఈ కథనంలో వాస్తవాలేమిటంటే.. –సాక్షి, అమరావతి ఆరోపణ : రైతులను గాలికొదిలేశారు.. వాస్తవం : గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన 10,778 ఆర్బీకేల ద్వారా 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 బహుళార్ధ వ్యవసాయ విస్తరణ అధికారులు సేవలందిస్తున్నారు. వీటికి గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. గతంలో ఏది కావాలన్నా మండల కేంద్రాలకు పరుగులు తీసేవారు. పగలనకా, రేయనకా నిద్రహారాలు మాని రోజుల తరబడి పడిగాపులు పడేవారు. కానీ, ప్రస్తుతం చూద్దామన్నా ఎక్కడా క్యూలైన్ అనేది కన్పించడంలేదు. వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీరైతుకు అవసరమైన మేరకు సర్టిఫైడ్ చేసిన సాగు ఉత్పాదకాల పంపిణీతో పాటు ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలుతో పాటు ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పరిశోధనా ఫలాలను నేరుగా రైతు క్షేత్రాలకు చేరవేస్తూ రైతుల్లో సామర్థ్యం పెంపుదలకు శిక్షణనిస్తున్నారు. ఆరోపణ : ఆర్బీకేల్లో సౌకర్యాలేవి? వాస్తవం : 526 గ్రామాల్లో ఆర్బీకేలకు సొంత భవనాలుండగా, మిగిలిన 10,252 గ్రామాల్లో ఆర్బీకేలకు రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. తొలుత ఒక్కో భవన నిర్మాణానికి రూ.21.80 లక్షలు అంచనా వేయగా, అదనపు సదుపాయాల కోసం దీనిని రూ.23.94 లక్షలకు పెంచింది. ప్లాన్ ప్రకారం ప్రతీ ఆర్బీకే భవనం వద్ద మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. టాయిలెట్స్ నిర్మాణ పనులు జాప్యం జరిగిన చోట, సిబ్బందికి ఇబ్బందిలేకుండా ఉండేందుకు సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్బీకే భవనాల సముదాయంలో నిర్మించిన టాయిలెట్‌ను ఆర్బీకే సిబ్బంది వినియోగించేలా ఏర్పాటుచేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 4,239 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 4,935 భవనాలు వివిధ దశల్లో ఉండగా, భూ వివాదాలు, స్థలాల కొరత, కోర్టు కేసులు వంటి వివిధ కారణాలతో 1,078 భవనాల నిర్మాణం ప్రారంభించలేదు. ఇప్పటివరకు భవనాల నిర్మాణం కోసం రూ.1,014.82 కోట్లు ఖర్చుచేయగా, మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.357 కోట్లు ఖర్చుచేశారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటుచేశారు. ఆరోపణ : ఎరువుల లారీ వస్తే సిబ్బందికి ఇబ్బందే.. వాస్తవం : ఆర్బీకేలకు ఎరువుల సరఫరాను పగటిపూట మాత్రమే చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో లారీల రవాణా ఆలస్యమైతే మరుసటి రోజు ఉదయం అన్లోడ్ అయ్యేలా ఏర్పాట్లుచేసుకోవాలని లారీ డ్రైవర్లకు మార్క్‌ఫెడ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇక ఆర్బీకేల ద్వారా ఎరువు అమ్మకాలను ప్రోత్సహించేందుకు 2020–21లో మాత్రమే నగదు ప్రోత్సహకాలు ప్రకటించారు. ఆ మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా చెల్లింపులు చేసేందుకు మార్కెఫెడ్ చర్యలు తీసుకుంది. 2023–24లో జిల్లాకు 8 వేల నుండి 10 వేల వరకు భూసార పరీక్షల నిమిత్తం 26 జిల్లాలకు మట్టి నమూనాల సేకరణ కోసం రూ.54.50 లక్షలు విడుదల చేశారు. ఆరోపణ : నిర్వహణకు నిధులే లేవు? వాస్తవం : 3,830 ఆర్బీకేల అద్దె చెల్లింపు కోసం రూ.43 కోట్లు ఖర్చుచేయగా, 2023–24 ఆర్ధిక సంవత్సరం చివరి వరకు అద్దెల నిమిత్తం మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు నేరుగా భవన యజమానుల ఖాతాలకు జమచేశారు. మిగిలిన రూ.10 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. అలాగే, ఈ ఏడాది మార్చి వరకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. 2023–24 ఆర్థిక సంవత్సరం నుండి విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. స్టేషనరీ కోసం ఇప్పటికే రూ.3 కోట్లు విడుదల చేశారు. అలాగే, ఇందుకోసం ఖర్చుచేసిన ఆర్బీకే సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు విడుదల చేశారు. స్థానికంగా హైస్పీడ్ నెట్వర్క్ ఏది అందుబాటులో ఉంటే ఆ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆర్బీకేల్లో సమకూర్చారు. ఇందుకోసం ఇప్పటికే రూ.23 కోట్లు విడుదల చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, రైతుసేవలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సొంత మొబైల్ డాటాని ఉపయోగించిన సిబ్బందిపై పైసా కూడా భారం పడకుండా ఏర్పాటుచేశారు. ఆరోపణ : రైతుభరోసా పత్రికల పేరిట అదనపు బాదుడు.. వాస్తవం : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు రైతులకు చేరవేసే సంకల్పంతో తీసుకొచ్చిన వైఎస్సార్ రైతుభరోసా మాస పత్రిక అనతి కాలంలోనే రైతుల ఆదరణ పొందింది. 14,300 ప్రతులను వ్యవసాయ శాఖ సొంత నిధులతో ముద్రించి ఆర్బీకేలకు సరఫరా చేస్తోంది. రూ.300 చొప్పున వార్షిక చందా చెల్లించగలిగే రైతులకు నేరుగా వారి ఇంటికి పంపిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేరే కార్యక్రమం చేపట్టారు. ఈ విషయంలో ఎవరిపైనా ఎలాంటి ఒత్తిడి లేదు. ఆర్బీకేల ద్వారా అందించిన సేవలిలా.. అదును దాటక ముందే.. కాదు కాదు.. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతుల ముంగిట్లో వాటిని అందిస్తున్నారు. ♦ ఇలా ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 34.09 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను రూ.1,027.66 కోట్ల రాయితీతో 58 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13 కోట్ల విలువైన 1,661 క్వింటాళ్ల పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్ తదితర సర్టిఫైడ్ విత్తనాలను 30వేల మంది రైతులకు సరఫరా చేశారు. ♦ఆర్బీకేల ద్వారా ఈ మూడున్నరేళ్లలో రూ.1,312 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులను 31.54 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. అలాగే, 1.51 లక్షల మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేశారు. ♦ వీటితో పాటు.. ఆక్వా రైతులకు సర్టిఫై చేసిన ఫీడ్, సీడ్, పాడి రైతులకు సంపూర్ణ మిశ్రమ దాణా, పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. టమరోవైపు.. ఆర్బీకేల ద్వారా వైఎస్సార్ రైతుభరోసా కింద 53.53 లక్షల మంది రైతులకు రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 పంటల బీమా పరిహారం, 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్ల పెట్టుబడి రాయితీ (పంట నష్టపరిహారం), 73.88 లక్షల మంది రైతులకు రూ.1,442.66 కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించగా.. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన 10,936 వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల కోసం రూ.366.25 కోట్ల సబ్సిడీని అందించారు. .. ఇలా నిర్విరామంగా రైతుల సేవలో నిమగ్నమైన ఆర్బీకేలకు అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు వరించాయి. అలాగే, సకల సౌకర్యాలతో అన్ని విధాలుగా రైతులకు భరోసా కల్పిస్తున్న వీటిపై ఈనాడు అదే పనిగా నిత్యం విషం కక్కడం వెనుక ఉన్న లక్ష్యాలు అందరికీ తెలిసిందే. -
Fact Check: కౌలు రైతన్నలపై రామోజీ కుళ్లు
సాక్షి, అమరావతి: బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉండే కౌలు రైతులకు మంచి చేస్తుంటే ఈనాడు రామోజీ కుళ్లుతో కుతకుతలాడిపోతున్నారు! వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఈ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ రోత రాతలకు తెగబడ్డారు. భూ యజమానులతోపాటు వాస్తవ సాగుదారులకూ సంక్షేమ ఫలాలను అందిస్తూ మేలు చేస్తున్న ప్రభుత్వం మరెక్కడైనా ఆయనకు కనిపించిందా? గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం 2019ని తేవడమే కాకుండా సీసీఆర్సీల ఆధారంగా అన్ని ప్రయోజనాలను సీఎం జగన్ అందిస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నుంచి పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు దురదృష్టవశాత్తూ ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలకు వారు కౌలు రైతులైనా సరే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారు. కౌలు రైతులకు ఈ క్రాప్ ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులతోపాటు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమాతో లబ్ధి చేకూరుస్తున్నారు. తుపాన్‌తో నష్టపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ అలా కొనుగోలు చేయలేదు. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) జారీ చేస్తోంది. ఏటా ఖరీఫ్‌కు ముందు ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25,86,178 మంది కౌలు రైతులకు సీసీఆర్సీలు జారీ చేశారు. అత్యధికంగా ఈ ఏడాది 8,25,054 మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీలు లేని కౌలు రైతులను గుర్తించి జాయింట్ లయబిలిటీ గ్రూపులు (జేఎల్‌జీ) నెలకొల్పి రుణాలు అందిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 14.39 లక్షల మంది కౌలుదారులకు రూ.8,246 కోట్ల రుణాలు అందాయి. కౌలు రైతుకూ సంక్షేమ ఫలాలు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కౌలు రైతులకు రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందచేస్తోంది. కేంద్రం ఇవ్వకున్నా వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా ప్రభుత్వం అందిస్తోంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా 9.52 లక్షల మందికి రూ.1,235.03 కోట్ల మేర వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందచేశారు. రూ.లక్ష లోపు పంట రుణాలు పొందిన కౌలుదారులకు ఈ – క్రాప్ ఆధారంగా వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందేలా చర్యలు చేపట్టారు. ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. 3.55 లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి రూ.253.56 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీ చేశారు. దురదృష్టవశాత్తూ ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు భూ యజమానులతో సమానంగా రూ.7 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు రూ.90.72 కోట్లు పరిహారం అందించగా కౌలు రైతులకు రూ.34.65 కోట్లు సాయం అందింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్లు పరిహారం కింద ఈ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా తుపాన్‌తో నష్టపోయిన కౌలు రైతులు, అటవీ భూ సాగుదారులకు సైతం పంట నష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. 4.42 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు గుర్తించి రూ.703 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది. భూ యజమానులతో పాటు సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులకు కూడా 80 శాతం రాయితీతో 86 వేల క్వింటాళ్ల విత్తనాలను తిరిగి విత్తుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. -
పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులకు డిసెంబర్ 27న హాల్‌టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. వేతనం రూ.22,460 ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. అభ్యర్థులు 18–42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి, విద్యార్హతలు, ఇతర వివరాలు ahd.aptonline.in, https://apaha- recruitment.aptonline.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తులు కూడా ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నిర్ధేశిత రుసుములను డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించాలి. దరఖాస్తులను డిసెంబర్ 11వ తేదీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు విడతల్లో 4,643 పోస్టుల భర్తీ సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏలను నియమించారు. రేషనలైజేషన్ ద్వారా గ్రామ పరిధిలో 2–3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్‌గా వీఏహెచ్‌ఏలను నియమించి, అదనంగా ఉన్న వీఏహెచ్‌ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు జిల్లా పోస్టుల సంఖ్య అనంతపురం 473 చిత్తూరు 100 కర్నూలు 252 వైఎస్సార్ 210 నెల్లూరు 143 ప్రకాశం 177 గుంటూరు 229 కృష్ణా 120 పశ్చిమ గోదావరి 102 తూర్పు గోదావరి 15 విశాఖపట్నం 28 విజయనగరం 13 శ్రీకాకుళం 34 -
సున్నావడ్డీ సూపర్
-
బడుగు బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మార్చిన వైనం
-
మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
-
నా నిరుపేద వర్గాలకు మంచి జరగాలనే అడుగులు వేశాం: సీఎం జగన్
-
అన్నదాతలకు అండగా నిలిచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి. వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అన్నదాతలను ఆదుకున్నాం
రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చదువుకొనే పిల్లలు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వారి గుండెల్లో ఎంతగా స్థానం ఇస్తారని చెప్పడానికి ఒక వైఎస్సార్, ఒక వైఎస్ జగన్‌ను చూస్తే అర్థం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న సామాజిక సాధికార యాత్రలను చూస్తే తెలుస్తుంది. ఆయా వర్గాల వారి నాయకత్వంలో జరుగుతున్న ఈ యాత్రలకు, మీటింగ్‌లకు తండోపతండాలుగా కదిలి వస్తున్న జనాలను చూస్తుంటే వారి గుండెల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానం, మీ బిడ్డ జగన్ స్థానం ఏమిటో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ రైతన్నలకు, పేద వాడికి, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలని.. వారి కుటుంబాలు బాగుండాలని, పిల్లలు బాగుండాలి, గొప్పగా చదవాలని, ఎదగాలని ఎంతో తపిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం. ఇలాంటి మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మధ్య ఎంత తేడా ఉందనేది ప్రతి రైతన్న ఆలోచించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రంలో నాలుగేళ్లు కరువనేది లేకపోయినా రైతులకు చేయాల్సిన సాయం చేశాం. రైతును చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వమిది. గతంలో ఏ ప్రభుత్వమూ ఆలోచించని విధంగా ఆలోచించి అన్నదాతలకు మేలు చేశాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పైచిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు రూ.13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం మనదే. మీ అందరి ఆశీస్సులు, పుట్టపర్తి స్వర్గీయ బాబా దీవెనలు మెండుగా ఉన్నాయి. అందుకే రైతుల గుండెల్లో నిలిచాం. ఈ రోజు వరుసగా ఐదో ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 53.53 లక్షల మంది రైతులకు, వారితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ రైతులకు లబ్ధి జరుగుతోందన్నారు. దాదాపు రూ.2,200 కోట్లలో రేపటికల్లా మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. తర్వాత పీఎం కిసాన్ కింద రావాల్సిన రూ.1,000 కోట్లు వాళ్లు ఇచ్చిన వెంటనే ప్రతి రైతన్న ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇక్కడికి రాక ముందు కూడా తాను వాళ్లతో మాట్లాడానని, మీ డబ్బులు కూడా క్రోడీకరించాలని కోరానని.. ఈ నెలలో కచ్చితంగా ఇస్తామని చెప్పారని తెలిపారు. ఈ 53 నెలల్లో 53 లక్షల మంది పైచిలుకు రైతన్నలకు మన ప్రభుత్వం రూ.61,500 చొప్పున ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ఈ విడత ఇచ్చే రూ.4,000 కలుపుకుంటే రూ.65,500 లబ్ధి కలిగినట్లవుతుందని చెప్పారు. ఈ ఒక్క పథకం ద్వారానే రైతులకు నేరుగా రూ.33,209.81 కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. రైతులకు ఇలా మేలు చేయాలనే ఆలోచన 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇదివరకెన్నడూ లేని విధంగా రైతులకు లబ్ధి ► విత్తనం వేసినప్పటి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ క్రాప్ ద్వారా ప్రతి ఎకరా నమోదు చేస్తున్నాం. పంట పండించే ప్రతి రైతన్నకూ పారదర్శకంగా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ మంచి చేస్తున్నాం. ► పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నది మన ప్రభుత్వం మాత్రమే. గతంలో పగలూ రాత్రి రెండు సమయాల్లో కలిపినా కనీసం 7 గంటలు కూడా ఇవ్వలేకపోయారు. వ్యవసాయ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. పంటల బీమా కోసం రైతన్న ఒక్క రూపాయి కూడా కట్టకుండా తాను చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం కూడా మనందరి ప్రభుత్వమే చెల్లిస్తోంది. ► వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.1,834 కోట్లు, ఉచిత పంటల బీమా కింద రూ.7,802 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,976 కోట్లు, విత్తన సబ్సిడీ కింద రూ.1,286 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ.45 వేల కోట్లు..చివరకు ఆక్వా జోన్లలో రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం ఇదే. రైతు కుటుంబాలకు మంచి జరిగేందుకు, రైతన్నకు తోడుగా ఉండేందుకు రూ.1.75 లక్షల కోట్లు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. 62 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయం మీద ఇలాంటి పనులు చేయాలన్న ఆలోచన చంద్రబాబు ఎందుకు చేయలేదు? కనీస మద్దతు ధర కల్పించాం ► గతంలో బాబు ఐదేళ్ల పాలనలో 17,94,000 మంది రైతన్నల వద్ద రూ.40,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. మన ప్రభుత్వ పాలన నాలుగేళ్లలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తూ ఈ క్రాప్ తెచ్చి ఆర్బీకేల ద్వారా 33 లక్షల మంది రైతన్నల దగ్గర నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగలిగాం. ఇతర పంటల కొనుగోలుకు కనీస మద్దతు ధర కేంద్రం చెప్పకపోయినా ఆర్బీకేల్లో జాబితాలు పెట్టి కనీస మద్దతు ధర ఇచ్చాం. రూ.8 వేల కోట్లు వెచ్చించి ఇతర పంటలూ కొనుగోలు చేశాం. ► సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు ఎలా నిర్వీర్యం చేశారో అందరం చూశాం. మనం ఆ పథకానికి నిజమైన అర్థం చెబుతూ పంట రుణాలు తీసుకుంటే ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా కల్పించాం. వ్యవసాయం ఒక్కటే రైతన్నకు సరిపోదని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాం. పాడి రైతులకు మంచి చేశాం. గతంలో తక్కువ ధర చెల్లిస్తూ చంద్రబాబు తన హెరిటేజ్‌కు, మిత్రుల డెయిరీలకు మేలు చేశారు. మనం సహకార రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చాం. పాడి రైతులకు పాల వెల్లువ ద్వారా లీటరుకు రూ.10 నుంచి రూ.22 వరకు అదనపు ఆదాయం వచ్చేలా చేశాం. అప్పుడు స్కీములు లేవు.. స్కాములే ► చంద్రబాబు అధికారంలోకి రావాలనుకునేది ప్రజలకు మంచి చేయడానికి కాదు. కేవలం తాను, తనతోపాటు ఒక గజదొంగల ముఠా, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. వీళ్లకు మేలు చేయడానికే. రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకొనేందుకు మాత్రమే. ► వాళ్ల హయాంలో ఒక్కటంటే ఒక్క మంచి స్కీముందా? కేవలం స్కాములు మాత్రమే జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్, మద్యం, ఇసుక, రాజధాని భూములు ఇలా ఎక్కడ చూసినా స్కాములే. ఇప్పుడూ అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేటు కూడా ఇప్పుడు తక్కువే. ఈ ప్రభుత్వ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నేరుగా ఇప్పటికే 53 నెలల కాలంలోనే రూ.2.40 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లింది. ► చంద్రబాబు హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్లాయి? ఈ నిజాల గురించి అందరూ ఆలోచించాలి. మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు మారుతున్నాయి? ఇంగ్లిషు మీడియం ఎందుకు వచ్చింది? 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన కోసం ఐఎఫ్‌పీలు ఎందుకు పెడుతున్నారు? 8వ తరగతిలో ట్యాబులు ఎందుకు పెట్టగలుగుతున్నాం. టెక్ట్స్ బుక్‌లో ఒక పేజీ ఇంగ్లిషులో, మరో పేజీ తెలుగులోకి ఎందుకు మారింది? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో పిల్లల చదువులు, బడులు ఎందుకు మారలేదో ఆలోచించండి. ► గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఆస్పత్రులకు వెళితే పక్కన పెట్టే పరిస్థితి. గతంలో 1,058 ప్రొసీజర్లు ఉండగా, నేడు 3,300 ప్రొసీజర్లకు పెంచి పథకం పరిధిని విస్తరించాం. 1,600 పైచిలుకు 104, 108 వాహనాలు కొనుగోలు చేశాం. 108కు ఫోన్ చేసినా, 104కు ఫోన్ చేసినా గ్రామాల్లోనే ఇంటికి వచ్చి.. వైద్యం అందిస్తున్నారు. పేదవాడు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని పరితపిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం ఇదే. ► వ్యవసాయం, చదువులు, ఆరోగ్య రంగం ఇలా ఏ రంగం తీసుకున్నా కనీవినీ ఎరుగని మార్పులు కనిపిస్తున్నాయి. అక్కచెల్లెమ్మల సాధికారత సాధించాం. దిశ యాప్ 1.24 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో కనిపిస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు వచ్చి మీకు అండగా, తోడుగా నిలిచే గొప్ప వ్యవస్థ. గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు కనిపిస్తున్నారు. ► పేదలకు సొంత ఇంటి కల ఉంటుంది. ఆ కలను నిజం చేశాం. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఒక్కో ఇల్లు పూర్తయితే ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి పెట్టినట్లవుతుంది. ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు? మీ బిడ్డ హయాంలో ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి. ► మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం చేతకాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మద్దతు ఉండదు. దత్తపుత్రుడి వద్దకు వెళ్లి సపోర్ట్ లేకపోతే నేను బతకలేనని చెప్పలేడు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే. రాబోయే రోజుల్లో చంద్రబాబు సైన్యం అబద్ధాలు, మోసాలు మరింతగా పెరుగుతాయి. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామంటారు. ఆ అబద్ధాలు నమ్మకండి. మీకు మంచి జరిగిందా, లేదా అన్నది మాత్రమే చూడండి. చంద్రబాబు హయాంలో వరుసగా కరువు ► గడిచిన 53 నెలల కాలంలో దేవుడి దయతో నాలుగేళ్లలో ఎక్కడా కరువు లేదు. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లూ కరువే. అయినా రైతుల తరఫున బీమా సొమ్ము ప్రభుత్వమే కట్టాలని, రైతన్నకు తోడుగా ఉండాలని, ప్రతి రైతుకూ బీమా అందాలనే ఆలోచన చేయలేదు. కరువు తాండవిస్తున్నా చంద్రబాబు.. రైతుల దగ్గర బీమా ప్రీమియం రూ.1,250 కోట్లు లాగేసుకున్నాడు. ► మన ప్రభుత్వం నాలుగేళ్ల పరిపాలనలో పుష్కలంగా వర్షాలు పడినా ఇన్సూ్యరెన్స్ సొమ్ము కింద రూ.7,802 కోట్లు ఇచ్చింది. కరువు రావటం, రాకపోవటం మన చేతుల్లో లేకపోయినా, కరువు వస్తే ఆదుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఇది మనసున్న ప్రభుత్వానికి, మనసు లేని ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా. uమన ప్రాంతానికి దుర్భిక్ష పరిస్థితులు, కష్టాలు కొత్త కాదు. ఈ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా ఎక్కడా కరువు మండలంగా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాల్లో వర్షాభావంతో రైతన్నలకు కాస్త ఇబ్బందులు కలిగాయి. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోపే మీ బిడ్డ ప్రభుత్వం పరిహారం ఇస్తోంది. గతంలో ఎప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ సమయానికి ఇచ్చారా? ఇవ్వాల్సిన వారందరికీ ఇచ్చారా? మీ బిడ్డ హయాంలో అంతా సక్రమంగా జరుగుతున్నప్పుడు.. నాటి పాలకులు ఎందుకు చేయలేకపోయారు? ► 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బాబు మాటలు నమ్మి రైతులు ఓటేస్తే అధికారంలోకి వచ్చాక మోసం చేశాడు. ముష్టి వేసినట్లు రూ.15 వేల కోట్లు విదిల్చి చేతులు దులుపుకున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసేట్టుగా చేశాడు. అప్పటిదాకా ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరుగార్చారు. మిమ్మల్ని మా గుండెల్లో దాచుకుంటాం గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మధ్యలో చేతులెత్తేశాడు. దాంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరి కష్టాలను కళ్లారా చూసిన మీరు (సీఎం వైఎస్ జగన్).. తండ్రిని మించిన తనయుడిగా ప్రజలను ఆదుకుంటున్నారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. నేను రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా ద్వారా లబ్ధి పొందాను. ఆర్బీకేల వల్ల ఎంతో మేలు జరుగుతోంది. కనీస మద్దతు ధర ఆదుకుంటోంది. పొలంబడి ద్వారా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. మొత్తంగా మీ పథకాల వల్ల మా కుటుంబానికి రూ.2,52,000 లబ్ధి జరిగింది. మీ వల్ల మారుమూల ప్రాంతంలోని పేద విద్యార్థి ఐక్యరాజ్యసమితిలో కూర్చోగలిగాడు. మిమ్మల్ని మా గుండెల్లో పదిలంగా దాచుకుంటాం. – రమేష్, రైతు, గాజులపల్లి, అమడగూరు మండలం రాక్షస పాలనలోని చీకట్లను చీల్చిన నేత జగన్ రాష్ట్రంలో రాక్షస పాలనలో అలుముకున్న చీకట్లను చీల్చుకుంటూ అధికారం చేపట్టిన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. రైతుల కోసం దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ పేరుతో ఒక అడుగు వేస్తే.. ఆయన తనయుడు వైఎస్ జగన్ రైతు భరోసా, పరిహారం, ఆర్బీకే ఇలా.. ఎన్నో అడుగులు ముందుకేసి అండగా నిలిచాడు. ఇది రైతు ప్రభుత్వం అని నిరూపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రెయిన్గన్ల పేరుతో రూ.450 కోట్లు దోచేశారు. చంద్రబాబు ఏనాడూ రైతు సమస్యల గురించి పట్టించుకోలేదు. ఏం చేశారో చెప్పుకోలేక స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే (పల్లె రఘునాథరెడ్డి) కులం పేరుతో రెచ్చగొట్టి రాజకీయం చేస్తుండటం దౌర్భాగ్యం. – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే సమగ్ర భూసర్వే ద్వారా కొత్త చరిత్ర ► వంద సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగింది. భూ రికార్డులు సరిగా లేక వివాదాలు వస్తున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో విప్లవాత్మకంగా సమగ్ర భూసర్వే చేపట్టాం. తద్వారా భూముల రికార్డులు అప్డేట్ చేస్తున్నాం. భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతూ రైతన్నకు మంచి చేస్తున్నాం. ► రాష్ట్రంలో గతంలో ఎవరూ ఎప్పుడూ చేయని రీతిలో 19.31 లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ 20 సంవత్సరాలకు పైగా అసైన్డ్ భూములున్న వారికి హక్కులు కల్పిస్తున్నాం. 22ఏలో ఇరుక్కున్న చుక్కల భూములకు విముక్తి కల్పించాం. సర్వీస్ ఈనాం పట్టాలు ఉన్న కుల వృత్తుల రైతులకు సంబంధించి ఏకంగా 34.89 లక్షల ఎకరాలకు పూర్తి హక్కులతో యాజమాన్య హక్కులు కల్పిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదే. ► గతంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పండిన ఆహార ధాన్యాలు సగటున ఏటా 154 లక్షల టన్నులు. ఈ ప్రభుత్వ హయాంలో అది 166 లక్షల టన్నులకు పెరిగింది. మనసున్న మారాజు సీఎం జగన్ ముఖ్యమంత్రికి తమ కష్టాలు చెప్పుకున్న వ్యాధిగ్రస్తులు ఏడుగురికి రూ.5.5 లక్షల తక్షణ సాయం గంటల వ్యవధిలో చెక్కులు అందజేసిన కలెక్టర్ మెరుగైన వైద్యం కోసం చర్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసున్న మహారాజు అని మరోమారు చాటుకున్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధుల విడుదల కోసం మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన్ను తిరుగు ప్రయాణంలో విమానాశ్రయం వద్ద పలువురు వ్యాధిగ్రస్తులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారందరి కష్టాన్ని ఓపికగా విని.. తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబును ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ కొద్ది గంటల వ్యవధిలోనే వివిధ వ్యాధులతో బాధ పడుతున్న ఏడుగురికి తక్షణ సాయంగా రూ.5.5 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. –పుట్టపర్తి అర్బన్ (శ్రీసత్యసాయి జిల్లా) -
పుట్టపర్తి: వైఎస్సార్ రైతు భరోసా సీఎం జగన్ బహిరంగ సభ (ఫొటోలు)
-
సీఎం జగన్ సభకు జన సునామి
-
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎందుకు మీ బిడ్డ జగన్‌లా సంక్షేమం అందించలేదు: సీఎం జగన్