
సాక్షి, గుంటూరు: జిల్లాలోని తెనాలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌లో ఉన్న కారు అదుపు తప్పి.. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది.
ఈ ప‍్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు కింద పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, తెనాలిలోని ఐతానగర్‌కు చెందిన ఇద్దరు మైనర్లు కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment