ఎమర్జెన్సీ చిత్రం.. కంగనా రనౌత్‌కు బెదిరింపులు | Kangana Ranaut Received Death Threats Before Emergency Movie Release, Check Out The Details | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ విడుదలకు ముందే కంగనా రనౌత్‌కు హత్య బెదిరింపులు

Aug 27 2024 10:41 AM | Updated on Aug 27 2024 12:31 PM

 Some Persons Warning To Kangana Ranaut For  Emergency Movie

బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై హత్య బెదిరింపులు వచ్చాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. కంగనా నిర్మించిన ఎమర్జెన్సీ సినిమానే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోసిస్తున్నారు.

సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే కంగనాపై ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో విక్కీ థామస్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య గురించి ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ' ఈ సినిమాలో అతన్ని (ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే) టెర్రరిస్ట్‌గా చిత్రీకరిస్తే, మీరు ఎవరి గురించి సినిమా తీస్తున్నారో ఆ వ్యక్తి (ఇందిరా గాంధీ)కి ఏమి జరిగిందో గుర్తుంచుకోండి? సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఆమెను ఎలా చంపారో గుర్తు చేసుకోండి. 

వారి మాదిరే మేమూ మా తల అర్పిస్తాం.. లేదా తల నరికివేయవచ్చు కూడా..' అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పాడు. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇద్దరూ ఇందిరాగాంధీపై కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎమర్జెన్సీ సినిమాలో ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను టెర్రరిస్ట్‌గా చూపిస్తే సహంచమని కంగనాను వారు హెచ్చరించారు. పంజాబ్‌లో వేర్పాటువాదం కోరుకొన్నవారిలో భింద్రన్‌వాలే ఒకరు అని తెలిసిందే. వారు మాట్లాడిన వీడియోను మహారాష్ట్ర, పంజాబ్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ కంగనా రనౌత్‌ షేర్‌ చేశారు.

ఈ విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకూ ఈ దేశంలో ఏమి జరుగుతోంది..? బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ఇలా బహిరంగంగానే బెదిరింపులకు దిగడమేంటి..? కేవలం భారతదేశ చరిత్రను తెరపై చూపించే ప్రయత్నం చేస్తే చంపేస్తామని వార్నింగ్‌ ఇస్తారా.. దేశంలో ఎంతో బలమైన ప్రధాన మంత్రులలో ఒకరిగా గుర్తింపు ఉన్న ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గురించి సినిమాగా చెప్పడం తప్పా..? అంటూ  దయచేసి మీ భద్రతను పెంచుకోండి అని కంగనా రనౌత్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement