
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పెళ్లిపై తన మనసులోని మాటను బటయపెట్టింది. అందరిలాగే తనకు కూడా వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలని ఉందని చెప్పింది. అయితే దానికి సరైన సమయం రావాలని, అప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపింది.
పదవిలో ఉండగానే పెళ్లి!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనాకు పెళ్లిపై ఓ ప్రశ్న ఎదురరైంది. ‘ఎంపీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘దేవుడి దయ వల్లే అదే జరగాలని కోరుకుంటున్నాను. ఎంపీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఈ పదవి కాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఏం లాభం’ అని కంగనా నవ్వుతూ బదులిచ్చింది. 2024 ఎన్పికల్లో కంగనా.. బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచింది. 2029 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ లోపే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కంగానా భావిస్తున్నట్లు ఉంది.
పెద్దల సమక్షంలో పెళ్లి జరగాలి
అయితే పెళ్లి గురించి కంగనా మాట్లాడడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతి అమ్మాయి తన పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ గురించి కలలు కంటుంది. నేను కూడా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తాను. పెళ్లి చేసుకోవాలని, నాకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. రానున్న ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటాను. అయితే అది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితేనే చేసుకుంటాను. నా పెళ్లి పెద్దల సమక్షంలో జరగాలని కోరుకుంటున్నాను’అని కంగనా తెలిపింది.
(చదవండి: స్త్రీ-2 దెబ్బకు షారూక్ జవాన్ రికార్డ్ బ్రేక్.. ఎన్ని కోట్లంటే?)
ఇక సినిమాల విషయానికొస్తే.. కంగనా దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల వాయిదా వేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment