పత్తికొండ పర్యటనలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన బాధితులు
కర్నూలు: మాట ఇచ్చారంటే..కచ్చితంగా చేస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. యువకుడి శస్త్రచికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 33 లక్షలు మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం కుమారుడు క్షేమంగా ఇంటికి రావడంతో సీఎం పునర్జన్మ ప్రసాదించారని శనివారం పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని కలిసి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మద్దికెర గ్రామానికి చెందిన పూజారి చిదానంద, ఈరక్క సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరి కుమారుడు ఈరన్న (24) కూడా అదే వృత్తిలో ఉంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చూపించగా పేగు పాడైందని, మార్చాలని, ఇందుకు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించారు. పేదలు కావడంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక అల్లాడిపోయారు. జూన్ 1 వతేదీన పత్తికొండలో జరిగిన రైతు భరోసా కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రావడంతో ఎమ్మల్యే కంగాటి శ్రీదేవి, మద్దికెర జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి, మార్కెట్‌యార్డు డైరెక్టర్ భద్రయ్య సహకారంతో సీఎంను కలిశారు.
ఈరన్న ఆరోగ్య పరిస్థితి వివరించడంతో సీఎం వెంటనే జిల్లా కలెక్టర్, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేశారు. ఆపరేషన్‌కు రూ.33 లక్షలు ఖర్చు అవుతుందని అదికారులు చెప్పడంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పేగు మర్పిడి ఆపరేషన్ పూర్తి చేసుకుని ఈరన్న ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment