చంద్రముఖి-2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పలకరించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్స్‌లలో మెప్పించలేకపోయింది. తాజాగా ఆమె నుంచి వస్తునన మరో చిత్రం 'ఎమర్జెన్సీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ మూవీ నవంబర్ 24న విడుదల కానున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఆ సమయంలో విడుదల చేయడంలేదని తాజాగా కంగనా ప్రకటించింది. వచ్చే సంవత్సరంలో 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని విడుదల చేస్తామని ఆమె అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆమె తన ఎక్స్ ద్వారా ఇలా తెలిపారు.
'ఎమర్జెన్సీ అనేది నాకు సినిమా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా నా విలువ, నా పాత్రకు పరీక్ష. టీజర్ వల్ల వచ్చిన అద్భుతమైన స్పందన మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ఎమర్జెన్సీ విడుదల తేదీ గురించి అడుగుతున్నారు. కొన్ని కారణాల వల్ల ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేకపోతున్నాము. 2024లో సినిమా విడుదల ఉంటుంది. త్వరలో తేదీ కూడా ప్రకటిస్తాం.' అని కంగనా తెలిపారు. ఎమర్జెన్సీ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment