
సాక్షి, గుంటూరు: తెనాలి మార్కెట్ యార్డులో లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లపైకి లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కూతురితోపాటు తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. కూతురిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment