పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌ | Notification for filling up posts in Animal Husbandry Department | Sakshi
Sakshi News home page

పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

Published Mon, Nov 20 2023 4:14 AM | Last Updated on Mon, Nov 20 2023 12:02 PM

Notification for filling up posts in Animal Husbandry Department - Sakshi

సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులకు డిసెంబర్‌ 27న హాల్‌టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్‌ 31వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.

వేతనం రూ.22,460
ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్‌ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్‌ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. అభ్యర్థులు 18–42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి, విద్యార్హతలు, ఇతర వివరాలు ahd.aptonline.in, https://apaha- recruitment.aptonline.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తులు కూడా ఇదే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని నిర్ధేశిత రుసుములను డిసెంబర్‌ 10వ తేదీలోగా చెల్లించాలి. దరఖాస్తులను డిసెంబర్‌ 11వ తేదీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

ఇప్పటికే రెండు విడతల్లో 4,643 పోస్టుల భర్తీ
సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏలను నియమించారు. రేషనలైజేషన్‌ ద్వారా గ్రామ పరిధిలో 2–3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్‌గా వీఏహెచ్‌ఏలను నియమించి, అదనంగా ఉన్న వీఏహెచ్‌ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు
జిల్లా    పోస్టుల సంఖ్య
అనంతపురం    473
చిత్తూరు    100
కర్నూలు    252
వైఎస్సార్‌    210
నెల్లూరు    143
ప్రకాశం    177
గుంటూరు    229
కృష్ణా    120
పశ్చిమ గోదావరి    102
తూర్పు గోదావరి    15
విశాఖపట్నం    28
విజయనగరం    13
శ్రీకాకుళం    34

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement