బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే, దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 49 ఏళ్లు పూర్తి కానున్నాయి. 50వ ఏడాదిలోకి అడుగుపెడుతుంది. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ భారత్‌లో ఎమర్జెన్సీ విధించారు. 'ఎమర్జెన్సీ చీకటిరోజులు' అంటూ తాజాగా తను నిర్మిస్తున్న ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని కంగనా రనౌత్ ప్రకటించారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం 2024 సెప్టెంబర్ 6న విడుదల కానుందని కంగనా రనౌత్ తెలిపారు. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ఆమె పంచుకున్నారు. వాస్తవంగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్‌లోని 'మండి' నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
మణికర్ణిక ప్రొడక్షన్‌పై ఎమర్జెన్సీ చిత్రాన్ని కంగనా రనౌత్ నిర్మించారు. ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు ఆమె చెప్పారు. భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment