‘‘రెండు రోజులు ప్రచారం చేయలేని వాడు ఎమ్మెల్యే అవుతాడా?. హైదరాబాద్ ఫాంహౌస్‌లకు అలవాటు పడిన వాడు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాడా?. పార్ట్‌టైం పాలిట్రిక్స్ చేస్తే జనం నమ్ముతారా?. స్టంట్‌లలో డూపులను పెట్టినట్టు.. జనసేన సింబల్ కింద టీడీపీ నేతలతో పోటీ చేయిస్తావా?. ఇదేనా నిఖార్సయిన రాజకీయం?. ఇదేనా గోదావరి ప్రజల ముందుకెళ్లి తేల్చుకునే అంశం?’’ అంటూ పవన్‌కల్యాణ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లిపోయిన పవన్.. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది.. దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో.. సేనాని దమ్ము ఇంతేనా.. ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం.. స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు.
ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా.. క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా? పిఠాపురం ఒక్కదానికే ఆయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని.. బ్రాయిలర్ కోడి మళ్లీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు.
మరో వైపు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ పిల్లి మొగ్గలు వేస్తున్నారు. గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment